సోషల్ నెట్‌వర్క్‌లలో 2014ను నూతనంగా స్టార్ట్ చేయండి

శక్తివంతమైన సమాచార మాద్యమాల్లో ఒకటైన ‘సోషల్ నెట్‌వర్కింగ్ ' కమ్యూనికేషన్ రూపురేఖలనే మార్చేసింది. ఫేస్‌బుక్.. ట్విట్టర్ వంటి ప్రముఖ సామాజిక బంధాల వెబ్‌సైట్‌లు విస్తృత సమాచార వ్యవస్థను కలిగి ప్రపంచ కమ్యూనికేషన్ స్థితిగతులనే మార్చేసాయి. సోషల్ మీడియా మరింతగా విస్తరిస్తున్న నేపధ్యంలో అనేకమైన దుష్పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. లైంగిక వేధింపులు... జాతి విమర్శలు... ఆర్ధిక మోసాలు... సమాచార దోపడి ఇలా అనేక రకాలైన చట్టవ్యతిరేక కార్యకలాపాలు సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌ల ద్వారా ఎక్కవవుతున్నాయి. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లను వినియోగించుకుంటోన్న యువతను ఉద్దేశించి గిజ్‌బాట్ పలు సూచనలను చేస్తోంది.
జాతి, మతం ఇంకా ఇతర రాజకీయాలకు సంబంధించి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో విమర్శలు చేయరాదు. ఈ విధమైన రెచ్చగొట్టే చర్యలు రెండు వర్గాల మధ్య విబేధాలకు కారణమవుతాయి.
మరీ ముఖ్యంగా, మీ కుటుంబ సభ్యలకు సంబంధించిన సమచారాన్ని సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో పోస్ట్ చేయకండి.
అలాగే, మీ వ్యక్తిగత ఇంకా ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలను కూడా సోషల్ నెట్‌వర్క్‌లలో ప్రచరించకండి.
అభ్యంతరకరమైన కంటెంట్‌తో కూడిన ఫోటోలు ఇంకా వీడియోలను సోషల్ నెట్‌వర్క్‌లలో పోస్ట్ చేయకండి.
హైటెక్ చోరీలు పెరుగుతున్న నేపధ్యంలో మీ ప్రయాణాలకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ నెట్‌వర్క్‌ల ద్వారా షేర్ చేయకండి.
వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications