Home
News

4k-vs-hdr-vs-dolby-vision : వీటిల్లో ఏది బెటర్ ?

By Gizbot Bureau

ఈ రోజుల్లో టీవీ అనేది నిత్యావసర వస్తువుగా మారింది. ఒకప్పుడు బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉంటే చాలామంది గర్వంగా భావించే వారు. రోజులు మారిపోయాయి. టెక్నాలజీ అమితవేగంతో దూసుకుపోతోంది. దీంతో టీవీల్లో కూడా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. Blck and white నుంచి LED,OLED,HD,Full HD,Quad HD,4K,8K,Internet Tv, Smart Tvలు మార్కెట్లోకి వచ్చేశాయి. రూ. 5 వేలకు లభించే టీవీలు ఇప్పుడు ఏకంగా రూ. 3 లక్షల దాకా చేరాయి. 21 అంగుళాల నుంచి 65 అంగుళాల వరకు.. హెచ్ డీ రెడీ నుంచి 8 కె వరకు వివిధ రిజల్యూషన్లలో ఎల్ఈడీ టీవీలు మార్కెట్లో లభిస్తున్నాయి. మరి వీటిమధ్య తేడాలేంటి, ఏ టీవీ కొంటే బెటర్ అనే విషయంపై చాలామందికి అవగాహన ఉండటం లేదు. టీవీలు కొనాలనుకున్నప్పుడు మనం చాలా మాటలు వింటాం. ఆల్ట్రా, హెచ్ డీ, యూహెచ్డీ, 2160పీ, 4కే, 2కే లాంటి పదాలు చాలా వింటాం. మరి వీటన్నిటిలో మనం ఎంచుకునే టీవీల్లో ఏ క్వాలిటీస్ ఉండాలి. అన్ని క్వాలిటీస్ ఉండి తక్కువ ధరకే దొరికే టీవీలు దొరుకుతాయా? అసలు ఇప్పుడున్న టీవీల్లో బెస్ట్ ఏమిటి? ఇలాంటి విషయాల గురించి ఓ సారి తెలుసుకుందామా..

 4K vs HDR vs Dolby Vision  best tvs
తేడాలు ఎన్నో..

4కే యూహెచ్డీలో 1080 పిక్సల్స్ నాలుగు రెట్టు ఉంటాయి.క్వాలిటీలో ఛేంజ్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. 4కే కన్నా తక్కువ క్వాలిటీ ఉన్న టీవీల్లో అంత ిఇంప్రూమెంట్ కనిపించదు. 4 కే లా హెచ్ డీఆర్ ఎక్కువ పిక్సల్స్ ని యాడ్ చేయదు. అయితే పిక్సల్స్ ని ఇంప్రూవ్ చేయకపోయినా కాంట్రాస్ట్, బ్రైయిట్ నెస్ ని బూస్ట్ చేసి కలర్స్ రేంజ్ ని పెంచుతుంది.

మిస్ డైరెక్షన్

ఎక్కువ టీవీ కంపెనీలు హెచ్ డీఆర్ అనే మాటను తప్పుదోవ పట్టించాయి. దీంతో చాలామంది కస్టమర్లు హెచ్ డీఆర్ కేపబుల్ లేదా హెచ్ డీఆర్ కంపాటబుల్ వెర్షన్లు మాత్రమే వాడుతున్నారు. హెచ్ డీఆర్ అని అంటే ఇదేమీ అన్ని విభాగాల్లో అద్భుతమైన క్వాలిటీని ఇవ్వదు. ఇది హెచ్ డీఆర్ మెటాడేటాను మాత్రమే రీడ్ చేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా బ్రయిట్ నెస్ విషయంలో అన్ని టీవీలు బాగా పోటీపడుతున్నాయి. హెచ్ డీఆర్ లో 500-1000 నిట్స్ బ్రయిట్ నెస్ వస్తుంది.

డాల్బీ విజన్

హెచ్ డీఆర్ 4కే టీవీలను తయారు చేసే కంపెనీ డాల్బీ. ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువగా డాల్బీ విజన్ టీవీలు, కెమెరాలే యూజ్ చేస్తున్నారు. దీని యూసేజ్ ఎక్కువ స్పెసిఫిక్ గా ఉంటుంది.దీనిలో ఎన్ కోడింగ్, డీకోడింగ్ వ్యవస్థ ఉంది. మూవీ ప్రొడక్షన్స్ బ్రాడ్ కాస్ట్ టీవీ, టీవీ డిస్ ప్లే కోసం హెచ్ డీఆర్ విజన్ మెటీరీయల్ ను ఉపయోగిస్తారు.

LED ( Light-emitting diode)

LCD ( లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే) ని మరికొంత అభివృద్ధి పరిచి మార్కెట్లోకి ఈ టెక్నాలజీని తీసుకొచ్చారు. ఇందులో కాంతి కోసం వాడే బల్బులు ఢిపరెంట్ గా ఉంటాయి. ఎల్ సీడీ డిస్ప్లేలలో కాంతిని ఉత్పత్తి చేయడానికి ఫ్లోరోసెంట్ లైట్లను ఉపయోగిస్తే ఇందులో ల్ఈడీ బల్బులు ఉంటాయి. మిగతా అంత అదే టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ద్వారా ఎల్ఈడీలు ప్రకాశవంతంగా వెలుగును వెదజల్లడంతోపాటు రంగులను కూడా బాగా చూపిస్తాయి. తక్కువ ధర, ఎక్కువ మన్నిక, విద్యుత్ వినియోగం తక్కువ.

OLED ( organic light-emitting diode)

డిస్ప్లేల ప్యానల్ ఆర్గానిక్ (కార్బన్ ఆధారిత) ఎల్ఈడీలతో ఇవి వచ్చాయి. దీని ద్వారా మీరు ఎరుపు, ఆకుపచ్చ, నీలి రంగులను బయటకు కనిపిస్తాయి. ఈ డిస్ప్లేలు ఎల్ఈడీల కంటే చాలా మెరుగైన చిత్ర నాణ్యతను, ప్రకాశవంతమైన వెలుగును ఇవ్వగలవు. విద్యుత్ వినియోగం కూడా చాలా తక్కువ. అయితే వీటి జీవితకాలం సాధారణ ఎల్ఈడీలతో పోలిస్తే కొంత తక్కువగా ఉండడంతోపాటు ధర చాలా ఎక్కువ కావడం వీటికి ఉన్న ప్రతికూలతలు. వైడ్ వ్యూయింగ్ యాంగిల్ స్పెషల్ అట్రాక్షన్, చాలా సన్నగా, వంచడానికి వీలుగా ఉంటాయి.

క్వాంటమ్ డాట్ ఎల్ఈడీలు (QLED)

ఇవి కూడా ఎల్ఈడీ బ్యాక్ లిట్ ఎల్ఈడీ డిస్ప్లేల రకానికి చెందినవే. ప్లాస్మా టీవీలు, ఓఎల్ఈడీ టీవీలతో సమానంగా దృశ్య నాణ్యత, ప్రకాశంతమైన డిస్ప్లేలు వీటిలో ఉంటాయి. సాధారణ ఎల్ఈడీ టీవీలు, ప్లాస్మా టీవీల కంటే తక్కువ విద్యుత్ వినియోగించుకుంటాయి. డిస్ప్లే కూడా పలుచగా ఉంటుంది. వీటి ధర సాధారణ ఎల్ఈడీల కంటే కొంత ఎక్కువగా ఉంటుంది.

High Defination

720 x 1280 పిక్సెళ్లు ఉంటే హెచ్ డీ రిజల్యూషన్ అంటారు. 32 అంగుళాలు లేదా అంతకన్నా తక్కువ పరిమాణమున్న టీవీల్లో ఈ తరహా రిజల్యూషన్ ఉంటుంది.వీటి దృశ్య నాణ్యత సాధారణంగా ఉంటుంది. అయితే 21 అంగుళాల టీవీల్లో అయితే ఈ స్థాయి రిజల్యూషన్ సరిపోతుంది.

Full HD

1,080 x 1,920 పిక్సెళ్లు ఉంటే ఫుల్ హెచ్ డీ రిజల్యూషన్ అంటారు.హెచ్ డీ ఫార్మాట్ కు రెండింతలు. 32 అంగుళాలు లేదా ఆపై టీవీల్లో ఫుల్ హెచ్డీ రిజల్యూషన్ అందజేస్తారు. సాధారణ హెచ్ డీతో పోలిస్తే.. ఫుల్ హెచ్ డీలో దృశ్య నాణ్యత బాగుంటుంది.

Best Mobiles in India

English summary
4K vs HDR vs Dolby Vision: What to choose for the best viewing experience
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X