షూ ఆకారంలో కారు.. కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే

Posted By: Super

షూ ఆకారంలో కారు.. కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే

ప్రమోషన్ అనేది చాలా రకాలు. ఎవరికి నచ్చిన విధంగా వారు వారియొక్క ప్రోడక్ట్స్‌ని ప్రమోట్ చేసుకుంటుంటారు. చైనాలో కాంగ్ షూ అనే షూ కంపెనీ ఉంది. ఈ షూ కంపెనీ తన షూ ప్రోడక్ట్స్‌ని ఓ వినూత్న రీతిలో ప్రజలకు చేరువ అయ్యేలా చూస్తుంది. అందుకోసం షూ ఆకారంలో ఇద్దరు పాసింజర్స్ కూర్చునే విధంగా దాదాపు నలభై కార్లుని రూపోందించి యావత్ చైనా మొత్తం ప్రదర్శించనున్నారు. కాంగ్ షూ కంపెనీకి సంబంధించినటువంటి హెడ్ ఆఫీసు ఈస్ట్రన్ చైనాలోని జిజియాంగ్ ప్రోవెన్స్ లోని వెన్జులో ఉంది.

ప్రస్తుతం చైనాలో ఈ క్రేజీ కారు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇక ఈకారు విషయానికి వస్తే సింగిల్ బ్యాటరీ చార్జింగ్‌తో గంటకు 30mph వేగంతో 250మైళ్శ వరకు వెళుతుందని ఈకారుని రూపోందించినటువంటి వారు పేర్కోన్నారు. 10feet పోడవు, 3feet హైట్‌తో కాంగ్ షూ కలర్ ఎలాగైతే ఉంటుందో అదేవిధంగా లెదర్ మాదిరి కారు బాడీని రూపోందించడం జరిగింది. ఈకారుని రూపోందించడానికి ఆరు నెలలు సమయం పట్టిందని కాంగ్ షూ యజమాని తెలియజేశారు. ఇక దీని ఖరీదు 4,000పౌండ్స్.

ఇక కంపెనీ ప్రెసిడెంట్ వాంగ్ జింటావో మాట్లాడుతూ ఇలాంటి షూ ఆకారంలో ఉన్న ఈకార్లు 40 వరకు రూపోందించి చైనా మొత్తం పబ్లిసిటి చేయించాలని నిర్ణయం తీసుకున్నామని అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot