48 ఎంపీ కెమెరాని ఆఫర్ చేస్తున్న స్మార్ట్‌ఫోన్లు ఇవే, బెస్ట్ ఏదో సెలక్ట్ చేసుకోండి

గ్లోబల్ మొబైల్ మార్కెట్లో ఇప్పుడు 48 ఎంపీ కెమెరా ట్రెండ్ నడుస్తోంది. వినియోగదారులు కూడా ఎక్కవగా కెమెరా ఫోన్ల వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 48 ఎంపీ కెమెరాతో ఫీచర్‌తో స్మార్ట్‌ఫోన్లను తీసుకు

|

గ్లోబల్ మొబైల్ మార్కెట్లో ఇప్పుడు 48 ఎంపీ కెమెరా ట్రెండ్ నడుస్తోంది. వినియోగదారులు కూడా ఎక్కవగా కెమెరా ఫోన్ల వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 48 ఎంపీ కెమెరాతో ఫీచర్‌తో స్మార్ట్‌ఫోన్లను తీసుకువచ్చేందుకు దిగ్గజ కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఇప్పటికే షియోమి, ఒప్పొ హానర్, వివో వంటి కంపెనీలు 48 ఎంపీ కెమెరాతో తమ స్మార్ట్ ఫోన్లను ఆఫర్ చేస్తున్నాయి.

48 ఎంపీ కెమెరాని ఆఫర్ చేస్తున్న స్మార్ట్‌ఫోన్లు ఇవే

అయితే కెమెరా పరంగానే కాకుండా ఇతర ఫీచర్లతో కూడా ఈ ఫోన్లు వినియోగదారులను అలరిస్తున్నాయి.ఈ శీర్షికలో భాగంగా 48 ఎంపి కెమెరాను ఆఫర్ చేస్తున్న కంపెనీలు, ఫోన్ ధరలు, ఫీచర్లను ఓ సారి చూద్దాం.

రెడ్‌మీ నోట్ 7 ప్రొ

రెడ్‌మీ నోట్ 7 ప్రొ

షియోమీ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 7 ప్రొలో 48 ఎంపి కెమెరాను ఆఫర్ చేస్తోంది. నెప్ట్యూన్ బ్లూ, నెబ్యులా రెడ్‌, స్పేస్ బ్లాక్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌లైన ఈ ఫోన్ ధరలను పరిశీలిస్తే.. 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.13,999 ధ‌ర‌కు, 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.16,999 ధ‌ర‌కు ల‌భ్యం కానున్నాయి. ఫ్లిప్‌కార్ట్ సైట్‌తోపాటు ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లో ఈ ఫోన్ల‌ను మార్చి 13వ తేదీ నుంచి విక్ర‌యిస్తారు.

రెడ్‌మీ నోట్ 7 ప్రొ ఫీచ‌ర్లు

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 ×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లాగ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 675 ప్రాసెస‌ర్‌, 4/6 జీబీ ర్యామ్‌, 64/128 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 48, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఐఆర్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 4.0.

 

Oppo F11 Pro
 

Oppo F11 Pro

ధర 24,900

ఒప్పో ఎఫ్‌11 ప్రొ ఫీచ‌ర్లు

6.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పీ70 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 48, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ.

Honor View20

Honor View20

6జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.37,999 ధ‌ర‌కు, 8జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.45,999 ధ‌ర‌కు ల‌భిస్తున్నాయి.

హాన‌ర్ వ్యూ20 ఫీచ‌ర్లు

6.4 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ ఎల్‌సీడీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1080 x 2310 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, హువావే కైరిన్ 980 ప్రాసెస‌ర్‌, 6/8 జీబీ ర్యామ్‌, 128/256 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 48 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 3డీ బ్యాక్ కె్ఎరా, 25 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.

Vivo V15 Pro

Vivo V15 Pro

వివో వి15 ప్రొ స్మార్ట్‌ఫోన్ టొపాజ్ బ్లూ, రూబీ రెడ్ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో రూ.28,990 ధ‌ర‌కు అందుబాటులో ఉంది.

వివో వి15 ప్రొ ఫీచ‌ర్లు.

6.39 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ డిస్‌ప్లే, 2340 × 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 675 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయ‌ల్ సిమ్‌, 12, 5, 8 మెగాపిక్స‌ల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఇన్‌డిస్‌ప్లే ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, 3700 ఎంఏహెచ్ బ్యాట‌రీ, డ్యుయ‌ల్ ఇంజిన్ ఫాస్ట్ చార్జింగ్‌.

Best Mobiles in India

English summary
Redmi Note 7 Pro and all the other phones offering a 48MP rear camera

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X