చిన్నవే కాని చాలా శక్తివంతమైనవి

By Hazarath
|

స్మార్ట్‌ఫోన్ రాకతో ప్రపంచమే మారిపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా స్మార్ట్‌ఫోన్ లేకుండా బయటకు వెళ్లలేని పరిస్థతి.చిన్నా పెద్దా అందికీ ఈ స్మార్ట్‌ఫోన్‌తోనే పని. అయితే ఈ ఫోన్ కేవలం మాట్లాడుకోవడానికే అనే కాన్పెప్ట్ నుంచి బయటకొచ్చి ఏ పనైనా స్మార్ట్ ఫోన్ తో చేయొచ్చనే ధీమా మనలో పెరిగిందంటే అందుకు కొత్త పుంతలు తొక్కుతున్న టెక్నాలజీకి సలామ్ చేయాల్సిందే. స్మార్ట్ఫోన్ల తర్వాత ఠక్కున గుర్తొచ్చే మరో పరికరం టాబ్లెట్. అయితే స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ వంటి వాటిని పక్కనబెడితే, మనకు తెలియని, మన జీవితాన్ని మలుపు తిప్పే మరికొన్ని గాడ్జెట్లు త్వరలో భారతీయ మార్కెట్లోకి రాబోతున్నాయి. వాటి సంగతులేంటో తెలుసుకుందాం.

 

కోమెట్

కోమెట్

సిగ్నల్ ఉంటే చాలు ... స్మార్ట్‌ఫోన్‌తో ఎక్కడైనా మాట్లాడేయొచ్చా? నీళ్లలో పడితే దాని పని అంతే కదా మరి! కానీ కోమెట్ స్మార్ట్ఫోన్ నీళ్లలో పడితే మునగదు సరికదా, తేలుతుంది. అలాగే తీసి చక్కగా మాట్లాడుకోవచ్చు.

కోమెట్

కోమెట్

వంద శాతం వాటర్ రెసిస్టెంట్ ఫోన్ ఇది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న వాటర్ రెసిస్టెంట్ ఫోన్లకు కోమెట్ గట్టి పోటీ ఇవ్వబోతోంది.

స్మార్ట్ ఎగ్

స్మార్ట్ ఎగ్

టెక్నాలజీ పెరిగాక, ఇంట్లో రిమోట్తో కంట్రోల్ చేసే పరికరాలు ఎక్కువై పోతున్నాయి. టివి, ఏసి, డివిడి ప్లేయర్ ... ఇలా ఒక్కోదానికీ ఒక్కో రిమోట్ వాడటం చిరాకే. స్మార్ట్ ఎగ్ను ఇంటికి తెచ్చుకుంటే ఒకే రిమోట్తో అన్నిటినీ కంట్రోల్ చేయొచ్చు.

స్మార్ట్ ఎగ్
 

స్మార్ట్ ఎగ్

ఎలాగంటారా? బ్లూటూత్ ద్వారా మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్ ఎగ్ ను అనుసంధానించండి. అంతే ... మీరు ఇంట్లో ఏ డివైస్ ను కంట్రోల్ చేయాలనుకుంటున్నారోస్మార్ట్‌ఫోన్‌లో ఎంపిక చేసుకుని, బటన్ నొక్కితే సరి.

యోకేమ్

యోకేమ్

దీనిని స్మార్ట్ అడ్వంచర్ కెమెరాగా చెప్పుకోవచ్చు. కేవలం 55 గ్రాములు మాత్రమే బరువుండే ఈ కెమెరా ఎవరి చేతిలోనైనా ఇట్టే ఇమిడిపోతుంది. యోకేమ్తో రెండు గంటల సేపు ఏకధాటిగా వీడియో తీయచ్చు. అలాగే తక్కువ వెలుతురులోనూ చక్కగా ఫొటోలు తీయచ్చు.

యోకేమ్

యోకేమ్

యోకేమ్ కెమెరాకు మోలిఫై అనే యాప్ కూడా ఉంది. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే దీని సాయంతోనే కెమెరాను కంట్రోల్ చేయచ్చు.

ఫ్లేయె

ఫ్లేయె

ఇది ఫుట్బాల్ సైజులో ఉండే డ్రోన్. ఇందులో డ్యుయెల్ కోర్ ప్రాసెసార్తో అనుసంధానించిన లైనక్స్ బేస్డ్ కంప్యూటర్ ఉంటుంది. అలాగే జిపిఎస్, 512 ఎంబి రామ్, రెండు గ్రాఫిక్ ప్రాసెసార్స్, మల్టిపుల్ సెన్సర్లు 5 ఎంపి కెమెరా వంటివన్నీ ఉంటాయి.

ఫ్లేయె

ఫ్లేయె

ఈ కెమెరా ఎంత శక్తిమంతమైనదంటే పూర్తిస్థాయి హెచ్ డీ వీడియోలను సెకనుకు 30 ఫ్రేములు తీస్తుంది. ఫ్లేయెని స్మార్ట్‌ఫోన్‌తో కంట్రోల్ చేయొచ్చు.

Best Mobiles in India

English summary
Here Write 5 Hottest Upcoming Gadgets In India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X