ఆ సైట్లు బ్లాక్, చూశారా.. ఇక అంతే..

Written By:

చేతిలో మొబైల్ దానికి ఇంటర్నెట్ ఉంటే చాలు చాలామంది చేసే పని పోర్న్ సైట్లు ఓపెన్ చేయడం. జియో ఉచిత ఆఫర్లు వచ్చిన తరువాత ఇది మరింతగా పెరిగిందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇప్పుడు అశ్లీల వెబ్ సైట్లపై కేంద్రం తన కొరడాను ఝళిపించింది. చిన్నారులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్న 3వేలకు పైగా అశ్లీల వెబ్‌సైట్లను బ్లాక్ చేశామని కేంద్రం తెలిపింది.

8జిబి ర్యామ్‌తో అసుస్ ఏఆర్‌ లాంచ్, దీనిపై ఆఫర్లే ఆఫర్లు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అశ్లీల కంటెంట్‌ వెబ్‌సైట్లను

పిల్లలను ప్రభావితం చేస్తున్న చిన్నవారి అశ్లీల కంటెంట్‌ వెబ్‌సైట్లను అడ్డుకునేందుకు 'సమగ్ర యంత్రాంగాన్ని' సిద్ధం చేస్తున్నామని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు కేంద్రం శుక్రవారం తెలిపింది.

3,522 పోర్న్‌ సైట్లను

అయితే రెండు రోజుల్లో స్టేట్ రిపోర్టును దాఖలు చేయాలని సుప్రీం కేంద్రాన్ని కోరింది. గత నెలలో ఇలాంటి3,522 పోర్న్‌ సైట్లను నిషేధించినట్లు కోర్టుకు ప్రభుత్వం చెప్పింది.

పాఠశాలల్లో జామర్లు ఏర్పాటు

అలాగే పాఠశాల ఆవరణలోనూ, స్కూలు బస్సులో జామర్లను ఏర్పాటును పరిశీలించాలన్న కోర్టు వ్యాఖ్యలకు స్పందించిన కేంద్రం పాఠశాలల్లో జామర్లు ఏర్పాటు చేయాలని సీబీఎస్‌ఈని కోరామని తెలిపింది.

స్కూల్ బ‌స్సుల్లో

అయితే పాఠ‌శాల వ‌ర‌కు జామ‌ర్లు ఏర్పాటు చేయ‌డం కుదురుతుంది కానీ స్కూల్ బ‌స్సుల్లో కూడా జామ‌ర్ల ఏర్పాటు చేయ‌డం వీలు కాదని ధ‌ర్మాసనంతో చెప్పారు.

ఏదో ఒక ప‌రిష్కారాన్ని

దీనిపై ఏదో ఒక ప‌రిష్కారాన్ని త్వ‌ర‌లో రూపొందిస్తాంమని అడిష‌న‌ల్ సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ పింకీ ఆనంద్ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన బెంచ్‌కు వివరించారు.

రిపోర్టును రెండ్రోజుల్లోగా

ఈ నేపథ్యంలో అశ్లీల వెబ్‌సైట్ల ఏరివేత‌కు సంబంధించిన రిపోర్టును రెండ్రోజుల్లోగా ప్ర‌వేశ పెట్టాల‌ని కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
3,500 Child Pornographic Sites Blocked Last Month, Government Tells Supreme Court Read More At Gizbot Telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot