ఇండియాలో అతిపెద్ద మొబైల్ నెట్‌వర్క్‌లు ఇవే !

Written By:

ఈ రోజుల్లో మొబైల్ పోన్లు ఎవరైనా వినియోగిస్తుంటే ఆ ఫోన్‌లో తప్పనిసరిగా ఏదో ఓ నెట్ వర్క్ సిమ్ ఉండాల్సందే. ఇక డ్యూయెల్ సిమ్ వాడేవారు అయితే రెండు రకాల నెట్‌వర్క్‌లు గల సిమ్‌లు వేసుకుంటారు. సిగ్నల్ లేని సమయంలో కూడా బాగా మాట్లాడే టవర్ అలాగే డేటా స్పీడ్ బాగా ఉండే నెట్‌వర్క్ ఏది ఉందా అని అందరూ వెతుకుతుంటారు. ఇందుకోసం అన్ని రకాల నెట్‌వర్క్‌లు గల సిమ్ లు వాడేస్తుంటారు. అయితే ఇండియాలో అతిపెద్ద మొబైల్ నెట్‌వర్క్ సంస్థల వివరాలను మీకందిస్తున్నాం. వీటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

Read more: ఒక్క బగ్‌తో ఫేస్‌బుక్ నుంచి 10 లక్షలు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎయిర్‌టెల్

ఇండియాలోనే నంబర్ వన్ స్థానాన్ని ఎయిర్ టెల్ ఆక్రమించింది. ఎయిర్‌టెల్ కు దాదాపు 240. 77 మిలియన్ల సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. రీలెయిన్ మార్కెట్ లో దీని వాటా 24.30 శాతంగా ఉంది. అలాగే 4జీని లాంచ్ చేసిన ఫస్ట్ మొబైల్ సంస్థ కూడా ఇదే.

వోడాఫోన్

రెండవ స్థానం వోడాఫోన్ దే. దీనికి దాదాపు 191. 95 మిలియన్ల సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ఈ మధ్యనే కొన్ని ముఖ్యమైన నగరాల్లో 4జీని లాంచ్ చేసింది.

ఐడియా

మూడవస్థానం ఐడియాది. దాదాపు 170.66 మిలియన్ల సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. ఈ మధ్యనే 4జీని లాంచ్ చేసినా ఇంకా అది తయారీ దశలోనే ఉంది.

రిలయన్స్

ఈ కేటగిరిలో రియలన్స్ 4వ స్థానాన్ని ఆక్రమించింది. రిలయన్స్ కు దాదాపు 106.81 మిలియన్ల సబ్ స్క్రైబర్స్ ఉన్నారు.

ఎయిర్‌సెల్

అనతి కాలంలోనే ఎయిర్ సెల్ తన విశ్వరూపాన్ని చూపించింది. మిగతా కంపెనీలను వెనక్కి నెట్టి దూసుకుపోతోంది. దీనికి ఇప్పుడు దాదాపు 85.01 మిలియన్ల సబ్ స్క్రైబర్స్ ఉన్నారు.

అమెరికాలో అత్యంత చెత్త జీతాలు ఇచ్చే రాష్ట్రాలు

మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి. 

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి.

టెక్నాలజీ గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 5 Most popular Mobile Networks in India
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot