సెప్టంబర్‌లో లాంచ్ అయిన సంచలన 4జీ డేటా ప్లాన్స్ ఇవే

రిలయన్స్ జియో రాకతో ఇండియన్ టెలికం సెక్టార్‌లో డేటా వార్ రాజుకున్న విషయం తెలిసిందే. జియోను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఎయిర్‌టెల్, ఐడియా, బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్ వంటి టెలికమ్ ఆపరేటర్స్ సరికొత్త 4జీ ప్లాన్‌లతో ముందుకొస్తున్నాయి. ఈ సెప్టంబర్‌లో మార్కెట్లో లాంచ్ అయి సంచలనం రేపుతోన్న 10 4జీ డేటా ప్లాన్స్ వివరాలను ఇప్పుడు చూద్దాం...

Read More : Jio నెట్‌వర్క్‌లోకి మారదామనుకుంటున్నారా? ఇవిగోండి 7 సులువైన మార్గాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రిలయన్స్ జియో...

సెప్టంబర్ 5న రిలయన్స్ జియోను 4జీ సర్వీసులను దేశంలో అధికారికంగా లాంచ్ చేయటం జరిగింది. కంపెనీ లాంచ్ చేసిన వెలకమ్ ఆఫర్ లో డిసెంబర్ 31 వరకు అందరూ జియో సేవలను ఉపయోగించుకోవచ్చు. ఆ తరువాత నుంచి యూజర్లు జియో అందిస్తోన్న ప్లాన్‌లలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది. జియ్ ఆఫర్ చేస్తున్న టారిఫ్ ప్లాన్స్ రూ.149 దగ్గర నుంచి రూ.4,999 రేంజ్ వరకు అందుబాటులో ఉంటాయి. జియో నెట్‌వర్క్‌లో భాగంగా వాయిస్ కాల్స్ పై ఎటువంటి ఛార్జీలు వసూలు చేయబడవని, 4జీ డాటా పై ఇతర నెట్‌వర్క్ ఆపరేటర్లు వసూలు చేస్తున్న మొత్తంలో కేవలం 10వ వంతు మాత్రమే రిలయన్స్ జియో తన 4జీ డేటా పై వసూలు చేస్తుందని ముకేశ్ అంబానీ తెలిపారు.

ఎయిర్‌టెల్ నుంచి...

రిలయన్స్ జియోకు కౌంటర్‌గా 90 రోజుల ప్లాన్‌లతో ఎయిర్‌టెల్ దూసుకొచ్చింది. తన 4జీ యూజర్ల కోసం రూ.1,494 టారిఫ్‌లో స్పెషల్ డేటా ప్లాన్‌ను ఎయిర్‌టెల్ లాంచ్ చేసింది. ఈ 90 రోజుల డేటా ప్యాక్‌ను ఇప్పటికే ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లో ఉన్న కస్టమర్‌లు రూ.1495 చెల్లించి యాక్టివేట్ చేసుకోవచ్చు. కొత్త కస్టమర్‌లు రూ.1494 చెల్లించి ఈ ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్‌ను పొందే ఎయిర్‌టెల్ యూజర్లు 90 రోజుల పాటు ఇంటర్నెట్‌ను వాడుకోవచ్చని ఎయిర్‌టెల్ తెలిపింది. ఈ స్పెషల్ 4జీ డేటా ప్యాక్‌కు ఫెయిర్ యూసేజ్ పాలసీ వర్తిస్తుందని ఎయిర్‌టెల్ వెల్లడించింది. 90 రోజుల ప్లాన్ వ్యాలిడిటీలో మొదటి 30 జీబి వరకు 4జీ స్పీడ్ వర్తిస్తుందని, లిమిట్ దాటిన తరువాత ఇంటర్నెట్ వేగం 2జీకి పడిపోతుందని ఎయిర్‌టెల్ వివరించింది. ప్రస్తుతానికి ఈ స్పెషల్ 4జీ డేటా ప్యాక్ ఢిల్లీలో మాత్రమే అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో ప్లాన్‌ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నారు.

వొడాఫోన్ నుంచి..

రిలయన్స్ జియో ఉచిత సర్వీస్ ఆఫర్‌కు ధీటుగా సరికొత్త ఆఫర్‌ను వొడాఫోన్ మార్కెట్లో అనౌన్స్ చేసింది. ఈ సంచలనాత్మక ఆఫర్‌లో భాగంగా 1జీబి డేటా ధరకే 10జీబి 4జీ ఇంటర్నెట్‌ను పొందే అవకాశాన్ని వొడాఫోన్ తన సూపర్ నెట్ యూజర్లకు కల్పించింది. కొత్త 4జీ స్మార్‌ఫోన్‌లను కొనుగోలు చేసే వొడాఫోన్ యూజర్లకు ఈ ఆఫర్ మూడు నెలల పాటు వర్తిస్తుంది. అంటే ప్రతినెలా 1జీబి ఇంటర్నెట్‌కు డబ్బులు వెచ్చిస్తే చాలు, మీగితా 9జీబి ఉచితంగా లభిస్తుంది. వొడాఫోన్‌కు సొంతంగా 3జీ, 4జీ సేవలు అందిస్తున్న సర్కిల్స్‌లో ఈ ఆఫర్ డిసెంబర్ 31 వరకు అందుబాటులో ఉంటుంది. వొడాఫోన్ ప్రీపెయిడ్ అలానే పోస్ట్ పెయిడ్ కస్టమర్‌లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ఆఫర్ ప్రకటించినట్టు వొడాఫోన్ తెలిపింది. ఈ ఆఫర్‌లో భాగదంగా వొడాపోన్ కస్టమర్‌లు వొడాఫోన్ ప్లే యాప్‌లోని టీవీలు, సినిమాలు అలానే మ్యూజిక్‌ను ఉచితంగ్ సబ్‌స్ర్కైబ్ చేసుకోవచ్చు. తమ వినియోగదారులు 4జీ హ్యాండ్‌సెట్లకు అప్‌గ్రేడ్ కావాలన్న ఉద్దేశంతో ఈ ఆఫర్‌‌ను తీసుకువచ్చినట్లు వొడాఫోన్ వెల్లడించింది. వొడాఫోన్ 4జీ అందుబాటులో లేని ప్రాంతాల్లో యూజర్లకు 3జీ డేటా లభిస్తుంది.

బీఎస్ఎన్ఎల్ నుంచి...

లయన్స్ జియోకు పోటీగా బీఎస్ఎన్ఎల్ ఇటీవల BB 249 అన్‌లిమిటెడ్ ఉచిత ఇంటర్నెట్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్‌లో భాగంగా నెల మొత్తం మీద 300జీబి ఇంటర్నెట్‌ను వాడుకునే అవకాశంతో పాటు ఉచిత కాలింగ్ అందుబాటులో ఉంటుంది. ప్రతి యూజర్‌కు ఈ ఆఫర్ 6 నెలల పాటు వర్తిస్తుంది. బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న BB 249 పూర్తిగా అన్‌లిమిటెడ్. ఈ ప్లాన్‌లో భాగంగా బ్రౌజింగ్, డౌన్‌లోడింగ్, అప్‌లోడింగ్, కాలింగ్ అన్ని అన్‌లిమిటెడ్. బీఎస్ఎన్ఎల్ BB 249 ప్లాన్‌లో భాగంగా యూజర్‌కు నెల మొత్తం మీద వర్తించే 300జీబి ఇంటర్నెట్‌‌లో భాగంగా మొదటి 1జీబి వరకు 2 Mbps వేగం వర్తిస్తుంది. FUP లిమిట్ దాటిన తరువాత స్పీడ్ 1 Mbpsకు పడిపోతుంది.

వొడాఫోన్ నుంచి...

వొడాఫోన్ తన సూపర్‌నెట్ 4జీ సర్వీసులను కొన్ని రాష్ట్రాల్లో లాంచ్ చేసింది. తాము ప్రవేశపెట్టిన కొత్త ఆఫర్లలో భాగంగా 20జీబి 4జీ డేటాను రూ.999కే సొంతం చసుకోవచ్చని వొడాఫోన్ తెలిపింది. అంతేకాకుండా 3జీ నెట్‌వర్క్‌లో ఉన్న వొడాఫోన్ యూజర్లకు ఉచితంగా 4జీలోకి మారొచ్చని కంపెనీ తెలిపింది.

ఎయిర్‍టెల్ మెగా సేవర్ ప్యాక్

మెగా సేవర్ ప్యాక్ పేరుతో 4జీ ప్లాన్‌ను ఎయిర్‍టెల్ అనౌన్స్ చేసింది. ఈ ప్లాన్‌లో భాగంగా యూజర్ ముందుగా రూ.1,498 చెల్లించాల్సి ఉంటుంది. ప్లాన్ యాక్టివేట్ అయిన వెంటనే 28 రోజుల వ్యాలిడిటీతో కూడిన 1జీబి 4జీ/3జీ డేటా మీకు లభిస్తుంది. ఆ తరువాత నుంచి సంవత్సర వరకు రూ.51కే 1జీబి ఎయిర్‍టెల్ 4జీ డేటా మీకు అందుబాటులో ఉంటుంది.

బీఎస్‌ఎన్‌ఎల్ అన్‌లిమిటెడ్ డేటా ఆఫర్‌

ప్రైవేట్ టెలికం కంపెనీలకు పోటీగా బీఎస్‌ఎన్‌ఎల్ మరో ప్రత్యేక అన్‌లిమిటెడ్ డేటా ఆఫర్‌ను ప్రకటించింది. రూ.1,099కే నేషనల్ అన్‌లిమిటెడ్ 3జీ మొబైల్ డేటా ప్లాన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే ఇప్పటికే డేటా పాన్లలో ఉన్న వినియోగదారులకు డేటా పరిమితిని రెట్టింపు చేసింది.

ఎయిర్‌టెల్ నుంచి మరో ప్లాన్...

జియోకు పోటీగా ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. ప్రతి ఒక్కరికి 5జీబి ఇంటర్నెట్ డేటాను ఉచితంగా ఆఫర్ చేస్తూ మార్కెట్లో పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లోని ప్రతి ఒక్కరు ఈ ఉచిత డేటాను పొందవచ్చు. ముందుగా myAirtel appను మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోండి. ఆ తరువాత యాప్‌లో మీ 10 డిజిట్ ఎయిర్‌టెల్ మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయటం ద్వారా వన్‌టైమ్ పాస్‌వర్డ్ మీ ఫోన్‍‌కు అందుతుంది. ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి అయిన వెంటనే మీకు కొన్ని కండీషన్స్‌తో కూడిన 5జీబి ఉచిత ఇంటర్నెట్ లభిస్తుంది. ఎయిర్‌టెల్ అందిస్తోన్న ఉచిత 5జీబి ఇంటర్నెట్ రాత్రి వేళ్లలో మాత్రమే వాడుకోవాలి. అదికూడా రాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 6 గంటల వరకు మాత్రమే.

ఐడియా నుంచి...

రిలయన్స్ జియో దెబ్బకు ఐడియా సెల్యులార్ కూడా దిగరాక తప్పలేదు. టెలికం మార్కెట్లో తాజాగా నెలకున్న పోటీ వాతావరణం నేపథ్యంలో ఐడియా సరికొత్త అన్‌లిమిటెడ్ 4జీ ప్లాన్‌తో ముందుకొచ్చింది. ఈ ఆఫర్‌లో భాగంగా ఐడియా 4జీ యూజర్లు రూ.1 చెల్లిస్తే చాలు గంట పాటు 4జీ డేటాను అపరిమితంగా వాడుకోవచ్చు. ఈ లిమిటెడ్ పరియడ్ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 4G Data and Internet Plans Announced in India in September 2016. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot