ఆర్డర్ల మీద ఆర్డర్లతో దూసుకుపోతున్న 'యాపిల్ ఐఫోన్ 4ఎస్'

Posted By: Staff

ఆర్డర్ల మీద ఆర్డర్లతో దూసుకుపోతున్న 'యాపిల్ ఐఫోన్ 4ఎస్'

యాపిల్ ప్రపంచంలో ఉన్న మొబైల్ కంపెనీలకు మార్గదర్శి. యాపిల్ ప్రపంచంలో ఎక్కువ రెవిన్యూని ఆర్జించే కంపెనీ. యాపిల్ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్దానాన్ని కలిగిన కంపెనీ. అలాంటి యాపిల్ మొబైల్ మార్కెట్లోకి ఎ వస్తువుని విడుదల చేసిన అది మార్కెట్లో ఓ సంచలనం. సరిగ్గా అలాంటి సంఘటనే ఒకటి దక్షణ కొరియాలో జరిగింది. దాని వివిరాలు సవినయంగా వన్ ఇండియా పాఠకులకు అందజేయడం జరుగుతుంది.

స్టీవ్ జాబ్స్ మరణం తర్వాత యాపిల్ కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన యాపిల్ ఉత్పత్తి ఐఫోన్ 4ఎస్. యాపిల్ ఐఫోన్ 4ఎస్‌కి దక్షణ కొరియాలో ఎంత డిమాండ్ ఏర్పడిందంటే.. ఆ దేశంలో యాపిల్ ఐఫోన్ 4ఎస్‌ని కొరియాలో అతి పెద్ద వైర్‌లెస్ సంస్దలు అయిన ఎస్‌కె టెలికామ్, కెటి టెలికామ్ సంయుక్తంగా అందిస్తున్నాయి. యాపిల్ ఐఫోన్ 4ఎస్ ముందు ఆర్డర్స్‌ని తీసుకునే వెబ్‌సైట్ శుక్రవారం రాత్రి హాఠాత్తుగా డౌన్ అవడం జరిగిందని, ఏమిటా విషయం అని చూస్తే ఐఫోన్ 4ఎస్ కొసం సుమారు 200,000 ముందు ఆర్డర్స్ రావడంతో రెండు కంపెనీలు ఒక్కసారిగా విస్తుత పోయాయి.

దక్షణ కొరియా దేశంలో యాపిల్ ఐఫోన్ 4ఎస్ అమ్మకాలు అదరగొడుతున్నాయని యాపిల్ కంపెనీ ప్రతినిధులు కూడా ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ఈ సందర్బంలో యాపిల్ ప్రతినిధులు మాట్లాడుతూ కేవలం 24 గంటలలో 1మిలియన్ మొబైల్ అమ్మకాలను నమోదు చేయడం జరిగిందన్నారు. ఇక మొదటి వారం అమ్మకాలను గనుక చూసినట్లైతే 4మిలియన్ మొబైల్ అమ్మకాలను నమోదు చేయడం జరిగింది.

ఇక్కడ కస్టమర్స్ గమనించాల్సిన విషయం మరొకటి ఉంది. దేశంలో కొత్తగా యాపిల్ ఐఫోన్స్‌ని కొనుగోలు చేసిన కస్టమర్స్ ప్రముఖ సర్వీస్ ప్రొవైడర్ ఏటి&టిని తమ తమ మొబైల్ ఫోన్స్‌ని యాక్టివేట్ చేయించుకొవడం జరిగింది. నాలుగు రోజులలో ఏటి & టి సర్వీస్ ప్రొవైడర్ 1మిలియన్ యాపిల్ ఐఫోన్స్‌కి కనెక్షన్స్‌ని యాక్టివేట్ చేసింది. ఇది ఏటి & టి చరిత్రలో ఆల్ టైమ్ రికార్డుగా నిలిచింది.

ఐపోన్ 4ఎస్ విడుదల మొదట్లో కస్టమర్స్‌ని నిరాశపరచి నప్పటికీ, రాను రాను మార్కెట్లో సంచలనాలకు దారి తీస్తుంది. అంతేకాకుండా ఇప్పటి వరకు మొబైల్ ప్రపంచలో ఫాస్టుగా అమ్ముడైన మొబైల్ ఫోన్‌గా యాపిల్ ఐఫోన్ 4ఎస్ చరిత్ర సృష్టిస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot