ఫోన్ IMEI నెంబర్ ట్యాంపర్ చేస్తే 3 సంవత్సరాల జైలు

IMEI ట్యాంపరింగ్‌కు పాల్పడే వారి పై కఠిన చర్యలు తీసుకునేందుకు టెలికం శాఖ సిద్ధమవుతోంది. సిద్ధం చేస్తున్న కొత్త రూల్స్ ప్రకారం ఐఎమ్ఈఐ నెంబర్ ట్యాంపరింగ్‌కు పాల్పడే వారు 3 సంవత్సరాల జైలు శిక్షను ఎదుర్కోవల్సి ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

15 అంకెల ఐఎమ్ఈఐ నెంబర్‌..

ప్రతి మొబైల్ లేదా స్మార్ట్‌ఫోన్‌కు 15 అంకెల ఐఎమ్ఈఐ నెంబర్‌ను తప్పనిసరిగా కేటాయించటం జరుగుతుంది. IMEI అంటే ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ నెంబర్ అని అర్థం. భవిష్యత్ అవసరాల కోసం ఈ నెంబరు ఉపయోగపడుతుంది.

మొబైల్‌ను గుర్తించటంలో ఐఎమ్ఈఐ నెంబర్ కీలకం...

ఫోన్ అపహరణకు గురైన సమయంలో పోలీసులను ఆశ్రయించాల్సి వస్తే తప్పనిసరిగా సదరు మొబైల్ ఐఎమ్ఈఐ (IMEI)నెంబర్‌ను ఎఫ్ఐఆర్ పత్రంలో పొందుపరచాల్సి ఉంటుంది. మొబైల్‌ను గుర్తించటంలో ఐఎమ్ఈఐ నెంబర్ కీలక పాత్ర పోషిస్తుంది.

18000 ఫోన్‌లు ఒకే IMEI నెంబర్‌ పై...

ఇటీవల ఓ కేసు విచారణలో భాగంగా ఒకటే IMEI నెంబర్‌ను కలిగి ఉన్న 18000 ఫోన్‌లను టెలికామ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రిసోర్స్ అండ్ మానిటరింగ్ సెల్ గుర్తించినట్లు సమాచారం. డూప్లికేట్ ఐఎమ్ఈఐ నెంబర్ల బెడద రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో టెలికాం శాఖ ఈ నిర్ణయం తీుసుకున్నట్లు తెలుస్తోంది.

దేశ వ్యాప్తంగా మొబైల్ చోరీలు పెరిగిపోతున్నాయి...

దేశ వ్యాప్తంగా మొబైల్ చోరీలు ఏటా అధిక శాతంలో నమోదవుతున్నాయి. మొబైల్ చోరీలను చేధించే క్రమంలో అనేక విధానాలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ప్రతీ మొబైల్ ఫోన్‌కు ఐఎమ్ఈఐ (IMEI)నెంబరు కీలకం. ఈ నెంబర్ సరిలేని నకిలీ మొబైల్ హ్యాండ్‌సెట్‌లను బ్లాక్ మార్కెట్లో యథేచ్చగా విక్రయిస్తున్నారు.

మీ ఫోన్‌ ఐఎమ్ఈఐ నెంబర్‌ తెలుసుకోవాలంటే..?

ఫోన్ ‘ఐఎమ్ఈఐ' నెంబర్‌ను తెలుసుకునేందుకు ఇదుకో సులువైన పద్ధతి. ఏ మోడల్ ఫోన్‌లో అయినా సరే *#06#'కు డయిల్ చేయటం ద్వారా 15 అంకెలతో కూడిన మీ ఫోన్ ఐఎమ్ఈఐ నెంబరును తెలుసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ యూజర్లు..

ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఫోన్‌లోని Settings > About > IMEIలోకి వెళ్లటం ద్వారా ఐఎమ్ఈఐ నెంబర్‌ను తెలుసుకోవచ్చు.

ఐఫోన్ యూజర్లు..

ఐఫోన్ యూజర్లు తమ ఫోన్‌లోని Settings > General > Aboutలోకి వెళ్లి IMEI నెంబర్‌ను తెలుసుకోవచ్చు. చాలా వరకు స్మార్ట్‌ఫోన్‌లలో ‘ఐఎమ్ఈఐ' నెంబర్‌ను ఫోన్ వెనుక భాగంలోని బ్యాటరీ క్రింద భాగంలో చూడొచ్చు.

ఫోన్ వెనుక భాగంలో....

చాలా వరకు స్మార్ట్‌ఫోన్‌లలో ఐఎమ్ఈఐ నెంబర్‌ను ఫోన్ వెనుక భాగంలోని బ్యాటరీ క్రింద భాగంలో చూడొచ్చు. ఏ మోడల్ ఫోన్‌లో అయినా సరే *#06#'కు డయిల్ చేయటం ద్వారా 15 అంకెలతో కూడిన మీ ఫోన్ ఐఎమ్ఈఐ నెంబరును తెలుసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
3 Years Jail Term For Tampering With Mobile IMEI Number: New Rules Being Framed. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot