అమెరికా Vs చైనా, హువాయిని బ్లాక్ చేసిన 23 టెక్ కంపెనీలు

అమెరికా చైననాల మధ్య వాణిజ్య పోరు మరింతగా ముందరనుందే సంకేతాలు వినిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాపై మండి పడటం అలాగే హువాయి కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టడం వంటి అంశాలను పరిశీలిస్తే ఈ విషయం

|

అమెరికా చైననాల మధ్య వాణిజ్య పోరు మరింతగా ముందరనుందే సంకేతాలు వినిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాపై మండి పడటం అలాగే హువాయి కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టడం వంటి అంశాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. దీనికి తోడు గూగుల్ కూడా హువాయి కంపెనీ ఆండ్రాయిడ్ లైసెన్స్ రద్ధు చేయడం వంటి ప్రకటనలను చూస్తుంటే చైనా అమెరికాల మధ్య ట్రేడ్ వార్ పతాకస్థాయికి చేరినట్లేనని తెలుస్తోంది.

అమెరికా Vs చైనా, హువాయిని బ్లాక్ చేసిన 23 టెక్ కంపెనీలు

ఈ న్యూస్ ఇలా ఆందోళన రేపుతుంటే దాదాపు 23 టెక్ కంపెనీలు హువాయిని బ్లాక్ లిస్టులో ఉంచాయనే వార్తలు మరింత ఆందోళనలోకి నెట్టివేస్తున్నాయి. ఈ నేపథ్యంలో హువాయి కంపెనీ పరిస్థితి ఏంటనేది ఎవరికీ అంతుచిక్కడం లేదు. అసలు ఈ వార్ ఎక్కడ నుంచి మొదలైందో ఓ స్మార్ట్ లుక్కేయండి.

నేషనల్‌ ఎమర్జెన్సీ

నేషనల్‌ ఎమర్జెన్సీ

తాము ఎంతో కష్టపడి అభివృద్ధి చేసిన సాంకేతికతను చైనా తస్కరిస్తోందని ట్రంప్ మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా మేథో సంపత్తిని రక్షించేందుకు అధ్యక్షుడు ట్రంప్‌ ఏకంగా నేషనల్‌ ఎమర్జెన్సీనే విధించారు. దీనికి తోడు హువాయిను అణగదొక్కేందుకు ఆంక్షల కొరడాను ఝుళిపించారు. హువాయి కంపెనీని బ్లాక్ లిస్టులో ఉంచారు. దీంతో హువాయి అమెరికా సంస్థల వద్దనుంచి ఇకపై ఎటువంటి టెక్నాలజీని కొనుగోలు చేయలేదు.

రోబో సాంకేతికతను

రోబో సాంకేతికతను

అమెరికా సంస్థలు కూడా ఐటీ నేషనల్‌ ఎమర్జెన్సీ కారణంగా ఇకపై హువాయి సంస్థతో వ్యాపారాలు చేయలేవు. టెలికాం రంగంలో వినియోగించే రోబో సాంకేతికతను దొంగిలించిందనే ఆరోపణలను ఇప్పుడు హువాయి ఎదుర్కొంటోంది. దీంతోపాటు మరికొన్ని కారణాలు ఉద్రిక్తతను పెంచాయి.

సాంకేతికతను దొంగిలించిందనే ఆరోపణలు

సాంకేతికతను దొంగిలించిందనే ఆరోపణలు

హువాయి సంస్థకు అమెరికాకు చెందిన టి మొబైల్స్‌ వ్యాపార భాగస్వామిగా ఉంది. మొబైల్‌ఫోన్లను పరీక్షించేందుకు గానూ టి మొబైల్స్ తాపీ అనే రోబోను తయారు చేసింది. అయితే హువాయి కంపెనీ తన ఉద్యోగులను పంపించి ఈ రోబో చేయికి సంబంధించిన సాంకేతికతను దొంగిలించిందనే ఆరోపణలు వెలువెత్తాయి. దీని టెక్నాలజీని చైనా దొంగిలించిందనే ఆరోపణలతో అమెరికా దాన్ని బ్లాక్ లిస్టులో ఉంచినట్లు తెలుస్తోంది.

హువాయిపై ఆరోపణలు

హువాయిపై ఆరోపణలు

దీంతో పాటు అమెరికా బ్యాంకులను మోసం చేసి ఇరాన్‌కు పలు పరికరాలను విక్రయించినట్లు హువాయిపై ఆరోపణలు ఉన్నాయి. హువాయి యాజమాన్యం ఉన్న ఓ కంపెనీని ఇరాన్‌ మొబైల్‌ టెలికమ్యూనికేషన్‌కు అమెరికా విక్రయించింది. దీనికోసం ఆ కంపెనీ ఒక అమెరికా పౌరుడిని ఇరాన్‌లో ఉద్యోగిగా నియమించింది. ఆ కంపెనీలో తనకు ఆర్థిక ప్రయోజనాలు ఉన్న విషయాన్ని అమెరికా బ్యాంకులకు హువాయి వెల్లడించలేదు.

హువాయి కనుసన్నల్లో..

హువాయి కనుసన్నల్లో..

ఈ వ్యవహారం మొత్తం హువాయి సీఎఫ్‌వో మెంగ్‌ వాంగ్‌ఝూ కనుసన్నల్లోనే జరిగిందని అమెరికా భావించింది. విషయం బయటకు రావడంతో కెనడా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. త్వరలో ఆమెను అమెరికాకు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ఈమె హువాయి సీఈవో రెన్‌ జెంగ్‌ఫీ కుమార్తె అని ఆమె తండ్రి చైనా కమ్యూనిస్టు పార్టీకి అత్యంత సన్నిహితుడని విచారణలో తేలింది. అంతే కాకుండా ఆయన గతంలో పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీలో కూడా పనిచేశారు.

 ఆండ్రాయిడ్ OS లైసెన్స్ రద్దు

ఆండ్రాయిడ్ OS లైసెన్స్ రద్దు

ఇదిలా ఉంటే ఆన్ లైన్ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ హువాయి టెక్నాలజీస్ ఆండ్రాయిడ్ OS లైసెన్స్ ను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి హువాయి కంపెనీతో వ్యాపార కార్యకలాపాలు కొనసాగించే.. హార్డ్ వేర్ ట్రాన్స్ ఫర్, సాఫ్ట్ వేర్, టెక్నికల్ సర్వీసులను తక్షణమే నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.

25 కంపెనీలు బ్లాక్

25 కంపెనీలు బ్లాక్

హువాయి కంపెనీని బ్లాక్ చేసుకున్న 25 కంపెనీల లిస్ట్

మార్వెల్ టెక్నాలజీ, కీసైట్ టెక్నాలజీ, Nvidia, మ్యాగ్జిం ఇంటిగ్రేటెడ్, ఫినిష్,II-VI,టెక్సాస్ ఇనుస్ట్రుమెంట్స్ ,CommScope, మైక్రోసాఫ్ట్ ,Lumentum,Western Digital, NeoPhotonics,అడ్వాన్స్ మైక్రో డివైస్, Analog Devices,కోర్నింగ్ , స్కై వర్క్స్ ,ఇంటెల్, Qorvo, మిక్రాన్ టెక్నాలజీ, Seagate Technology, క్వాల్ కామ్, బ్రాడ్ కామ్ , ఫ్లెక్స్

 

జపాన్, ఆస్ట్రేలియా కూడా

జపాన్, ఆస్ట్రేలియా కూడా

ఈ కంపెనీలు హువాయి కంపెనీతో పనిచేసేందుకు గవర్నమెంట్ పర్మిషన్ కోసం ఎదురుచూస్తున్నాయి. అమెరికాతోపాటు జపాన్, ఆస్ట్రేలియా కూడా హువాయిపై నిషేధం విధిస్తూ నిర్ణయాలు తీసుకున్నాయి. హువావే గూడచర్యానికి పాల్పడుతున్నదన్న అభియోగంపై బ్రిటన్, జర్మనీలకు సర్ది చెప్పేందుకు అమెరికా ప్రయత్నాలు సాగిస్తోంది.

Best Mobiles in India

English summary
BAD NEWS! These 23 Well-Known Tech Companies Will Block Huawei

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X