3జీ విజయవంతం కాలేదు: సిబల్

By Super
|
3G has not been a success so far: sibal


3జీ టెలికం సర్వీసులు ఇంతవరకూ దేశంలో పెద్దగా విజయవంతం కాలేదని కమ్యూనికేషన్స్, ఐటీ శాఖ మంత్రి కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. స్పెక్ట్రం కోసం భారీగా నిధులు వెచ్చించినప్పటికీ.. ఆపరేటర్లు నిధుల కొరత కారణంగా మిగతా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేసుకోలేకపోయారని ఆయన అభిప్రాయపడ్డారు.

కోల్‌కతాలో మంగళవారం భారతీ ఎయిర్‌టెల్ 4జీ సర్వీసులను ప్రారంభించిన సందర్భంగా సిబల్ ఈ విషయాలు చెప్పారు. ప్రస్తుతానికి ఎయిర్‌టెల్ అందిస్తున్న 4జీ సర్వీసులు బ్రాడ్‌బ్యాండ్ వైర్‌లెస్ సేవలు మాత్రమేనని.. 700 మెగాహెర్ట్జ్ బ్యాండ్‌విడ్త్ కూడా అందుబాటులోకి వస్తే సిసలైన 4జీ సేవలు లభించగలవని ఆయన తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే వీటిని అందుబాటులోకి తెచ్చే అవకాశముందన్నారు. మరోవైపు, కొత్త టెలికం విధానాన్ని వచ్చే నెలలో ప్రకటించే అవకాశముందని మంత్రి పేర్కొన్నారు. అలాగే.. ఐటీ, ఎలక్ట్రానిక్స్ తయారీ విధానాన్ని కూడా త్వరలో ప్రకటిస్తామని ఆయన వివరించారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X