కోల్‌కతా నుంచి షురూ..?

చారిత్రాత్మక నగరం కోల్‌కతాకు భారతదేశపు మొట్టమొదటి 4జీ సేవలు అందనున్నాయి. మరో నెల రోజుల్లో ఈ వేగవంతమైన నెట్‌వర్క్ సేవలను ఎయిర్‌టెల్ ఇక్కడి నుంచి ప్రారంభించనుంది. ఈ వెసలబాటుతో 4జీ నెట్‌వర్క్ ఆప్షన్ కలిగిన స్మార్ట్‌ఫోన్‌లు ‘3జీ’కి బైబై చెప్పి ఫాస్టెస్ట్ కమ్యూనికేషన్ సర్వీస్‌ను మీకు అందించనున్నాయి. 3జీ స్పీడ్‌తో పోలిస్తే 4జీ స్పీడ్ 10 రెట్లు అధికంగా ఉంటుంది.
ప్రస్తుతానికి 3జీ నెట్‌వర్క్ స్పీడ్ 21 ఎంబీపీఎస్‌గా ఉంటే రానున్న 4జీ నెట్‌వర్క్ స్పీడ్ 100 ఎంబీపీఎస్ పై మాటే. ఈ వేగవంతమైన టెక్నాలజీ ధర కాస్త అధికంగానే ఉంటుంది. కోల్‌కతాలో ప్రారంభం అనంతరం ఎయిర్‌టెల్ తమ 4జీ సేవలను ఇతర పట్టణాల్లో విస్తరించనుంది. 4జీ సర్వీసులను అందించే రేసులో రిలయన్స్ ఇన్ఫోటెల్, బీఎస్ఎన్ఎల్, టికోనా, ఎయిర్‌సెల్, క్వాల్కమ్, ఎమ్ టీఎన్ఎల్ వంటి ప్రముక టెలికాం సంస్థలు ఉన్నాయి.
అయితే వీటి సేవలు జూలై నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ సర్వీస్ సహకారంతో మొబైల్ ఫోన్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు రిలయన్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
4జీ ఎల్‌టీఈ వ్యవస్థను సపోర్ట్ చేసే శామ్‌సంగ్ SCH-R940 స్మార్ట్‌ఫోన్ ధర రూ.10,000 ఇతర ఫీచర్ల వివరాలు...
నెం.1 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ శామ్‌సంగ్ గత ఏడాది ప్రకటించిన స్మార్ట్‌ఫోన్ SCH-R940 టికాల్ ఎట్టకేలకు ఈ జూన్‌లో విడుదల కానుంది. అనుకున్నదాని ప్రకారం ఈ హ్యాండ్‌సెట్ గత ఏడాది డిసెంబర్‌లోనే విడుదల కావల్సి ఉంది. పలు అనివార్య కారణాల వల్ల విడుదల తేదీని మార్పు చేశారు. 4జీ ఎల్‌టీఈ వ్యవస్థను సపోర్ట్ చేసే ఈ స్మార్ట్‌ఫోన్ ధర విలువ రూ.10,000.
మూడున్నర అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే, 3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1.3 మెగా పిక్సల్ వెబ్ క్యామ్, గుగూల్ ఆండ్రాయిడ్ 2.3.7 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 1 జిగాహెడ్జ్ సింగిల్ కోర్ స్నాప్‌డ్రాగన్ ఎమ్ఎస్ఎమ్8665 ప్రాసెసర్, క్వాల్కమ్ అడిర్నో 205 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఎక్స్‌టర్నల్ మెమరీ 32జీబి, జీపీఆర్ఎస్, ఎడ్జ్, బ్లూటూత్, వై-ఫై, యూఎస్బీ, జీపీఎస్, హెచ్‌టిఎమ్ఎల్ బ్రౌజర్, నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ, 4జీ), మల్టీ ఫార్మాట్ ఆడియో ప్లేయర్, మల్టీ ఫార్మాట్ వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో.
ఈ ఫోన్‌లోని ప్రధాన విశేషాలను పరిశీలిస్తే నిక్షిప్తం చేసిన 4జీ ఎల్‌టీఈ టెక్నాలజీ వేగవంతమైన ఇంటర్నెట్ బ్రౌజింగ్‌కు సహకరిస్తుంది. అదనపు ఫీచర్లైన బ్లూటూత్ స్టీరియో ఆడియో ప్రొఫైల్, బుల్ట్ – ఇన్- డిజిటల్ కంపాస్, 4జీ హాట్‌స్పాట్, శామ్‌సంగ్ టచ్‌విజ్ 4యూఐ వంటి అంశాలు మరింత ఉపయుక్తంగా నిలుస్తాయి.


Click it and Unblock the Notifications