10,000 లోకల్.. 3,000 నేషనల్ (యూనినార్ స్పెషల్ ఆఫర్)

Posted By: Staff

10,000 లోకల్.. 3,000 నేషనల్ (యూనినార్ స్పెషల్ ఆఫర్)

 

ప్రముఖ టెలికామ్ నెట్ వర్క్ ప్రొవైడర్ యూనినార్ ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల కోసం తన పాత స్పెషల్ టారిఫ్ వోచర్ రూ.83పై 48శాతం రాయితీని ప్రకటిస్తూ తాజా ప్రకటనను వెలువరించింది. దింతో రూ.83విలువ గల టారిఫ్ ఓచర్ రూ.43కే లభిస్తుంది. అంటే, ఇక పై ఎస్ టీవీ-83ను, ఎస్ టీవీ-43గా వ్యవహరించనున్నారు. ఈ వోచర్‌లో భాగంగా 30 రోజుల పాటు 3,000 సెకన్ల మేర దేశవ్యాప్తంగాను, 10,000 సెకన్ల మేర స్థానికంగాను యూనినార్ కాల్స్ చేసుకోవచ్చు. టారిఫ్ కాలపరిమితి 90 రోజులు.

అన్ లిమిటెడ్ ఇంటర్నెట్!

ఆంధ్రప్రదేశ్ సర్కిల్‌లోని వినియోగదారుల కోసం ప్రముఖ టెలికాం ఆపరేటర్ యూనినార్ సరికొత్త ఇంటర్నెట్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. రూ.47తో రోజువారీ పరిమితి లేని ఇంటర్నెట్ జీపీఆర్‌ఎస్ ప్యాకేజీ ‘ఎస్‌టీవీ 47’ను ప్రారంభించింది. దీంతో 30 రోజుల పాటు 1జీబీ ఇంటర్నెట్ బ్రౌజింగ్‌ను వినియోగించుకోవచ్చు. రోజుకింత అనే పరిమితి లేకుండా తక్కువ ఖర్చులో హైస్పీడ్ ఇంటర్నెట్‌ను అందించే ఎస్‌టీవీ 47 ప్యాక్… ఏపీ సర్కిల్‌లోనే మొదటిదని యూనినార్ బిజినెస్ హెడ్(ఏపీ సర్కిల్) సతీష్ కుమార్ కన్నన్ పేర్కొన్నారు.

దగ్గర్లోని యూనినార్ రిటైలర్‌ను సంప్రదించడం ద్వారా గానీ, ‘స్టార్222స్టార్7స్టార్47యాష్’కు డయల్ చేసి కూడా ఈ ప్యాకేజీని యాక్టివేట్ చేసుకోవచ్చని తెలిపారు. జీపీఆర్‌ఎస్ సెట్టింగ్స్ కోసం ‘యాష్‌ఏఎల్‌ఎల్‌యాష్’ అని టైప్ చేసి 58355 (టోల్-ఫ్రీ) నెంబర్‌కు ఎస్‌ఎంఎస్ పంపాల్సి ఉంటుందని యూనినార్ ప్రకటించింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot