బెస్ట్ మ్యూజిక్ అప్లికేషన్స్ (ఉచితంగా)

Posted By:

టెక్నాలజీ పుణ్యమా అంటూ ఆవిర్భవించిన స్మార్ట్‌ఫోన్స్ అలాగే టాబ్లెట్ పీసీలు ప్రపంచపు వినోదాన్నే మార్చేశాయి. అరిచేతిలో ఇమిడిపోయే ఈ పరికరాల ద్వారా ఇంటర్నెట్, మ్యూజిక్, గేమ్స్, మూవీస్ ఇలా అనేక వినోదపు అవసరాలను ఎప్పుడంటే అప్పుడే తీర్చుకోగలుగుతున్నాం. మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను పూర్తిస్థాయి మ్యూజిక్ వనరుగా మార్చేసే ఉత్తమ నాలుగు మ్యూజిక్ అప్లికేషన్స్‌ను మీకు పరిచయం చేస్తున్నాం. గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతున్న ఈ అప్లికేషన్‌లను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు...

మొబైల్ ఇంకా స్మార్ట్‌ఫోన్ గ్యాలరీల కోసం....

గెలాక్సీ మ్యూజిక్...అదిరిపోయే మ్యూజిక్ ఫోన్!

దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్ సామ్‌సంగ్ ‘గెలాక్సీ మ్యూజిక్' పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను అందిస్తోంది. ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు అత్యుత్తమ సౌండ్ క్వాలిటీని శ్రోతకు అందిస్తాయి. సౌండ్ Alive & ఎస్ఆర్ఎస్ వంటి ఆడ్వాన్సుడ్ ఆడియో ఫీచర్లను డివైజ్‌లో లోడ్ చేశారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బెస్ట్ మ్యూజిక్ అప్లికేషన్స్ (ఉచితంగా)

గానా (Gaana):

వెబ్ ఆధారితంగా మ్యూజిక్ సర్వీస్‌లను అందించే గానా డాట్‌కామ్ తాజాగా మొబైల్ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్రపంచంలోకి ప్రవేశించింది. ఈ సైట్ ఆఫర్ చేస్తున్న ప్రత్యేక మొబైల్ మ్యూజిక్ అప్లికేషన్ ద్వారా తెలుగు, తమిళం ఇంకా ఇతర ప్రాంతీయ భాషలకు సంబంధించి వేలాది గీతాలను వినవచ్చు. ఆండ్రాయిడ్, ఐవోఎస్, బ్లాక్‌బెర్రీ ఇంకా విండోస్ ప్లాట్‌ఫామ్‌లను ఈ ప్రత్యేక మ్యూజిక్ అప్లికేషన్ సపోర్ట్ చేస్తుంది. డౌన్‌లోడ్ లింక్:

బెస్ట్ మ్యూజిక్ అప్లికేషన్స్ (ఉచితంగా)

దిన్‌గానా (Dhingana):

గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతున్న ఈ ప్రత్యేక మొబైల్ మ్యూజిక్ అప్లికేషన్ ఆండ్రాయిడ్, ఐవోఎస్, బ్లాక్‌బెర్రీ ఇంకా విండోస్8 ప్లాట్‌ఫామ్‌లను సపోర్ట్ చేస్తోంది. ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ప్రత్యేక మొబైల్ మ్యూజిక్ అప్లికేషన్ ద్వారా తెలుగు, తమిళం ఇంకా ఇతర ప్రాంతీయ భాషలకు సంబంధించి వేలాది గీతాలను వినవచ్చు. లింక్ అడ్రస్:

బెస్ట్ మ్యూజిక్ అప్లికేషన్స్ (ఉచితంగా)

సావన్ (Saavan):

గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతున్న ఈ ప్రత్యేక మొబైల్ మ్యూజిక్ అప్లికేషన్ ఆండ్రాయిడ్ డివైజ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ ప్రత్యేక మొబైల్ మ్యూజిక్ అప్లికేషన్‌ను ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా తెలుగు, తమిళం ఇంకా ఇతర ప్రాంతీయ భాషలకు సంబంధించి వేలాది గీతాలను వినవచ్చు. లింక్ అడ్రస్:

బెస్ట్ మ్యూజిక్ అప్లికేషన్స్ (ఉచితంగా)

రాగా (Raaga):

గూగుల్ ప్లే స్టోర్‌లో లభ్యమవుతున్న ఈ ప్రత్యేక మ్యూజిక్ అప్లికేషన్ గూగుల్ టీవీ ద్వారా మ్యూజిక్‌ను స్ట్రీమ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తుంది. ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. తెలుగు, తమిళం ఇంకా ఇతర ప్రాంతీయ భాషలకు సంబంధించి వేలాది గీతాలను వినవచ్చు. డౌన్‌లోడ్ లింక్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot