మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఇవి కూడా చేయగలదు

Posted By:

మీరు ఉపయోగిస్తోన్న ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో మీకు తెలియని ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి. కప్‌కేక్.. డూనట్.. ఎక్లెయిర్.. ఫ్రోయో...జింజర్‌బ్రెడ్.. హనీ‌కూంబ్.. ఐస్‌క్రీమ్ శాండ్విచ్.. జెల్లీబీన్.. కిట్‌క్యాట్.. లాలీపాప్ ఇలా సంవత్సరాల గడిచే కొద్ది కొత్తకొత్త ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం వర్షన్‌లు మారుతూనే ఉన్నాయి. ఆపరేటింగ్ వర్షన్ మారే కొద్ది ఫోన్ వినియోగం మరింత ఆధునీకతను సంతరించుకుంటోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లోని పలు ప్రత్యేకతలను మీముందుంచుతున్నాం...

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్ర్కీన్‌షాట్‌లను తీసుకోవచ్చు

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఇవి కూడా చేయగలదు

స్ర్కీన్‌షాట్‌లను తీసుకోవచ్చు

ఐఫోన్ యూజర్లు ఫోన్ హోమ్ బటన్‌తో పాటు స్లీప్/వేక్ బటన్‌ను ఏక కాలంలో ప్రెస్ చేసి ఉంచటం ద్వారా, ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఫోన్ లోని పవర్ ఇంకా వాల్యుమ్ బటన్ లను ఏకకాలంలో ప్రెస్ చేసి ఉంచటం ద్వారా స్ర్కీన్ షాట్‌లను తీసుకోవచ్చు.

 

కాల్స్ ఇంకా సందేశాలను బ్లాక్ చేయాలంటే..?

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఇవి కూడా చేయగలదు

కాల్స్ ఇంకా సందేశాలను బ్లాక్ చేయాలంటే..?

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తమ ఫోన్ సెట్టింగ్స్‌లోని కాల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి కాల్ బ్లాక్ విభాగంలోకి కాల్స్ ఇంకా సందేశాలను బ్లాక్ చేసుకోవచ్చు.

 

రియల్ పాస్‌వర్డ్

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఇవి కూడా చేయగలదు

రియల్ పాస్‌వర్డ్

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తమ ఫోన్‌లో రియల్ పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవాలంటే ఫోన్ సెట్టింగ్స్‌లోని లాక్ స్ర్కీన్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకుని కావల్సిన రీతిలో పాస్‌వర్డ్‌ను సెట్ చేసుకోవచ్చు.

 

స్ర్కీన్ టెక్స్ట్ సైజును పెంచుకోవాలంటే..?

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఇవి కూడా చేయగలదు

స్ర్కీన్ టెక్స్ట్ సైజును పెంచుకోవాలంటే..?

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తమ ఫోన్‌లోని స్ర్కీన్ టెక్స్ట్ సైజును పెంచుకోవాలంటే సెట్టింగ్స్ లోని Accessibility విభాగంలోకి వెళ్లి విజన్ మెనూలో కనిపించే ఫాంట్ సైజ్‌ను పొడిగించుకుంటే సరి.

 

మ్యూజిక్‌ను ఆటోమెటిక్‌గా టర్నాఫ్ చేయాలంటే

మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఇవి కూడా చేయగలదు

మ్యూజిక్‌ను ఆటోమెటిక్‌గా టర్నాఫ్ చేయాలంటే

ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు తమ ఫోన్‌లోని మ్యూజిక్‍‌ను ఆటోమెటిక్‌గా టర్నాఫ్ చేయాలంటే మ్యూజిక్ ప్లేయర్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి "Music auto off" ఆప్షన్‌ను ఎంపిక చేసుకుంటే సరి.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 awesome things you didn't know your phone could do. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting