2012లో కూడా శాంసంగ్ హావా.. జోస్యం..!

Posted By:

2012లో కూడా శాంసంగ్ హావా.. జోస్యం..!

 

స్మార్ట్ ఫోన్స్ రంగంలో ప్రస్తుతం నెంబర్ వన్‌గా కొనసాగుతున్న శాంసంగ్ 2012వ సంవత్సరంలో తనదైన శైలిలో దూసుకు పోతుందని జోస్యం చెబుతున్నారు టెక్నాలజీ నిపుణులు. సౌత్ కొరియా తయారీదారైన శాంసంగ్ మెమరీ ఛిప్స్, స్మార్ట్ ఫోన్స్‌ని ప్రపంచం వ్యాప్తంగా ఉన్న కస్టమర్స్‌కు తమ ఉత్పత్తులను అందజేస్తున్న విషయం తెలిసిందే. ఒకానోక దశలో ప్రపంచంలో ఎక్కువగా ఉత్పుత్తులను అమ్మే ఆపిల్ కంపెనీని తలదన్నే విధంగా శాంసంగ్ గట్టి పోటీనిచ్చింది.

ప్రపంచంలోకి ఎప్పుడైతే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రవేశించిందో ఒక్కసారిగా స్మార్ట్ ఫోన్స్‌‌కు మంచి ఊపు వచ్చింది. కొత్త కొత్త డిజైన్స్‌ని మార్కెట్లోకి ప్రవేశపెట్టి స్మార్ట్ ఫోన్ అంటే శాంసంగ్ అనే విధంగా పేరు తెచ్చుకుంది. మార్కెట్లో హెచ్‌టిసి, నోకియా, బ్లాక్ బెర్రీ హై ఎండ్ ఉత్పత్తులు ఉన్నప్పటికీ కస్టమర్స్ శాంసంగ్ ఉత్పత్తులకే మా ఓటు అంటూ అనే విధందా ప్రస్తుతం శాంసంగ్ ఉంది.

కస్టమర్స్ యొక్క ఆశలను వమ్ము చేయకుండా ఉండేందుకు గాను శాంసంగ్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్స్‌ని  ప్రవేశపెడుతూ, హై ఎండ్ OLED డిస్ ప్లే కలిగిన ఉత్ప్తతులను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇక 2012వ సంవత్సరంలో తన సత్తాని చాటేందుకు గాను శాంసంగ్ కొత్త నోట్ బుక్‌లను మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. 2012 ఫిబ్రవరిలో సరికొత్త టాబ్లెట్ పీసీని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. అత్యాధునిక ఫీచర్లతో డిజైన్ కాబుడుతున్న ఈ కంప్యూటింగ్ పీసీ పేరు తెలియాల్సి ఉంది.

శాంసంగ్ పీసీ ప్రత్యేకతలు:

* 11.6 అంగుళాల స్ర్కీన్,

* అత్యాధునిక రెటినా సామర్ధ్యం గల డిస్ ప్లే.

* పిక్సల్ రిసల్యూషన్ 2560 x 1600,

* అత్యాధునిక ఐస్ క్రీమ్ శాండ్‌‌విచ్ ఆపరేటింగ్ వ్యవస్థ,

* ఆండ్రాయిడ్ బీమ్ ఫీచర్,

* శక్తివంతమైన శ్యామ్‌సంగ్ ఎక్సినోస్ ప్రాసెసింగ్ వ్యవస్థ,

* క్లాక్ స్పీడ్ 2GHz,

* హై -డెఫినిషన్ సామర్ధ్యం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot