చాలా తక్కువ దరకు 20,000 mAh Mi పవర్ బ్యాంక్ 2i

|

షియోమి కొత్తగా ఇండియాలో 20000 mAh Mi పవర్ బ్యాంక్ 2i ని విడుదల చేసింది. ఈ కొత్త Mi పవర్ బ్యాంక్ కేవలం బ్లాక్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే వస్తుంది. దీని యొక్క ధర కేవలం 1,499 రూపాయలు మాత్రమే. ఇది ఇప్పటికే Mi.com లో అందుబాటులో ఉంది. ఈ కొత్త Mi పవర్ బ్యాంక్ 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.

చాలా తక్కువ దరకు 20,000 mAh Mi పవర్ బ్యాంక్ 2i

 

ఇది అధిక సాంద్రత కలిగిన లిథియం పాలిమర్ బ్యాటరీలతో అనుసంధానించబడి ఉంది. ఇది రెండు USB పోర్ట్‌లకు ఒకే సారి మద్దతు ఇస్తుంది. అంతే కాకుండా దీనిని రెండు మార్గాల ద్వారా శ్రీఘ్రముగా ఛార్జింగ్‌ను చేయడానికి కూడా మార్గమును కలిగి ఉంది . షియోమి తన వెబ్‌సైట్‌లో 10000 mAh Mi పవర్ బ్యాంక్ 2i ని కూడా 899 రూపాయలకు జాబితా చేసింది.

స్పెసిఫికేషన్స్:

స్పెసిఫికేషన్స్:

20000 mAh Mi పవర్ బ్యాంక్ 2i ను ఉపయోగించి రెడ్‌మి K20 ప్రో లేదా రెడ్‌మి నోట్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ ను మూడుసార్లు పూర్తిగా ఛార్జ్ చేయవచ్చని షియోమి పేర్కొంది. దీని ద్వారా iOS పరికరాలను కూడా ఛార్జ్ చేయవచ్చు. ఇందులో భాగంగా ముక్యంగా ఐఫోన్ 8 ను సుమారు 7 సార్లు పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఇది రెండు USB స్లాట్‌లను కలిగి ఉండడం వలన మన స్మార్ట్ ఫోన్ యొక్క అవసరాలకు సరిపోయేలా ఒకే సారి తెలివిగా రెండింటికి ఛార్జ్ ని సర్దుబాటు చేస్తుంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా మద్దతు ఇస్తుంది.

పవర్ బ్యాంక్ ప్రొటెక్షన్:

పవర్ బ్యాంక్ ప్రొటెక్షన్:

పవర్ బటన్‌ను రెండు సార్లు నొక్కడం ద్వారా పవర్ బ్యాంక్ ఆక్టివేట్ అవుతుంది. అంతేకాకుండా ఇది 2-గంటల ముందే సూచన ఇవ్వగల తక్కువ పవర్ ఛార్జింగ్ మోడ్ ఉంది. ఈ మోడ్ బ్లూటూత్ హెడ్‌సెట్‌లు మరియు ఫిట్‌నెస్ బ్యాండ్‌లకు అనుకూలంగా ఉంటుంది. 20000 ఎమ్ఏహెచ్ Mi పవర్ బ్యాంక్ 2i ఉష్ణోగ్రత నిరోధకత, షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్, రీసెట్ మెకానిజం, ఇన్పుట్ ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్, అవుట్పుట్ ఓవర్ కారెంట్ ప్రొటెక్షన్, అవుట్పుట్ ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్షన్, ఓవర్ఛార్జ్ మరియు ఓవర్-డిశ్చార్జ్ ప్రొటెక్షన్, మరియు పిటిసి ప్రొటెక్టివ్ సహా తొమ్మిది పొరల సర్క్యూట్ చిప్ ప్రొటెక్షన్ను అందిస్తుంది.

పవర్ బ్యాంక్ సూచనలు:
 

పవర్ బ్యాంక్ సూచనలు:

బ్యాటరీ వినియోగదారులను హెచ్చరించడానికి పవర్ బ్యాంక్ LED సూచికతో వస్తుంది మరియు ఛార్జింగ్ ప్రయోజనాల కోసం మైక్రో-యుఎస్బి పోర్టును కలిగి ఉంది. 20000 ఎంఏహెచ్ Mi పవర్ బ్యాంక్ 2i యొక్క పరిమాణం 150.6x72.3x26.3mm. 18W ఛార్జర్ ద్వారా దీని యొక్క మొత్తం ఛార్జింగ్ సమయం 6.7 గంటలు మరియు 10W ఛార్జర్ ఉపయోగించి సుమారు 10 గంటలు అని జాబితా చేయబడింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
20000mah mi power bank 2i india launched rs 1499 mi com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X