అంగారకుడి యాత్ర ఇంటర్వ్యూకు 44 మంది భారతీయులు

Posted By:

నెదర్లాండ్స్‌కు చెందిన మార్సవన్ సంస్థ చేపట్టిన అంగారకు యాత్రకు సంబంధించిన కీలక ఇంటర్వ్యూకు 44 మందికి భారతీయులు ఎంపికయ్యారు. వీరిలో 27 మంది మగవారు, 17 మంది మహిళలు ఉన్నారు. అంగారకుడి పై శాశ్వత అవాసం కోసం మార్సవన్ సంస్థ చేపట్టిన ఈ యాత్రకు ప్రపంచవ్యాప్తంగా 705 మంది ఎంపికయ్యారు.

అంగారకుడి యాత్ర ఇంటర్వ్యూకు 44 మంది భారతీయులు

2024 నాటికి అంగరాకుడి పై నివాసయోగ్యమైన ఆవాసాలను ఏర్పాటు చేయాలన్నది మార్స్ వన్ సంస్థ సంకల్పం. ఇది తిరుగుప్రయాణం లేని యాత్ర, అంగరాక గ్రహానికి వెళ్లిన వారు తమ జీవితకాలమంతా అక్కడే ఉండాల్సి ఉంటుంది.

ఈ సాహసోపేతమైన యాత్ర నిమిత్తం మార్సవన్ సంస్థ, ప్రపంచవ్యాప్తంగా దరఖాస్తులకు ఆహ్వానించింది. నిర్దేశిత సమయంలో సంస్థకు 2 లక్షలు దరఖాస్తులు అందాయి. వాటిలో 1058 మందిని గత డిసెంబర్‌లో ప్రాథమికంగా ఎంపిక చేసారు. వీరిని ఈ ఏడాది మార్చి నాటికి వారి వారి వైద్య ధ్రువీకరణ పత్రాలను సమర్పించాలని, సదరు ప్రొఫైల్స్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచాలని సంస్థ సూచించింది.

అయితే ఈ లక్ష్యాలను 705 మాత్రమే పూర్తి చేసారు. ఎంపికైన 44 మంది భారతీయులలో ఢిల్లీ, హైదరాబాద్, ముంబయ్, కోల్ కతా, పూణే, తిరువనంతపురం నగరాలకు చెందిన వారు ఉన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి శిక్షణ ఉంటుంది. అనంతరం తుది ఎంపిక ఉంటుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot