సంచలన తీర్పు : హ్యాకర్‌కు 334 ఏళ్ల జైలు శిక్ష

Written By:

ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న ఆన్‌లైన్ దాడులకు సంబంధించి అనేక వార్తలను ఈ మధ్యకాలంలో మనం వింటున్నాం. ఇంటర్నెట్ వేదికగా సాగుతోన్న ఆన్‌లైన్ దాడుల్లో భాగంగా హ్యాకర్లు, తాము లక్ష్యంగా చేసుకున్న కంప్యూటర్‌లలోకి వైరస్ జొప్పంచి తమ ఆధీనంలోకి తెచ్చుకుంటారు. తరువాత , ఆ కంప్యూటర్‌లలోని విలువైన సమాచారాన్ని దొంగిలించి తమకు అనుకూలంగా వాడుకుంటారు.

సంచలన తీర్పు : హ్యాకర్‌కు 334 ఏళ్ల జైలు శిక్ష

మోసపూరిత ప్రకటనలతో భారీ హ్యాకింగ్‌కు పాల్పిడిన ఓ హ్యాకర్‌కు న్యాయస్థానం ఏకంగా 334 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. Onur Kopcak (26) , మరో 11 మంది హ్యాకర్లతో కలిసి మోసపూరిత ఆన్‌లైన్ స్కామ్‌లకు పాల్పడినట్లు కోర్టు నిర్థారించింది.

సంక్రాంతి బరిలో 20 బడ్జెట్ ఫ్రెండ్లీ 4జీ ఫోన్‌లు

ఈ కరుడుగట్టిన హ్యాకర్ బ్యాంకింగ్ ఇన్స్‌స్టిట్యూషన్స్ మాదిరిగా ఇంటర్‌ఫేస్‌ను రూపొందించించి అనేక కార్డ్ హోల్డర్‌లను మోసం చేసినట్లు న్యాయస్థానం నిర్థారించింది. ఈ నేరం క్రింద ఇతగాడికి 2013లోనే 199 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. ఇతగాడి ఉచ్చులో చిక్కి నష్టపోయిన బాధితులు ఒక్కొక్కరిగా వెలుగులోకి వస్తుండటంతో కేసును మరోసారి పున: సమీక్షించన న్యాయస్థానం ప్రధాన నిందితుడైన Onur Kopcakకు ఏకంగా 334 సంవత్సరాల జైలు శిక్షను ఖరారు చేసంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్పూఫ్ ఇ-మెయిల్స్

హ్యాకర్లను గుర్తించేందుకు స్మార్ట్ మార్గాలు

ఈమెయిల్ అకౌంట్‌లను టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు మోసపూరిత డేటాతో కూడిన స్పూఫ్ ఇ-మెయిల్స్‌ను నెటిజనుల అకౌంట్లకు పంపుతున్నారు. వీటిని అసలు నమ్మకూడదు.

ఫేక్ వెబ్‌సైట్స్, యాప్స్

హ్యాకర్లను గుర్తించేందుకు స్మార్ట్ మార్గాలు

ప్రముఖ వెబ్‌సైట్‌లను లక్ష్యంగా చేసుకుంటున్న హ్యాకర్లు సదరు వెబ్‌సైట్‌లను పోలిన నకిలీ వెబ్‌సైట్‌లను సృష్టించి విజిటర్ల పై మాల్వేర్‌తో దాడులకు పాల్పడుతున్నారు. కాబట్టి నకిలీ వెబ్‌సైట్స్ అలాను నకిలీ యాప్స్ జోలికి వెళ్లొద్దు. httpsతో మొదల్యే వెబ్ లింక్ బ్రౌజింగ్‌కు ఎంతో శ్రేయస్కరం.

మోసపూరిత డిస్కౌంట్ ధరలు

హ్యాకర్లను గుర్తించేందుకు స్మార్ట్ మార్గాలు

 ఇంటర్నెట్‌లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు భారీ డిస్కౌంట్ ధరలతో అనేక యాడ్ లింక్‌లు మనకు కనిపిస్తుంటాయి. ఈ లింక్స్ సురక్షితం కాదు.

ఫేక్ కాల్స్

హ్యాకర్లను గుర్తించేందుకు స్మార్ట్ మార్గాలు

పలనా బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నాము, మీ క్రెడిట్ కార్డ్ వివరాలు కాస్త చెబుతారా అంటూ తియ్యని మాటలతో కూడిన ఫేక్ కాల్స్ ఒకోసారి వస్తుంటాయి. సాధారణంగా ఏ బ్యాంక్ వారు ఇలాంటి ఫోన్ కాల్స్ చేయరు. కాబట్టి ఇటివంటి నకిలీ కాల్స్ కు స్పందించకండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
26 Year Old Hacker Was Sentenced To 334 Years in Prison. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting