ఐటీ రంగంలో ఈ ఏడాది కూడా భారీగా ఐటి కొలువులు

Posted By: Super

ఐటీ రంగంలో ఈ ఏడాది కూడా భారీగా ఐటి కొలువులు

12వ పంచవర్ష ప్రణాళిక (2012-17) కాలంలో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రభుత్వం ఒక ప్రాథమిక నివేదికను తయారు చేసి ఇటీవల ప్రణాళిక సంఘానికి అందజేసింది. కొత్త కొలువులు అనివార్యమని ప్రభుత్వం విశ్లేషించింది. ముఖ్యంగా నిర్మాణ రంగంలో చాలా ఎక్కువగా దాదాపు 20 లక్షల కొత్త ఉద్యోగాల ఆవశ్యకత ఉన్నట్టు రాష్ట్రం భావిస్తోంది.

నిర్మాణ రంగం తర్వాత వస్త్ర రంగం, ఆ తర్వాత సమాచార సాంకేతిక పరిజ్ఞానం(ఐటీ) రంగాల్లో ఎక్కువ కొలువులను అంచనా వేసింది. రాష్ట్రం 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలో 9 శాతం, 9.5శాతం, 10 శాతం అనే మూడు రకాల వృద్ధి రేట్లలో ఏదో ఒకటి సాధ్యమవుతుందని భావిస్తోంది. వివిధ రంగాల్లో ప్రగతి ఉన్నప్పుడే ఇంతటి వృద్ధిరేటు కనిపించేందుకు అవకాశముంది. ఆయా రంగాలు ఇంతటి ప్రతిభను కనబర్చాలంటే ఇప్పటికంటే చాలా ఎక్కువగా కొలువులు అవసరమవుతాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొనే ప్రభుత్వం కొన్ని అంచనాలకు వచ్చింది.

ఈ రంగం లో ఈ ఏడాది 20 శాతం వృద్ధి కనిపిస్తున్నందు వల్ల ఉద్యోగుల నియమకాలు కూడా జోరుగా సాగే అవకాశం ఉందని జాబ్‌ పోర్టల్‌ హెడ్‌ హాంక్సో.కామ్‌ సీఈవో ఉదయ్‌ సోథి చెప్పారు. ఐటీ రంగంలో ఉద్యోగుల వలసలు ఈ ఏడాది కూడా 14.4 శాతం వరకు ఉంటుందని ఆయన చెప్పారు. వలసలు ఎక్కువ కావడం వల్ల ఉద్యోగుల రిక్రూట్‌మెంట్‌ కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని సోథి తెలిపారు. కొత్తగా ఉద్యోగాల్లోకి చేరిన జూనియర్‌ లెవల్‌లో వలసలు 13.6 శాతంగాను, మిడ్‌ మేనేజ్‌మెంట్‌ స్థాయిలో 9.2 శాతం సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ స్థాయిలో 4.8 శాతంగాఉంటుందని ఆయన వివరించారు. కంపెనీల నుంచి వలసలు నివారించేందుకు వారికి అదనంగా పరిహారం చెల్లించాలను కుంటున్నట్లు ఆయన చెప్పారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot