ఇక సోలార్ ఎటిఎమ్ సెంటర్లు..!

Posted By: Staff

ఇక సోలార్ ఎటిఎమ్ సెంటర్లు..!

 

త్వరలోనే గ్రామీణ ప్రాంతాల్లోకి చౌక ఏటీఎమ్ (ఆటో మెటిక్‌ టెల్లర్‌ మిషన్‌)లు అందుబాటులోకి రానున్నా యి. దీన్ని ఐఐటీ మద్రాసుకు చెందిన పూర్వ విద్యార్థు లు... ఐఐటీకే చెందిన పరిశోధకులు తయారు చేస్తున్నారు. వోర్‌టెక్స్‌ అంటూ దీనిని ముద్దుగా పిలుస్తున్నారు. దీన్ని తయారు చేయడానికి వారు నాలుగు సంవత్సరాలపాటు కష్ట పడ్డారు. గత నాలుగు సంవత్సరాల నుంచి వోర్‌టెక్స్‌ ఏటీఎమ్ మిషన్‌లు సుమారు 450 వరకు విక్రయించారు. మరో 250 ఏటీఎమ్ మిషన్‌లు నాలుగు నెలల్లో డెలివరి చేయనున్నారు. అయితే ఈ ఏటీఎమ్ల నిర్వహణ చాలా తక్కువ ఎందుకంటే సోలార్‌ పవర్‌ ద్వారా ఈ ఏటీంలు నడుస్తాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కూడా సుమారు 300 ఏటీఎమ్లు ఆర్డర్‌ చేశాయి.

దేశ జనాభాలో అత్యధికంగా ప్రజలు నివసించేంది గ్రామీణ ప్రాంతాల్లోనే ఐతే గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్‌ సేవలు తక్కువగా ఉండడంతో దీన్ని ఆసరా చేసుకుని వోర్‌టెక్స్‌ గ్రామీణ ప్రాంతాల్లో ఏటీఎమ్లను ఏర్పాటు చేయనున్నది . ఐతే నగరాల్లో ఉండే వాటికి భిన్నంగా ఉంటాయి. నగరాల్లో, పట్టణాల్లో ఉండే ఏటీఎమ్లు ఎయిర్‌ కండిషన్‌రూంలో నిర్వహిస్తారు. అదే గ్రామీణ ప్రాంతాల్లోని ఏటీఎమ్లు సోలార్‌ పవర్‌ద్వారా నిర్వహిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్‌ సమస్య తీవ్రంగా ఉంటున్న విషయం తెలిసిందే. అందుకే సోలార్‌ ద్వారానే ఈ ఏటీఎమ్లు అందుబాటులోకి తెనున్నారు.

సాధారణ ఏటీఎమ్లకు 500 వాట్‌ విద్యుత్‌ కావాల్సివస్తే... వోర్‌టెక్స్‌ ఏటీఎమ్లకు కేవలం 70 వాట్‌లు చాలు. సాధారణ ఏటీఎమ్లకు కనిష్ఠంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రతలో మిషన్‌లు నడిస్తాయి. ఈ ఏటీఎమ్లకు ప్రత్యేకమైన ఉక్కుతో తయారు చేస్తారు. సాధారణంగా ఈ ఉక్కు మిలిటరీ వాహనాలకు వినియోగిస్తారు. వీటికి ఎక్కువ విద్యుత్‌ కావాల్సి ఉంటుంది. అదే వోర్‌టెక్స్‌ మిషన్‌కైతే 30 శాతం తక్కువ విద్యుత్‌తో నడవపవచ్చు.. మొత్తానికి చూసుకుంటే సాధారణ ఏటీఎమ్ల నిర్వహణకు అయ్యే ఖర్చులో 50 శాతం కంటే తక్కువ ఖర్చుతో తమ ఏటీఎమ్లను నిర్వహించవచ్చునని ఆయన వివరించారు.

సాధారణంగా ఒక ఏటీఎమ్ ధర రూ.3.5 నుంచి రూ.4 లక్షల వరకు చేస్తుంది. దీనికి అదనంగా యూపీఎస్‌, ఎయిర్‌ కండిషనర్‌లు అదనం. ఇవన్నీ కలుపుకుంటే మొత్తం రూ.4.5 లక్షలవుతుంది. అదే వోర్‌టాక్స్‌ ఏటీఎమ్ మిషన్‌ రూ.2.75 లక్షలే దీనికి ఎయిర్‌ కండిషనర్‌ అవసరం లేదు. మిషన్‌లోనే యూపీఎస్‌ ఏర్పాటు చేస్తారని ఆయన చెప్పారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting