5 కోట్ల Facebook అకౌంట్లు హ్యాకయ్యాయి, ఓసారి చెక్ చేసుకోండి

|

వేలు కాదు... లక్షలు కాదు... ఏకంగా 5 కోట్ల ఫేస్‌బుక్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయి.ఈ విషయాన్ని స్వయంగా ఫేస్‌బుక్ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్ ప్రపంచానికి వెల్లడించారు. అయితే దీనిని ఎవరు చేశారో ఎందుకు చేశారో అనే దాని పై ఫేస్‌బుక్ సంస్థ కి అంతు చిక్కట్లేదు. అయితే గతంలో అమెరికా ఎన్నికల సమయంలో రష్యా ఇలాంటి ప్రయత్నాలు చేసిందన్న వాదన ఉంది. అయితే ప్రస్తుతం ఈ దాడి వెనుక రష్యా ఉందో లేదో కూడా పేస్ బుక్ సంస్థ చెప్పలేకపోతుంది. ప్రస్తుతం FBI దీని పై దర్యాప్తు మొదలుపెట్టింది.

 

 ‘వ్యూ యాజ్‌’ ఫీచర్‌ ద్వారా హ్యాకర్లు చొరబడి....

‘వ్యూ యాజ్‌’ ఫీచర్‌ ద్వారా హ్యాకర్లు చొరబడి....

‘వ్యూ యాజ్‌' ఫీచర్‌ ద్వారా హ్యాకర్లు చొరబడి సమాచారాన్ని సేకరించి ఉండొచ్చని అభిప్రాయపడింది. ఫేస్‌బుక్ ఐటీ నిపుణులు అప్రమత్తమయ్యేసరికి 5 కోట్ల అకౌంట్లు హ్యాకింగ్ బారినపడ్డాయి. అయితే మరో 4 కోట్ల అకౌంట్ల సమాచారం హ్యాకర్ల చేతిలో పడకుండా జాగ్రత్తపడ్డారు.

ఫేస్‌బుక్‌పై తరచూ సైబర్‌ దాడులు ....

ఫేస్‌బుక్‌పై తరచూ సైబర్‌ దాడులు ....

కొంతకాలంగా ఫేస్‌బుక్‌పై తరచూ సైబర్‌ దాడులు జరుగుతున్నాయి.ఈ నేపథ్యంలో యూజర్ల ప్రొఫైల్‌లో ఉండే పేరు, జెండర్, స్వస్థలం లాంటి వివరాలన్నీ హ్యాకర్ల చేతిలో పడ్డాయని భావిస్తున్నారు. అంతేకాకుండా ప్రైవేట్ మెసేజెస్ కూడా హ్యాక్ చేసినట్టు తెలుస్తోంది. అయితే క్రెడిట్ కార్డ్ సమాచారం మాత్రం హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లలేదు.

కోట్లాది మంది ఫేస్‌బుక్ అకౌంట్లు లాగ్ అవుట్ .....
 

కోట్లాది మంది ఫేస్‌బుక్ అకౌంట్లు లాగ్ అవుట్ .....

హ్యాకింగ్ ప్రక్రియ పూర్తికాగానే కోట్లాది మంది ఫేస్‌బుక్ అకౌంట్లు లాగ్ అవుట్ అయ్యాయి. ఫోన్లు, కంప్యూటర్లలో ఆల్వేస్ లాగిన్ స్టేటస్‌లో ఉన్నవారి అకౌంట్లు కూడా లాగౌట్ అయ్యాయి. అలా మీ అకౌంట్ కూడా మీ ప్రమేయం లేకుండా లాగౌట్ అయిందంటే మీ ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయినట్టే. ఇది ఫేస్‌బుక్ మెసెంజర్‌కు కూడా వర్తిస్తుంది.

 

 

పక్కా ప్లాన్ తో టార్గెట్ చేసిన హ్యాకర్లు...

పక్కా ప్లాన్ తో టార్గెట్ చేసిన హ్యాకర్లు...

ఫేస్‌బుక్‌ను హ్యాకర్లు ఇప్పటికిప్పుడు టార్గెట్ చేయలేదు. ఏడాది ముందుగానే పక్కా ప్లాన్ రచించారు. 2017 జూలైలో దాడి మొదలుపెట్టారు. ఇప్పటివరకు ఆ ఎటాక్‌ను ఫేస్‌బుక్ గుర్తించలేదంటే సెక్యూరిటీ సిస్టమ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 2018 సెప్టెంబర్ 16న అసాధారణ మార్పులు కనిపించాయి. అంటే అప్పట్నుంచి హ్యాకర్లు యూజర్ల డేటాను తస్కరిస్తున్నారన్న మాట. సెప్టెంబర్ 27న హ్యాకర్ల దాడిని ఫేస్‌బుక్ గుర్తించేసరికి 5 కోట్ల అకౌంట్లు హ్యాక్ అయిపోయాయి.

ఎవరు చేశారో ఎందుకు చేశారో అనే దాని పై  ఫేస్‌బుక్ సంస్థ కి  అంతు చిక్కట్లేదు....

ఎవరు చేశారో ఎందుకు చేశారో అనే దాని పై ఫేస్‌బుక్ సంస్థ కి అంతు చిక్కట్లేదు....

ఎవరు చేశారో ఎందుకు చేశారో అనే దాని పై ఫేస్‌బుక్ సంస్థ కి అంతు చిక్కట్లేదు. అయితే గతంలో అమెరికా ఎన్నికల సమయంలో రష్యా ఇలాంటి ప్రయత్నాలు చేసిందన్న వాదన ఉంది. అయితే ప్రస్తుతం ఈ దాడి వెనుక రష్యా ఉందో లేదో కూడా పేస్ బుక్ సంస్థ చెప్పలేకపోతుంది. ప్రస్తుతం FBI దీని పై దర్యాప్తు మొదలుపెట్టింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
5 crore Facebook accounts have been 'compromised'.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X