యాంటీవైరస్ ప్రోగ్రామ్స్ గురించి కొత్త సంగతులు!

|

వైరస్‌ల ముప్పు ఇంటర్నెట్ ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోన్న నేపథ్యంలో వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు అనేక యాంటీవైరస్ ప్రోగ్రామ్స్ మార్కెట్లో పట్టుకొస్తున్నాయి. ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్ ఫీచర్లతో లాంచ్ అవుతోన్న ఈ యాంటీవైరస్ ప్రోగ్రాములు హ్యాకర్ల ముప్పు నుంచి నెటిజనులను రక్షించే ప్రయత్నం చేస్తున్నాయి. Norton యాంటీ‌వైరస్, McAfree వైరస్ స్కాన్ ప్లస్, ట్రెండ్ మైక్రో ఇంటర్నెట్ సెక్యూరిటీ, బిట్ డిఫెండర్, ఏవీజీ యాంటీవైరస్ వంటి సాఫ్ట్‌వేర్‌లకు మార్కెట్లో ప్రత్యేకమైన ఆదరణ ఉంది. ఈ యాంటీవైరస్ ప్రోగ్రామ్స్ అనేవి 'కీ' సిగ్నేచర్స్‌తో కూడిన ప్రత్యేకమైన డేటా బేస్‌ను కలిగి ఉంటాయి. ఈ సిగ్నేచర్స్ హానకర కంటెంట్‌ను ఎప్పటికప్పుడు పసిగడుతూ వాటిని తొలగించే ప్రయత్నం చేస్తాయి. యాంటీవైరస్ ప్రోగ్రామ్‌లను పీసీలో రెగ్యులర్‌గా రన్ చేస్తుండటం వల్ల మాల్వేర్ రిస్కుల నుంచి బయటపడవచ్చు.

 

నమ్మలేని నిజం, ఆపిల్ వాచ్ మనిషి ప్రాణాన్ని కాపాడింది, ధన్యవాదాలు కుక్..నమ్మలేని నిజం, ఆపిల్ వాచ్ మనిషి ప్రాణాన్ని కాపాడింది, ధన్యవాదాలు కుక్..

 మూడు రకాల స్కాన్స్..

మూడు రకాల స్కాన్స్..

సహజంగా యాంటీవైరస్ ప్రోగ్రామ్స్ అనేవి మూడు రకాలు స్కాన్‌లను ఆఫర్ చేస్తాయి. ఫుల్ స్కాన్, కస్టమ్ స్కాన్, క్విక్ స్కాన్ ఇలా మూడు పేర్లతో ఈ స్కాన్స్ అందుబాటులో ఉంటాయి. వీటి పనితీరును పరిశీలించినట్లయితే...

ఫుల్ స్కాన్..

ఫుల్ స్కాన్..

యాంటీ వైరస్ ప్రోగ్రామ్‌లో ఫుల్ స్కాన్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవటం ద్వారా మీ కంప్యూటర్‌లోని అన్ని నెట్‌వర్క్ డ్రైవ్‌లతో పాటు హార్డ్‌డ్రైవ్స్, రిమూవబుల్ స్టోరేజ్, సిస్టం మొమురీ (ర్యామ్), సిస్టమ్ బ్యాకప్స్, స్టార్టప్ ఫోల్డర్స్, రిజిస్టరీ ఐటమ్స్ ఇలా అన్ని విభాగాలు స్కాన్ కాబడతాయి. ఈ ప్రొసీజర్ మొత్తం పూర్తవటానికి కొద్ది గంటల సమయం పడుతుంది. ప్రతి రెండు వారాలకు ఒకసారి ఫుల్ స్కాన్‌ను నిర్వహించుకున్నట్లయితే సెక్యూరిటీ పరంగా మీ డివైస్ అప్‌టు‌డేట్‌గా ఉంటుంది.

కస్టమ్ స్కాన్..
 

కస్టమ్ స్కాన్..

యాంటీ వైరస్ ప్రోగ్రామ్‌లో కస్టమ్ స్కాన్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవటం ద్వారా కావల్సిన డ్రైవ్‌లను మాత్రమే స్కాన్ చేసుకునే వీలుంటుంది. ఏదైనా పెన్‌డ్రైవ్ లేదా హార్డ్‌‌డిస్క్ డ్రైవ్‌ను స్కాన్ చేయవల్సి వచ్చినపుడు ఫుల్ స్కాన్ ఆప్షన్‌ను కాకుండా కస్టమ్ స్కాన్ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకున్నట్లయితే స్కాన్ ప్రాసెస్ త్వరగా పూర్తవుతుంది.

క్విక్ స్కాన్...

క్విక్ స్కాన్...

ఫుల్ స్కాన్‌ మాదిరిగానే క్విక్ స్కాన్ కూడా సిస్టమ్ మొత్తాన్ని స్కాన్ చేయటం జరుగుతుంది. అయితే ఈ ప్రొసీజర్ మొత్తం చాలా వేగంగా జరిగిపోతుంది. ఈ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవటం ద్వారా కామన్‌గా ఇన్‌ఫెక్ట్ అయిన ఫైల్స్ అలానే ఫోల్డర్స్‌తో, రన్నింగ్ ప్రాసెస్‌లో ఉన్న త్రెడ్స్, సిస్టం మొమురీ (ర్యామ్), స్టార్టప్ ఫోల్డర్స్, రిజిస్టరీ ఐటమ్స్ వంటి కీలక విభాగాలు స్కాన్ కాబడతాయి.

Best Mobiles in India

English summary
More and more virus detection techniques and techniques to detect threatening behaviors being added all the time.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X