రాబోయే రోజుల్లో గుర్తింపు కార్డు అవసరం లేకుండా శరీరంలోనే మైక్రోచిప్‌

సాధారణంగా ఇప్పుడు ప్రతిదానికీ గుర్తింపు కార్డు అడుగుతున్నారు. ఆ సందర్భాల్లో కచ్చితంగా గుర్తింపు కార్డు మన వెంట వుండాల్సిందే.

By Anil
|

సాధారణంగా ఇప్పుడు ప్రతిదానికీ గుర్తింపు కార్డు అడుగుతున్నారు. ఆ సందర్భాల్లో కచ్చితంగా గుర్తింపు కార్డు మన వెంట వుండాల్సిందే. అయితే ఇప్పుడు గుర్తింపు కార్డులను గుర్తు పెట్టుకొని మరీ వెంట తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. తమ శరీరమే గుర్తింపు కార్డుగా ఉపయోగపడుతుంది. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, ప్రైవేటు ఆఫీసు, స్కూల్స్‌, కాలేజీల్లోనూ గుర్తింపు కార్డులు తప్పని సరిగ్గా చూపించాల్సిన అవసరం ఉంటుంది. తమ శరీరంలోనే మైక్రోచిప్‌లను అమర్చుకొంటే... ఇక శరీరమే గుర్తింపు కార్డు. మర్చిపోతామన్న బెంగా లేదు. ఈ విధానాన్ని స్వీడిష్‌ ప్రజలు అనుసరిస్తున్నారు. రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ప్రతీచోటా ఐడీ కార్డు చూపించాల్సిన అవసరం లేకుండా తమ శరీరాన్నే మైక్రోచిప్‌లతో నింపేస్తున్నారు.

మైక్రోచిప్‌ లను అనుసంధానం చేసుకునే ప్రక్రియ....

మైక్రోచిప్‌ లను అనుసంధానం చేసుకునే ప్రక్రియ....

మన శరీరంలో మైక్రోచిప్‌ లను అనుసంధానం చేసుకునే ప్రక్రియ పెద్ద కష్టమేమీ కాదుట. ఇంజక్షన్‌ చేయించుకున్నంత తేలికగా మన శరీరంలో మైక్రోచిప్‌లను అమర్చుకోవచ్చు. స్వీడన్‌లోని ఆయా ఉద్యోగులకు మైక్రోచిప్‌లను అమర్చేందుకు వారు వర్క్‌ ఏరియాల్లోనే అందుబాటులో ఉంటారు. ఈ విధానాన్ని స్వీడన్‌కు చెందిన బయోహ్యాకింగ్‌ గ్రూప్‌ బియానిఫికెన్‌ ప్రాచుర్యంలోకి తెచ్చింది.

 కంప్యూటర్‌ లాగిన్‌ వంటి చిన్న చిన్న పనులకు....

కంప్యూటర్‌ లాగిన్‌ వంటి చిన్న చిన్న పనులకు....

స్వీడన్‌తో పాటు యూఎస్‌, యూకే, ఫ్రాన్స్‌, జర్మనీ, మెక్సికో వంటి దేశాల్లో ప్రజలు తమ చేతుల్లో మైక్రోచిప్‌లను అమర్చుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కంప్యూటర్‌ లాగిన్‌ వంటి చిన్న చిన్న పనులకు కూడా మైక్రోచిప్‌లు అమర్చుకోవడం చూస్తుంటే టెక్నాలజీ పట్ల యువత ఎంతగా ఆకర్షితులవుతున్నారో అర్థమవుతోందని బయోఫికెన్‌ పేర్కొంది. శరీరాన్నే ఒక ప్రయోగశాలగా మార్చిన ఈ ఆధునిక యుగంలో స్మార్ట్‌ఫోన్‌, స్మార్ట్‌వాచ్‌ల వంటి అనేక రకాల గాడ్జెట్లను వెంట తీసుకెళ్లే అవసరం లేకుండా, చేతి వేళ్లను ఆడించడం ద్వారా పనులను సులభతరం చేసుకోవచ్చని బయోఫికెన్‌ సలహా ఇస్తోంది.

ఈ మైక్రోచిప్‌లు హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశాలు చాలా తక్కువ....

ఈ మైక్రోచిప్‌లు హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశాలు చాలా తక్కువ....

కాగా, బయోమెట్రిక్‌ విధానంతో రూపొందించిన ఈ మైక్రోచిప్‌లు హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో దాదాపు 10 మిలియన్ల మంది మైక్రోచిప్‌లను అమర్చుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారట.

మైక్రోచిప్‌ లను అనుసంధానం చేసుకునే ప్రక్రియ....

మైక్రోచిప్‌ లను అనుసంధానం చేసుకునే ప్రక్రియ....

మన శరీరంలో మైక్రోచిప్‌ లను అనుసంధానం చేసుకునే ప్రక్రియ పెద్ద కష్టమేమీ కాదుట. ఇంజక్షన్‌ చేయించుకున్నంత తేలికగా మన శరీరంలో మైక్రోచిప్‌లను అమర్చుకోవచ్చు. స్వీడన్‌లోని ఆయా ఉద్యోగులకు మైక్రోచిప్‌లను అమర్చేందుకు వారు వర్క్‌ ఏరియాల్లోనే అందుబాటులో ఉంటారు. ఈ విధానాన్ని స్వీడన్‌కు చెందిన బయోహ్యాకింగ్‌ గ్రూప్‌ బియానిఫికెన్‌ ప్రాచుర్యంలోకి తెచ్చింది.

 ఈ ప్రక్రియ వల్ల....

ఈ ప్రక్రియ వల్ల....

అంతా మంచే కాదు దీనిలో ఓ చెడు కూడా దాగివుంది. ఈ ప్రక్రియ వల్ల ఇన్ఫెక్షన్లతో పాటు, జీవక్రియలపై చెడు ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని మైక్రోబయాలిస్టులు హెచ్చరిస్తున్నారు.

Best Mobiles in India

English summary
A Wisconsin technology company is offering its employees microchip implants that can be used to scan into the building and purchase food at work. Whether or not to get a chip is up to the employee to decide.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X