మీరు తెలుసుకోవల్సిన ముఖ్యమైన కీబోర్డ్ షార్ట్‌కట్‌లు

|

మౌస్ లేకండా విండోస్ కంప్యూటర్‌ను ఆపరేట్ చేయడం సాధ్యమేనా..? ముమ్మాటికి సాధ్యమే కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ప్రయత్నించటం ద్వారా పీసీని నిశ్చింతగా ఆపరేట్ చేసుకోవచ్చు. పలు ముఖ్యమైన కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఇప్పుడు తెలుసుకుందాం.టాబ్స్‌ను ఓపెన్ లేదా క్లోజ్ చేసేందుకు..

మీరు వినియోగించే గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌లలో తెరిచిన టాబ్‌లను క్లోజ్ చేసేందుకు కీబోర్డ్‌లో ‘ctrl + W' షార్ట్‌కట్‌ను ఉపయోగిస్తే సరిపోతుంది. మొత్తం విండోను క్లోజ్ చేయాలంటే ‘ctrl + Shift + W'షార్ట్‌కట్‌ను ఉపయోగించండి.

అనుకోకుండా క్లోజ్ చేయబడిన టాబ్‌లను తెరవాలంటే ‘ctrl + Shift + T'షార్ట్‌కట్‌ను ఉపయోగించండి. విండోలో కొత్త టాబ్‌లను తెరవాలంటే ‘Shift + T'షార్ట్‌కట్‌ను ఉపయోగించండి.

మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో ఓ డాక్యుమెంట్‌ను తయారు చేస్తున్నామంటే అనేక సందర్భాల్లో ఫాంట్ సైజ్‌ను పెంచటం లేదా తగ్గించవల్సి ఉంటుంది. ఫాంట్ సైజ్‌ను పెంచేందుకు ‘ctrl + ]'షార్ట్‌కట్‌ను ఉపయోగించండి. ఫాంట్ సైజ్‌ను తగ్గించేందుకు ‘ctrl + ['షార్ట్‌కట్‌ను ఉపయోగించండి.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మీరు తెలుసుకోవల్సిన ముఖ్యమైన కీబోర్డ్ షార్ట్‌కట్‌లు

మీరు తెలుసుకోవల్సిన ముఖ్యమైన కీబోర్డ్ షార్ట్‌కట్‌లు

ఫైళ్లను పూర్తిగా డిలీట్ చేయాలంటే

కంప్యూటర్‌లోని అనవసరమైన ఫైళ్లను తొలిగించే క్రమంలో ఆయా ఫైళ్లను సెలెక్ట్ చేసుకుని ‘డిలీట్ ఆప్షన్' ద్వారా వాటిని తొలగిస్తాం. ఈ ప్రక్రియ ద్వారా సదరు ఫైళ్లు సంబంధిత ఫోల్డర్ నుంచి వైదొలుగినప్పటికి రీసైకిల్ బిన్‌లో వాటి మూలాలు ఉంటాయి. అనవసరమైన ఫైళ్లను కంప్యూటర్ నుంచి సమూలంగా తొలగించాలంటే ‘shift + delete' షార్ట్‌కట్‌ను ఉపయోగించాలి.

మీరు తెలుసుకోవల్సిన ముఖ్యమైన కీబోర్డ్ షార్ట్‌కట్‌లు

మీరు తెలుసుకోవల్సిన ముఖ్యమైన కీబోర్డ్ షార్ట్‌కట్‌లు

విండో + డాక్యుమెంట్‌ను పక్క పక్కకు చేర్చాలంటే..?

కేటాయించిన పనిలో ఓ డాక్యుమెంట్‌ను తయారు చేసేందుకు ఇంటర్నెట్ పై పనిచేస్తున్నారు. ఈ సందర్భంలో ప్రతిసారీ విండో నుంచి డాక్యుమెంట్‌కు మారాల్సి వస్తుంది. విండో + డాక్యుమెంట్‌ను పక్క పక్కకు చేర్చి పనిచేయటం ద్వారా మరింత సమయం ఆదా అవుతుంది. ముందుగా డాక్యుమెంట్‌ను ఓపెన్ చేయండి. ఆ తరువాత కీబోర్డ్‌లోని ‘windows key + left arrow key'ని ప్రెస్‌చేయటం ద్వారా డాక్యుమెంట్ ఎడుమ వైపు డిస్‌ప్లే పై అమర్చబడుతుంది. ఆ తరువాత బ్రౌజర్‌ను ఓపెన్ చేయండి. ఇప్పుడు, ‘windows key + Right arrow key'ని ప్రెస్ చేయటం ద్వారా బ్రౌజర్ కుడువైపు డిస్ ప్లే పై అమర్చబడుతుంది. ఇలా చేయటం వల్ల ప్రతిసారీ విండో నుంచి డాక్యుమెంట్ కు మారాల్సి న అవసరం ఉండదు పక్క పక్కనే పనిచేసుకోవచ్చు.

మీరు తెలుసుకోవల్సిన ముఖ్యమైన కీబోర్డ్ షార్ట్‌కట్‌లు
 
మీరు తెలుసుకోవల్సిన ముఖ్యమైన కీబోర్డ్ షార్ట్‌కట్‌లు

ఒక విండో నుంచి మరొక విండోకు మారటం ఏలా..?

ఒక విండో నుంచి మరొక విండోకు మారాల్సిన ప్రతిసారీ మౌస్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. కీబోర్డ్‌లో ‘Alt + Tab' షార్ట్‌కట్‌ను ఉపయోగించడం ద్వారా ఒక విండో నుంచి మరొక విండోకు సులభతరంగా మారవచ్చు. తమ పీసీలలో విండోస్ 7, విండోస్ 8 వర్షన్‌లను ఉపయోగిస్తున్న వారు ఒక విండో నుంచి మరొక విండోకు మారేందుకు ‘windows key + tab' షార్ట్‌కట్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు.

మీరు తెలుసుకోవల్సిన ముఖ్యమైన కీబోర్డ్ షార్ట్‌కట్‌లు

మీరు తెలుసుకోవల్సిన ముఖ్యమైన కీబోర్డ్ షార్ట్‌కట్‌లు

మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో ఫాంట్ సైజ్‌ను పెంచటం లేదా తగ్గించటం ఏలా..?

మైక్రోసాఫ్ట్ వర్డ్‌లో ఓ డాక్యుమెంట్‌ను తయారు చేస్తున్నామంటే అనేక సందర్భాల్లో ఫాంట్ సైజ్‌ను పెంచటం లేదా తగ్గించవల్సి ఉంటుంది. ఫాంట్ సైజ్‌ను పెంచేందుకు ‘ctrl + ]'షార్ట్‌కట్‌ను ఉపయోగించండి. ఫాంట్ సైజ్‌ను తగ్గించేందుకు ‘ctrl + ['షార్ట్‌కట్‌ను ఉపయోగించండి.

మీరు తెలుసుకోవల్సిన ముఖ్యమైన కీబోర్డ్ షార్ట్‌కట్‌లు

మీరు తెలుసుకోవల్సిన ముఖ్యమైన కీబోర్డ్ షార్ట్‌కట్‌లు

టాబ్స్‌ను ఓపెన్ లేదా క్లోజ్ చేసేందుకు..

మీరు వినియోగించే గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌లలో తెరిచిన టాబ్‌లను క్లోజ్ చేసేందుకు కీబోర్డ్‌లో ‘ctrl + W' షార్ట్‌కట్‌ను ఉపయోగిస్తే సరిపోతుంది. మొత్తం  విండోను క్లోజ్ చేయాలంటే ‘ctrl + Shift + W'షార్ట్‌కట్‌ను ఉపయోగించండి. అనుకోకుండా క్లోజ్ చేయబడిన టాబ్‌లను తెరవాలంటే ‘ctrl + Shift + T'షార్ట్‌కట్‌ను ఉపయోగించండి. విండోలో కొత్త టాబ్‌లను తెరవాలంటే ‘Shift + T'షార్ట్‌కట్‌ను ఉపయోగించండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X