మెక్సికన్లు పోస్ట్ చేసిన ఫోటోలు 'రెచ్చగొట్టే' విధంగా..!

Posted By: Prashanth

మెక్సికన్లు పోస్ట్ చేసిన ఫోటోలు 'రెచ్చగొట్టే' విధంగా..!

 

3.6 మిలియన్ మెక్సికన్ యువకులు ఇంటర్నెట్‌లో అవతలి వారిని 'రెచ్చగొట్టే' విధంగా ఉన్న ఫోటోలను పోస్ట్ చేశారని ఒక డేటా రక్షణ సంస్ద తెలిపింది. ఐతే సుమారు 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ మంది యువకులు ఆన్‌లైన్‌లో తాము కలసిన వారితో డేటింగ్‌కు బయటకు వెళ్లినప్పడు ఎటువంటి ప్రమాదాలకు గురి కాలేదని, ప్రమాదాలు జరగడం కానీ గుర్తించలేదని కమీషనర్ 'ట్రినిడాడ్ జల్డీవార్' అన్నారు. దీనితో పాటు ట్రినిడాడ్ మాట్లాడుతూ మెక్సికోలో "వ్యక్తిగత డేటా రక్షణ ఒక కొత్త సంస్కృతి" ఆవిర్బవించిందని ఒక ప్రకటనలో తెలిపారు.

మెక్సికోలో 40 మిలియన్ల రెగ్యులర్ ఇంటర్నెట్ వినియోగదారులు ఉంటే...15శాతం మంది ఇ కామర్స్ కొనుగోలు మరియు విక్రయాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ... ఇందులో నాలుగింట ఒక వంతు టీనేజర్సే ఉన్నారు. 45 శాతం మంది గదుల్లో పర్సనల్ కంప్యూటర్లను కలిగి ఉండగా.. 30 శాతం మంది వారియొక్క అడ్రసు, ఫోన్ నెంబర్స్, స్కూల్ పేరు, ఫ్యామిలీ ఫోటోస్‌ని పోస్ట్ చేశారని ఏజెన్సీ తెలిపింది.

మెక్సికో ప్రజల వ్యక్తిగత డేటాని రక్షించేందుకు గాను ఫెడరల్ చట్టం ఉన్నప్పటికీ.. ఈ విషయంలో గొప్ప సవాళ్లను ఎదుర్కోంటున్నామని ట్రినిడాడ్ అన్నారు. ప్రతి రోజు మేము పెద్ద మొత్తంలో సమాచారాన్ని ట్రేస్ చేస్తున్నామని, ఇంటర్నెట్ పేజీలు సంప్రదించడం, ఇ-మెయిల్లు పంపండం, క్రెడిట్ కార్డ్ తో కొనుగోళ్లను, సమాచారం పెద్ద కంపెనీలు ప్రవాహం మా సెల్ ఫోన్ మరియు ధన్యవాదాలు నుండి కాల్స్ 2,500 సగటు పొందటానికి మాకు ప్రతి ప్రతి నెల వివరాలు

అందుతున్నాయని అన్నారు.

మెక్సికోలో ఉన్న మెక్సికన్ ఇంటర్నెట్ అసోసియేషన్ ప్రకారం తరచుగా నేరాలు, గుర్తింపు అపహరణ, మోసం, దోపిడీ, బాల అశ్లీల మరియు పైరసీ ఆన్ లైన్‌లో సంభవిస్తున్నాయని ట్రినిడాడ్ తెలిపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot