రైట్ సమయంలో పెళ్లి చేసుకుంటే 40 జిబి సేవ్ అవుతుందట

By Gizbot Bureau
|

భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 చివరి నిమిషంలో సిగ్నల్స్ అందని విషయం అందరికీ తెలిసిందే. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపైకి దిగుతున్న సమయంలో సరిగ్గా 2.1 కిలోమీటర్ల వద్ద దాని సంకేతాలు తెగిపోయాయి. చంద్రయాన్ 2 ఫెయిల్ అయినందుకు భారతదేశం బాధలో ఉంటే.. దాయాది పాకిస్థాన్ మాత్రం పండగ చేసుకుంటోంది. పాకిస్థాన్ సైన్స్ శాఖ మంత్రి ఫవాద్ చౌదరి తన ట్విట్టర్‌లో చంద్రయాన్ 2 ప్రయోగం ఫెయిల్ అయిందంటూ.. 'ఎండియా’ అంటూ వెటకారపు ట్వీట్ చేశాడు. దీనికి ఇండియన్లు ధీటుగా కౌంటర్ వేశారు. పాకిస్తానీయులు కూడా మంత్రి తీరును ఎండగట్టారు. అయితే ఫవాద్ చౌదరి వివాదాల్లో ఇరుక్కోవడం ఇదేమి కొత్త కాదు. గతంలోనే ఆయన ఇలాంటి వివాదపు ట్వీట్లు చేశారు.

వివాదాస్పద ట్వీట్
 

వివాదాస్పద ట్వీట్

ఫిబ్రవరి 2011న ఈ పాకిస్తాన్ మంత్రి తన ట్విట్టర్ లో Marriage at the right age & a gd wife saves 40 GB of space on your computer.. అంటూ ట్వీట్ చేశాడు. ఇది అప్పట్లో వైరల్ అయి ఆయనకే ఎదురుదెబ్బ తగిలింది. మీ దగ్గర పోర్న్ వీడియోలు 40 జిబి ఉన్నాయా అన్నట్లుగా ఇండియన్లు ట్రోల్ చేశారు. పోర్న్ కు అడ్డానే మీ దేశం అంటూ ఇండియన్లు వారి మీద విరుచుకు పడ్డారు. ఫవాద్ చౌదరికి ఇలాంటి ట్వీట్లు చేయడం కొత్తేమి కాదు. గతంలో కూడా ఆర్టికల్ 370 రద్దు సమయంలో భారత్‌పై వెకిలి ట్వీట్లు చేసి నెటిజన్లతో తిట్టించుకున్నారు. అటు జమ్మూకాశ్మీర్ అంశం విషయంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, మంత్రులు సందు దొరికితే చాలు భారత్‌పై విషం కక్కుతున్నారు.

 ఇప్పుడు అదే వరస

ఇప్పుడు అదే వరస

ఎండియా... చేతకాని పని జోలికి వెళ్లకూడదు. బొక్క బోర్లా పడకూడదు అని ట్వీట్ చేశారు. దానిపై నెటిజన్లు తీవ్రంగా విరుచుకుపడ్డారు. పొరుగువారి ప్రగతి చూసి సహించలేనివారే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారని దుయ్యబట్టారు. ఫవాద్ కు కూడా చంద్రయాన్ 2 నిద్ర లేకుండా చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో అదే నవ్వు తెప్పించే విషయమని ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు.

చంద్రయాన్ 2పై విషం కక్కిన Pakistan మంత్రి

చంద్రయాన్ 2పై విషం కక్కిన Pakistan మంత్రి

చంద్రయాన్ 2పై విషం కక్కిన మంత్రి వర్యా మా ప్రయోగం కోసం నువ్వు రాత్రంతా మేల్కోనే చూశావ్ మరిచిపోకు' అంటూ ఓ నెటిజన్ ఎద్దేవా చేయగా.. మరొకరు ‘మేం కనీసం ప్రయత్నమైనా చేశామని.. మీ పాకిస్తాన్‌కు ఆ కనీస పరిజ్ఞానం కూడా లేదని' మండిపడ్డాడు. ఇంతటితో ఈ గొడవ ఆగలేదు. వీటికి ప్రతిస్పందిస్తూ ఫవాద్ చౌదరి రెచ్చిపోయాడు. మరొకొందరైతే శాటిలైట్ స్పెల్లింగ్ కూడా రాదు.. నువ్వెలా మంత్రివి అయ్యావు. అసలు నీకు చంద్రయాన్ 2పై మాట్లాడే అర్హత లేదంటూ గడ్డి పెట్టారు.

చంద్రయాన్ 2కు తగిలిన ఎదురు దెబ్బకు తానే కారణమైనట్లు..
 

చంద్రయాన్ 2కు తగిలిన ఎదురు దెబ్బకు తానే కారణమైనట్లు..

తనపై తీవ్రంగా ట్రోలింగ్ జరుగుతుండడంతో ఫవాద్ మరోసారి స్పందించారు. చంద్రయాన్ 2కు తగిలిన ఎదురు దెబ్బకు తానే కారణమైనట్లు తనను ట్రోల్ చేస్తారేమిటని ప్రశ్నించారు. విఫల ప్రయత్నాలపై రూ. 900 కోట్లు ఖర్చు చేయాలని మీకు నేను చెప్పానా అని కూడా అడిగారు. భారత ప్రధాని నరేంద్ర మోడీపై కూడా ఫవాద్ వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేశారు. తానేదో ఆస్ట్రోనాట్ అయినట్లు స్పీచ్ లు దంచుతున్నారని మోడీని ఉద్దేశించి అన్నారు. పేద దేశమైన భారత్ చంద్రయాన్ -2పై రూ. 900 కోట్లు ఖర్చు చేసినందుకు పార్లమెంట్ మోడీని నిలదీయాలని ఓ ఉచిత సలహా పారేశారు.

పరువు తీసే వ్యాఖ్యల ను పాకిస్తానీయులు కూడా తప్పు పట్టారు

పరువు తీసే వ్యాఖ్యల ను పాకిస్తానీయులు కూడా తప్పు పట్టారు

ఫవాద్ వ్యాఖ్యలను పాకిస్తానీయులు కూడా తప్పు పట్టారు. మనలాగా కాకుండా చంద్రుడిపై కాలు మోపేందుకు భారత్ ప్రయత్నించిందని, వీలైతే వారి భుజం తట్టాలని, వారి నుంచి స్ఫూర్తి పొందాలని, కానీ పాక్ పరువు తీసే వ్యాఖ్యలు చేయవద్దని అన్నారు.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
40GB trends online after Pakistan minister Fawad Chaudhry trolls India for Chandrayaan-2. This is why

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X