‘3జి’ ఫోన్‌ ఇక పై చవక ధరకే..?

Posted By: Prashanth

‘3G’ Become Easy..?

 

క్షణాల్లో డేటా డౌన్ లోడింగ్... ఆత్మీయులతో వీడియో కాలింగ్...  సౌకర్యవంతమైన కంప్యూటింగ్... 100కుపైగా లైవ్ టీవీ చానల్స్ వీక్షించే అవకాశం.. ఇవన్నీ మొబైల్ ఆపరేటర్లు వినియోగదారులకు అందిస్తున్న 3జీ సర్వీసులు. ప్రపంచం మొత్తాన్నీ మొబైల్‌ఫోన్‌లోకి తీసుకొచ్చి అందిస్తున్నా కస్టమర్ల నుంచి మాత్రం స్పందన అంతంత మాత్రంగానే ఉంది. కారణం 3జీ ఫోన్ల ధరలు సామాన్యులకు అందుబాటులో లేకపోవడమే. 3జీ సర్వీసులను పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయగలిగే ఫోన్ కావాలంటే రూ. 10 వేలు పైన వెచ్చించాల్సిందే.

కంపెనీలు 3జీ సిమ్‌కార్డులు ఉచితంగా ఇచ్చినా కస్టమర్లు 3జీ సర్వీసులకు దూరంగానే ఉన్నారు. దీంతో భారీ వ్యయంతో 3జీ టెక్నాలజీని ఏర్పాటు చేసుకున్న మొబైల్ ఆపరేటర్లు వినియోగదారులకు చౌకగా 3జీ ఫోన్లు అందించే బాధ్యతను కూడా భుజాన వేసుకున్నాయి. మొబైల్ తయారీ కంపెనీలతో  ఒప్పందాలు చేసుకుని తమ బ్రాండ్ పేరుతో 3జీ ఫోన్లను  సామాన్యునికి అందుబాటైన రేంజ్‌లో విక్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting