విచిత్ర వీడియోలు (సీఈఎస్ 2013)

Posted By: Super

 విచిత్ర వీడియోలు (సీఈఎస్ 2013)

 

ప్రముఖ టెక్నాలజీ ఉత్పత్తుల ప్రదర్శన ‘సీఈఎస్ 2013’ మంగళవారం అమెరికాలోని లాస్ వేగాస్ కన్వెన్సన్ సెంటర్‌లో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైంది. 3,000 ప్రదర్శనకారులు ఈ కార్యకమ్రంలో తమతమ కొత్త ఉత్పత్తులను ప్రదర్శించనున్నట్లు ఓ ప్రాధమిక అంచనా. ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలు తమ ఆధునిక టెక్నాలజీని వినూత్న ఆవిష్కరణల రూపంలో ప్రపంచానికి చూపించాయి.  సీఈఎస్ 2013లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన మూడు ఆసాధారణ గాడ్జెట్‌ల వివరాలు వీడియోలు రూపంలో..........

నానో నెయిల్స్ (nano nails)

పై వీడియోను మీరు చూసినట్లయితే చేతి గోళ్లను టచ్‌స్ర్కీన్ స్టైలస్‌గా ఉపయోగించికుంటున్నతీరు మీకు అర్థమవుతుంది. ఈ స్టైలస్ గోళ్లను ప్రత్యేకించి ఆడవారి కోసం రూపొందించారు. టెక్‌టిప్స్ సంస్థ వీటిని సీఈఎస్ 2013వేదిక పై ప్రదర్శించింది. క్లివ్‌ల్యాండ్ క్లినిక్ సంస్థ వీటిని ప్రముఖ చర్మ వైద్య నిపుణులు మార్గదర్శకత్వంలో వృద్ధి చేసింది.

స్మూత్ టాల్కర్(Smooth Talker)

ప్రముఖ మొబైల్ యాంప్లిఫ్లయర్ల తయారీ సంస్థ స్మూత్ టాల్కర్ సెల్ సిగ్నిల్ రెట్టింపు చేసే ప్రత్యేక డివైజ్‌ను సీఈఎస్ వేదిక పై ఆవిష్కరించింది. సిగ్నల్‌ను రెట్టింపు చేసే ఈ డివైజ్‌ను  ఏకకాలంలో స్మార్ట్‌ఫోన్, ట్యాబ్లెట్ అలానే డేటా డాంగిల్‌కు అనుసంధానించుకోవచ్చు.

స్మార్ట్‌క్లియర్ (Smartklear):

 

టచ్‌స్ర్కీన్ డివైజ్‌ల స్ర్కీన్‌లను శుభ్రపరిచే క్రమంలో లెన్స్‌పెన్ సంస్థ స్మార్ట్‌క్లియర్ పేరుతో సరికొత్త క్లీనింగ్ గాడ్జెట్‌ను సీఈఎస్ వేదిక పై ఆవిష్కరించింది. ఈ స్మార్ట్‌క్లియర్ క్లీనింగ్ గాడ్జెట్ టచ్‌స్ర్కీన్‌ల పై ఉన్న దుమ్ము ధూళీ పదార్థాన్ని ఎప్పటికప్పుడు తొలగించి స్ర్కీన్‌ను కాంతివంతంగా ఉంచుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot