సుప్రీం తీర్పుతో టెలికాం వినియోగదార్లకు ఇబ్బంది లేదు!!!

Posted By: Staff

సుప్రీం తీర్పుతో టెలికాం వినియోగదార్లకు ఇబ్బంది లేదు!!!

 

మాజీ కమ్యూనికేషన్ శాఖ మంత్రి ఎ.రాజా హయాంలో జారీచేసిన 122 టెలికాం లైసెన్స్‌లను రద్దుచేయాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రభావం వినియోగదార్లపై పెద్దగా ఉండబోదని భారత టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) పేర్కొంది. దేశంలో 90% టెలికాం వాటా పేరున్న కంపెనీల ఆధీనంలోనే ఉన్నదని, అందువల్ల కస్టమర్ల సేవలకు అంతరాయం పెద్దగా ఉండదని టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) చైర్మన్ జె.ఎస్.శర్మ అన్నారు.

లైసెన్స్‌లు రద్దయన కంపెనీల మార్కెట్ వాటా స్వల్పమని 90 శాతానికి పైగా వినియోగదార్లు పెద్ద కంపెనీల సేవలు పొందుతున్నందున ఇబ్బంది ఏమీ లేదని ఆయన పేర్కొన్నారు. దీనికితోడు ప్రస్తుత ఎంఎన్‌పి ద్వారా నెంబర్ మారకుండా కస్టమర్లు ఇతర ఆపరేటర్‌కు మారిపోగల సౌకర్యం కూడా ఉన్నదని శర్మ చెప్పారు.

సుప్రీంకోర్టు గురువారం 122 ‘2జి స్పెక్ట్రమ్’ లైసెన్స్‌లను రద్దుచేస్తూ వెలువరించిన తీర్పు నేపధ్యంలో యునినార్, టాటా టెలీ సర్వీసెస్, ఐడియా సెల్యూలర్, విడియోకాన్ తదితర టెలికాం కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ పరిమాణంతో, 2008 జనవరి 10కి ముందు లైసెన్స్‌లు పొందన భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఆర్‌కామ్ తదితర టెలికాం సంస్ధలకు లబ్ధి పొందే అవకాశం లభించింది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting