ఈ ఆవిష్కరణలతో మనవాళ్లు ఇండియాను ఎక్కడో నిలిపారు

By Gizbot Bureau
|

టెక్ ప్రపంచంలో రోజు రోజుకు సరికొత్త అవిష్కరణలు నమోదవుతున్నాయి. అందరూ కొత్త కొత్త ఆలోచనలతో టెక్నాలజీని మరింతగా ముందుకు తీసుకెళుతున్నారు. ARPANET (predecessor of the Internet)ని లాంచ్ చేసి దాదాపు అర దశాబ్దం దాటిపోయింది. మనం నేడు ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నామంటే ఆ క్రెడిట్ అంతా European research communityదేనని చెప్పవచ్చు. మోడరన్ కంప్యూటర్స్ చాలా బాగా అభివృద్ధి చెందాయి.

5 Modern Tech Inventions By Indians That Make Them The Pride Of India

దశాబ్దం క్రితం 2జిబి మైక్రో ఎస్ డి అంటే చాలా గొప్పగా ఫీలయ్యేవారు, నేడు 1TB microSD cards వరకు లాంచ్ అయ్యాయి. మనం వాటిని చూస్తున్నాం కూడా. 90వ దశకంలో ఇండియాలోకి కంప్యూటర్స్ రాక అప్పుడప్పుడే మొదలైంది. అవుట్ సోర్సింగ్ అంతా బయట నుంచే జరిగేది. ఇప్పుడు కంప్యూటర్ ప్రపంచాన్ని మన చేతుల్లోకి తీసుకున్నాం. అన్ని రకాల అవకాశాలను పుచ్చుకుని ప్రగతిపథంలో దూసుకెళ్తున్నాం. కొన్ని విషయాల్లో మనం ఫెయిల్ అయినా మరికొన్ని విషయాల్లో ఇతర దేశాలకు సవాల్ విసురుతున్నాం. దీని వెనుక చాలామంది కృషి దాగి ఉంది. అలాంటి వారిలో ఈ అయిదు మంది చాలా ప్రత్యేకం. వారు చేసిన ఆవిష్కరణలను ఓ సారి చూద్దాం.

 అజయ్ భట్

అజయ్ భట్

తన ఆవిష్కరణతో డేటా ట్రాన్సఫర్ రంగానికి సరికొత్త దారిని చూపిన ఆవిష్కర్త. Universal Serial Bus (USB)ను కనుగొన్ని టెక్నాలజీ రంగంలో సరికొత్త అధ్యాయానికి తెరలేపారు. Maharaja Sayajirao University of Barodaలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన భట్ City University of New Yorkలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1990లో ఇంటెల్ లో senior staff architectగా జాయిన్ అయ్యారు. ఈ టీం చిప్ సెట్ మీద ప్రయోగం చేసింది. ఇప్పుడు ఆయన కనిపెట్టిన Universal Serial Bus (USB)నే కంప్యూటర్ డేటా ట్రాన్సఫర్ కు మార్గదర్శిగా నిలిచింది.

Vinod Dham (వినోద్ ధామ్ )

Vinod Dham (వినోద్ ధామ్ )

ఈయన్ని Father of the Pentium chipగా కూడా పిలుస్తారు. ఇంటెల్ నుండి అత్యాధునిక Pentium processorsని ఆవిష్కరించి టెక్ ప్రపంచంలో సరికొత్త ఒరవడికి నాంది పలికారు. prestigious Delhi College of Engineering నుంచి B.E. degreeని సాధించారు. Pentium processorని డెవలప్ చేయడంలో ఈయన పాత్ర చాలా ఉంది. అలాగే first Flash memory technology (ETOX)ని ఆవిష్కరించడంలో కూడా ఈయన పాత్ర ఉంది. దానికి కో ఆవిష్కర్త ఇతనే.

Pranav Mistry ( ప్రణవ్ మిస్త్రీ)

Pranav Mistry ( ప్రణవ్ మిస్త్రీ)

ఈయన ఓ కంప్యూటర్ సైంటిస్ట్ అలాగే ఆవిష్కర్త. SixthSense ద్వారా చాలా పాపులర్ అయ్యారు. ఇంతకుముందు Microsoft, Google, CMU, NASA, UNESCO, Japan Science & Technology వంటి వాటిల్లో పనిచేశారు. ఇప్పుడు శాంసంగ్ Galaxy Gear and Project Beyondలో పనిచేస్తున్నారు. SixthSense అనేది ఓ augmented reality (AR) technology . యూజర్లు స్క్రీన్ మీద తమ వేళ్లను కదిలించడం ద్వారా పాప్ అప్ బటన్స్ కంట్రోల్ చేయవచ్చు.

Anadish Pal

Anadish Pal

fuel-efficient internal combustion engineని కనుగొన్న ఆవిష్కర్త.రైల్ గన్ టెక్నాలజీ, గురుత్వాకర్షణ తరంగాలు, పోర్టబుల్ విద్యుత్ వనరులపై మీద ఇతనికే పేటెంట్ ఉంది. ప్రపంచంలో మరెవ్వరికీ లేదు. ఇండియా నుంచి US patent grantsలు ఎక్కువ కలిగిన వారిలో ఈయనే ఏకైక స్వతంత్ర ఆవిష్కర్త. induction motor as a sensor, a Personal Mobility Vehicle (PMV), a contact-less non-optical computer mouse suitable for 3D applications, a robotic platform, an electromagnetically controlled valve-less internal combustion engine వంటి వాటి మీద Anadish Palకు రీసెర్చ్ చేసేందుకు పేటెంట్లు ఉన్నాయి.

 Krishna Bharat

Krishna Bharat

Google Incలో ప్రిన్సిపల్ శాస్త్రవేత్త. యూజర్ ఇంటర్ ఫేస్ , వెబ్ సెర్చ్ లో ఆల్గారిధమిక్ సపోర్ట్ అలాగే కంటెంట్ ఎనాలసిస్ మీద పనిచేస్తున్నారు.Media & Journalism కేటగిరిలో 2003 World Technology Awardని కూడా అందుకున్నారు. ఇండియాలోని బెంగుళూరులో గల Google's new R&D Centerకి యాక్టింగ్ హెడ్ గా ఉన్నారు. ప్రస్తుతం గూగుల్ న్యూస్ మీద పనిచేస్తున్నారు.

Best Mobiles in India

English summary
5 Modern Tech Inventions By Indians That Make Them The Pride Of India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X