మార్కెట్లోకి 1000జీబి మెమరీ కార్డ్, ఇవి ఉపయోగాలు

|

ప్రముఖ డేటా స్టోరేజ్ ఉత్పత్తుల తయారీ కంపెనీ SanDisk ప్రపంచపు మొట్టమొదటి 1TB ఎస్డీ కార్డ్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. రెండు సంవత్సరాల క్రితం ఇదే కంపెనీ నుంచి 512జీబి ఎస్డీ కార్డ్ కూడా మార్కెట్లో లాంచ్ అయ్యింది.

మార్కెట్లోకి 1000జీబి మెమరీ కార్డ్, ఇవి ఉపయోగాలు

Read More : జియో 4జీ సిమ్‌ను ఎయిర్‌టెల్ డాంగిల్‌లో వాడుకోవటం ఎలా..?

ఒకప్పుడు 128 ఎంబి ఎస్డీ కార్డ్‌ను చాలా గొప్పగా భావించిన మనం ఇప్పుడు జీబీల కొలది డేటాను వేలిముద్ర పరిమాణంలో ఉండే మెమరీ కార్డ్‌లలో స్టోర్ చేసుకోగలుగుతున్నాం. 1000జీబి డేటా స్టోరజ్ స్పేస్‌తో వస్తోన్న 1TB SD card వల్ల చేకూరే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం..?

లెక్కకు మిక్కిలి డేటా

లెక్కకు మిక్కిలి డేటా

1000జీబి సామర్థ్యంతో వచ్చే 1టీబీ ఎస్డీ‌కార్డ్‌లో లెక్కకు మిక్కిలి ఫోటోలతో పాటు మల్టీమీడియా ఫైల్స్‌ను స్టోర్ చేసుకోవచ్చు.

4కే వీడియో రికార్డింగ్ ..

4కే వీడియో రికార్డింగ్ ..

4కే వీడియో రికార్డింగ్ త్వరలో మెయిన్ స్ట్రీమ్ కాబోతున్న నేపథ్యంలో వీటిని స్టోర్ చేసుకునేందకు ఎక్కువ మొత్తంలో డేటా స్పేస్ అవసరమవుతుంది. ఇలాంటి సమయంలో 1TB SD card మన డేటా అవసరాలను సమృద్థిగా తీరుస్తుంది. అంతేకాకుండా భవిష్యత్ లో అందుబాటులోకి రాబోతున్న వర్చుల్ రియాల్టీ అప్లికేషన్స్ అలానే 360 డిగ్రీ వీడియో వంటి ఎమర్జింగ్ టెక్నాలజీలకు ఎక్కువ మెమరీ అవసరమవుతుంది.

 పోర్టబులిటీ...
 

పోర్టబులిటీ...

మెమరీ కార్డ్ రూపకల్పన విషయంలో సూక్ష్మీకరణ అనేది మనకు స్ఫష్టంగా కనిపిస్తుంది. ఒకప్పటి మెమరీ కార్డ్ పరిమాణంలో ఇప్పటి మెమరీ కార్డ్ పరిమాణాన్ని విశ్లేషణ చేసి చూసినట్లయితే పోర్టబులిటీ అనేది ఏ మేరకు విస్తరించిందో మనకే అర్థమవుతుంది. ఒక్కసారి ఊహించుకోండి.. 1000జీబి సామర్థ్యం గల మెమరీ కార్డ్ మీ ఫోన్ లో ఇమిడిపోతుందంటే!.

ఎస్డీ కార్డ్డ్స్ అనేవి..

ఎస్డీ కార్డ్డ్స్ అనేవి..

ఎస్డీ కార్డ్డ్స్ అనేవి హార్డ్‌డ్రైవ్స్‌లా ఎక్స్‌టర్నల్ పవర్ సోర్స్ పై ఆధారపడవు. కాబట్టి, జాగ్రత్తగా వాడకుంటే ఎస్డీ కార్డ్‌లలో డేటా కరప్ట్ అనేది దాదాపుగా ఉండదు.

అనేక డివైస్‌లను ఎస్డీకార్డ్ సపోర్ట్ చేస్తుంది...

అనేక డివైస్‌లను ఎస్డీకార్డ్ సపోర్ట్ చేస్తుంది...

స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్, కెమెరా ఇలా అనేక డివైస్‌లను ఎస్డీకార్డ్ సపోర్ట్ చేస్తుంది. మీ అవకాశాన్ని బట్టి ఎక్కడ కావాలంటే అక్కడ ఉపయోగించుకోవచ్చు.

Best Mobiles in India

English summary
5 Benefits of having a 1TB SD Card. Read More in TelugU Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X