ఇంటర్నెట్‌కి చైనాలో కంప్యూటర్ కన్నా సెల్‌ఫోనే బెస్ట్: చైనీయులు

Posted By: Super

ఇంటర్నెట్‌కి చైనాలో కంప్యూటర్ కన్నా సెల్‌ఫోనే బెస్ట్: చైనీయులు

బీజింగ్: చైనా ఎలక్ట్రానిక్స్ రంగంలో ఓ రకంగా చెప్పాలంటే ముందంజలో ఉన్నట్లే. అందుకు కారణం చైనాలో ఉన్నటువంటి ప్రజలు టెక్నాలజీని బాగా ఉపయోగించడమే. దాదాపు చైనా మొత్తం మీద 303 మిలియన్ జనాభా ఇంటర్నెట్‌ని వారియొక్క మొబైల్ ఫోన్స్ ద్వారానే కనెక్ట్ అయి వాడుతున్నారని చైనా అసోసియేషన్ కమ్యూనికేషన్స్ ఎంటర్ ప్రైజెస్ వైస్ సెక్రటరీ క్వియాన్ జింగ్వన్ వెల్లడించారు. దేశంలో ఇంటర్నెట్ వాడుతున్నటువంటి వారి శాతం 66.2 శాతంగా పరిగణింపబడిదని తెలిపారు.

వరల్డ్ వైడ్ వెబ్ లోకి లాగిన్ అవ్వడానికి 43 మిలియన్ల ప్రజలు మొబైల్స్‌నే వాడడం జరుగుతుందన్నారు. ఇంటర్నెట్ వాడేటటువంటి జనాభాకి ఇది దాదాపు 10శాతంకు సమామని అన్నారు. దేశంలో ఉన్నటువంటి పరిశీలకులు అంచనా ప్రకారం 2013కల్లా చైనాలో ఉన్నటువంటి ప్రజలు దాదాపుగా ఇంటర్నెట్‌ని ఉపయోగించడానికి కంప్యూటర్ల కంటే కూడా మొబైల్ ఫోన్స్‌నే ప్రిఫర్ చేస్తారనేది వాళ్శ నమ్మకం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot