ఇన్ఫోసిస్‌లో అత్యధిక జీతం తీసుకుంటున్న ఐదుగురు ఎగ్జిక్యూటివ్‌లు

Posted By:

ఇన్ఫోసిస్ భారతదేశంలో పేరొందిన బహుళజాతి సాఫ్టువేరు సంస్థ. దీని ప్రధాన కార్యాలయం బెంగుళూరులో ఉంది. ఇది భారతదేశంలోని అతి పెద్ద ఐటి కంపెనీల్లో ఒకటి. దీనికి భారతదేశంలో 9 డెవెలప్‌మెంట్ సెంటర్లు మరియు ఇతర దేశాల్లో 34 కార్యాలయాలు ఉన్నాయి. ఎన్ ఆర్ నారాయణ మూర్తి ఈ కంపెనీ వ్యవస్థాపకుల్లో ముఖ్యులు. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఇన్ఫోసిస్‌లో అత్యధిక జీతం తీసుకుంటున్న ఐదుగురు ఎగ్జిక్యూటివ్‌ల వివరాలను మీముందుంచుతున్నాం...

(ఇంకా చదవండి: మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వేగవంతంగా పనిచేయాలంటే )

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

విశాల్ సిక్కా

అత్యధిక వేతనాన్ని అందుకుంటున్న ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్‌లలో ఆ సంస్థ సీఈఓ విశాల్ సిక్కా మొదటి స్థానంలో ఉన్నారు. 2014 నుంచి ఇన్ఫోసిస్ కంపెనీకి సేవలందిస్తున్న సిక్కా ప్రస్తుత వార్షిక వేతనం $900,000.

 

యూబి ప్రవీణ్‌ రావ్

ఇన్ఫోసిస్ కంపెనీకి సీఓఓ (చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్)గా వ్యవహరిస్తున్న యూబి ప్రవీణ్‌రావ్ అత్యధిక వేతనాన్ని అందుకుంటున్న ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్‌లలో రెండో స్థానంలో నిలిచారు. ఈయన వేతనం అన్ని రకాల బోనస్‌లు, ఇన్సెంటివ్‌లతో కలుపుకుని $1 మిలియన్ వరకు ఉండొచ్చని ఓ అంచనా.

 

రాజీవ్ బన్సాల్

ఇన్ఫోసిస్ కంపెనీకి చీఫ్ ఫైనాన్షియల్ అధికారిగా వ్యవహరిస్తున్న రాజీవ్ బన్సాల్ అత్యధిక వేతనాన్ని అందుకుంటున్న ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్‌లలో మూడవ స్థానంలో నిలిచారు. ఈయన వేతనం అన్ని రకాల బోనస్‌లు, ఇన్సెంటివ్‌లతో కలుపుకుని $770,858 వరకు ఉండొచ్చని ఓ అంచనా.

 

శ్రీకాంత్ మూర్తి

ఇన్ఫోసిస్ కంపెనీకి హ్యూమనర్ రోసోర్సెస్ హెడ్‌గా వ్యవహరిస్తున్న శ్రీకాంత్ మూర్తి అత్యధిక వేతనాన్ని అందుకుంటున్న ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్‌లలో నాల్గవ స్థానంలో నిలిచారు. ఈయన వేతనం అన్ని రకాల బోనస్‌లు, ఇన్సెంటివ్‌లతో కలుపుకుని $658,636 వరకు ఉండొచ్చని ఓ అంచనా.

 

డేవిడ్ డీ కెన్నడీ

ఇన్ఫోసిస్ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ వైస్‌ ప్రెసిడెంట్ ఇంకా జనరల్ కౌన్సిల్‌గా వ్యవహరిస్తున్న డేవిడ్ డీ కెన్నడీ అత్యధిక వేతనాన్ని అందుకుంటున్న ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్‌లలో ఐదవ స్థానంలో నిలిచారు. ఈయన వేతనం అన్ని రకాల బోనస్‌లు, ఇన్సెంటివ్‌లతో కలుపుకుని $209,701 వరకు ఉండొచ్చని ఓ అంచనా.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 highest-paid executives of Infosys. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot