ప్రపంచం మెచ్చిన 5 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు
ప్రముఖ రిసెర్చ్ కంపెనీ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) 2018 మూడవ క్వార్టర్‌కు అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి ఓ నివేదికను విడుదల చేసింది.
ప్రముఖ రిసెర్చ్ కంపెనీ ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) 2018 మూడవ క్వార్టర్‌కు అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి ఓ నివేదికను విడుదల చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం, 2018 జూలై, ఆగష్టు, సెప్టబర్ క్వార్టర్‌కుగాను ప్రపంచవ్యాప్తంగా 35.52 కోట్ల స్మార్ట్‌ఫోన్‌లు అమ్ముడయ్యాయి. 2017 మూడవ క్వార్టర్‌తో పోలిస్తే ఈ అమ్మకాల సంఖ్య 6 శాతానికి తగ్గింది. ఐడీసీ లెక్కల ప్రకారం 2018 మూడవ క్వార్టర్‌కు గాను మొదటి 5 స్థానాలను సొంతం చేసుకున్న బెస్ట్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

మొదటి ప్లేస్‌లో సామ్‌సంగ్..
2018 మూడవ క్వార్టర్‌కుగాను అత్యధిక స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించిన బ్రాండ్‌గా సామ్‌సంగ్ చరిత్ర సృష్టించింది. 2018 జూలై, ఆగష్టు, సెప్టబర్ క్వార్టర్‌కుగాను ఈ బ్రాండ్ మొత్తం 72.2 మిలియన్ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించగలిగింది. 2017తో పోలిస్తే ఈ అమ్మకాల సంఖ్య 13.4 శాతానికి తగ్గినప్పడికి బ్రాండ్ వాల్యూ మాత్రం బాగా పుంజుకుంది.

రెండవ ప్లేస్‌లో హువావే..
2018 మూడవ క్వార్టర్‌కుగాను అత్యధిక స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించిన రెండవ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా హువావే నిలిచింది. 2018 జూలై, ఆగష్టు, సెప్టబర్ క్వార్టర్‌కుగాను ఈ బ్రాండ్ మొత్తం 52 మిలియన్ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించగలిగింది. 2017తో పోలిస్తే ఈ అమ్మకాల సంఖ్య 15.9 శాతానికి తగ్గినప్పటికి బ్రాండ్ వాల్యూ మాత్రం పుంజుకుంది.

మూడవ ప్లేస్‌లో యాపిల్..
2018 మూడవ క్వార్టర్‌కుగాను అత్యధిక స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించిన మూడవ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా యాపిల్ నిలిచింది. 2018 జూలై, ఆగష్టు, సెప్టబర్ క్వార్టర్‌కు గాను ఈ బ్రాండ్ మొత్తం 46.9 మిలియన్ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించగలిగింది. 2017తో పోలిస్తే ఈ అమ్మకాల సంఖ్య 0.5 శాతానికి పెరిగింది.

నాలుగవ ప్లేస్‌లో షావోమి..
2018 మూడవ క్వార్టర్‌కుగాను అత్యధిక స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించిన నాలుగవ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా షావోమి నిలిచింది. 2018 జూలై, ఆగష్టు, సెప్టబర్ క్వార్టర్‌కుగాను షావోమి రెడ్‌మి సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు 9.6 శాతం మార్కెట్ వాటాను క్యాప్చుర్ చేయగలిగాయి. ముఖ్యంగా ఇండియా, ఇండోనేషియో ఇంకా స్పెయిన్ దేశాల్లో రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌లకు ఎక్కువుగా పాపులారిటీ ఉంది.

ఐదవ ప్లేస్‌లో ఒప్పో..
2018 మూడవ క్వార్టర్‌కుగాను అత్యధిక స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించిన ఐదవ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా ఒప్పో నిలిచింది. 2018 జూలై, ఆగష్టు, సెప్టబర్ క్వార్టర్‌కుగాను ఒప్పో 29.9 మిలియన్ స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించగలిగింది. ఫైండ్ ఎక్స్, ఆర్ 17 వంటి లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ మోడల్స్ ఒప్పో ఎదుగుదలకు సహకరించాయి. ఐడీసీ నివేదిక ప్రకారం మిగిలిన బ్రాండ్ లు119.9 మిలియన్ స్మార్ట్‌ఫోన్‌లను 2018 జూలై, ఆగష్టు, సెప్టబర్ క్వార్టర్‌లో షిప్ చేయగలిగాయి. వీటి మార్కెట్ షేర్ 33.8శాతంగా ఉంది.


Click it and Unblock the Notifications








