సముద్రం అడుగున 25 అంతస్థుల భవనాలు!

Written By:

ఇప్పుడు ప్రపంచాన్ని నడిపిస్తోంది ఏందంటే ఎవరైనా టక్కున చెప్పే సమాధానం టెక్నాలజీ.. అయితే పదేళ్ల క్రితం ఈ స్మార్ట్ టెక్నాలజీ గురించి అంతగా ఎవరికీ తెలిసీ ఉండదు. దాన్ని నమ్మరు కూడా. కాలం కంటే వేగంగా పరుగులు పెడుతున్న సాంకేతిక పరిజ్ఞాన విప్లవం ప్రపంచానికి కొత్త అనుభూతులను పరిచయం చేస్తున్నది. ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో మానవుడిని నడిపించి, నియంత్రించేది స్మార్ట్ టెక్నాలజీ అన్నది కాదనలేని వాస్తవం. టెక్నాలజీ ఆధారంగా ఆకాశాన్ని అంటుకున్నాయా అనిపించే ఆకాశహర్మ్యాలు, 3డీ ప్రింటెడ్ ఇళ్లు ఇవన్నీ ప్రస్తుతం మానవుడిని అబ్బురపరిస్తున్నాయి.

Read more: షాకింగ్ న్యూస్: రానున్న రోజులు అత్యంత ప్రమాదకరం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నేడు కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీతో

నేడు కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీతో చందమామతో చెలిమికి, అంగారకుడిని అక్కున చేర్చుకోవడానికి జరుగుతున్న విస్తృత పరిశోధన నేపథ్యంలో మానవ ఆలోచన, మేథస్సుకు హద్దెక్కడ అని వెతుక్కోవల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది.

మరో వందేండ్లలో జలాంతర స్మార్ట్‌సిటీల నిర్మాణానికి

ఈ నేపథ్యంలో.. భూప్రపంచంపై వాహనాలు, యంత్రాల కాలుష్యానికి దూరంగా మరో వందేండ్లలో జలాంతర స్మార్ట్‌సిటీల నిర్మాణానికి మేధోమథనం జరుగుతున్నది. సముద్రంలోపల ఇళ్లు కట్టుకుని నివసించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయంటున్నారు శాస్ర్తవేత్తలు.

సముద్రాల అడుగున 25 అంతస్తుల భవనాల నిర్మాణానికి

సముద్రాల అడుగున 25 అంతస్తుల భవనాల నిర్మాణానికి ప్రపంచవ్యాప్తంగా భవన నిర్మాణశిల్పులు, పట్టణాభివృద్ధి నిపుణులు కసరత్తు ప్రారంభించారు.ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

నీటి అడుగున బుడగ నగరాల

నీటి అడుగున బుడగ నగరాల (బబుల్ సిటీలు) నిర్మాణం, వాటి సందర్శనకు ప్రత్యేకంగా రూపొందించే డ్రోన్ల రవాణా సౌకర్యం లాంటివి రానున్న కాలంలో రూపుదిద్దుకోనున్నాయి.

ఇక ప్రపంచంలో ఏదేశానికైనా

ఇక ప్రపంచంలో ఏదేశానికైనా విహార యాత్ర చేయాలనుకుంటే.. అక్కడికి సొంత ఇంటిని మోసుకెళ్లే రవాణా సాధనాల రూపకల్పనపై దృష్టిపెట్టామని వెస్ట్‌మినిస్టర్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు.

ది స్మార్ట్‌థింగ్స్ ఫ్యూచర్ లివింగ్ రిపోర్ట్‌లో

వందేండ్లలో మానవ జీవితంలో అనూహ్యంగా చోటుచేసుకోనున్న అనే అంశాలను ది స్మార్ట్‌థింగ్స్ ఫ్యూచర్ లివింగ్ రిపోర్ట్‌లో పొందుపరిచారు. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తి సంస్థ సామ్‌సంగ్ రంగం సిద్ధం చేస్తున్నది.

సాంకేతిక విప్లవంతో అందుబాటులోకి వచ్చిన ఇంటర్నెట్‌తో

వందేండ్ల క్రితం మన జీవితాలకు ఓ గుర్తింపు అంటూ లేదు. సాంకేతిక విప్లవంతో అందుబాటులోకి వచ్చిన ఇంటర్నెట్‌తో సమాచారాన్ని సునాయాసంగా చేరవేసుకోగలుగుతున్నాం. పలు విషయాలపై స్వీయ అధ్యయనం చేస్తున్నాం.

మన జీవితాలను మనమే నియంత్రించుకొంటున్నాం

మన జీవితాలను మనమే నియంత్రించుకొంటున్నాం అని ఖగోళశాస్త్రవేత్త డాక్టర్ మ్యాగీ అడ్రెయిన్ పొకాక్ అన్నారు. స్మార్ట్ నగరాల నివేదిక రూపకల్పనలో పొకాక్ కీలకంగా వ్యవహరించారు.

3డీ ప్రింటింగ్ టెక్నాలజీ ఇప్పటికే

3డీ ప్రింటింగ్ టెక్నాలజీ ఇప్పటికే మన జీవితాల్లోకి తొంగిచూసింది. మనకిష్టమైన వంటగాళ్ల (చెఫ్) నుంచి రుచికరమైన వంటలను డౌన్‌లోడ్ చేసుకొని ఆరగించే రోజులు చాలా సమీపంలోనే ఉన్నాయన్నారు.

ప్రస్తుత పరిణామాలు ఆరంభం మాత్రమే

ప్రస్తుత పరిణామాలు ఆరంభం మాత్రమేనని బ్రిటన్‌లోని స్మార్ట్‌థింగ్స్ ప్రాజెక్ట్ ఎండీ జేమ్స్ మొనిగన్ తెలిపారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 3D printed homes, underwater cities in future
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot