తక్కువ ధరలో లభించే 5 ఎయిర్‌టెల్ స్మార్ట్ రీఛార్జ్ ప్యాక్‌లు
సునీల్ మిట్టల్ అధినేతగా ముందుకు వెళుతున్న దిగ్గజ టెలికాం సంస్థ ఎయిర్టెల్ వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది.
సునీల్ మిట్టల్ అధినేతగా ముందుకు వెళుతున్న దిగ్గజ టెలికాం సంస్థ ఎయిర్టెల్ వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది.జియోతో పోటాపోటీగా దూసుకుపోతున్న ఈ దిగ్గజం మార్కెట్లోకి 5 సరికొత్త ప్లాన్లను ప్రవేశపెట్టింది. ప్రీపెయిడ్ కస్టమర్లకోసం ఈ కొత్త ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్లతో ముందుకు వచ్చింది . టెలికాం కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం భారతీ ఎయిర్‌టెల్ లాంచ్ చేసిన ప్లాన్లు రూ.34,రూ.64,రూ.94,రూ.144,రూ.244.

రూ.34 ప్లాన్ ...
రూ.34 ప్లాన్ ద్వారా యూజర్లకు 100MB డేటా తో పాటు రూ. 25.66 టాక్ టైమ్ లభిస్తుంది. అలాగే హోమ్ నెట్వర్క్ లోని అవుట్ గోయింగ్ కాల్స్ కి సెకండ్ కి 2.5 పైసలు ఛార్జ్ పడుతుంది.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే.

రూ.64 ప్లాన్ ...
రూ.64 ప్లాన్ ద్వారా యూజర్లకు 200MB డేటా తో పాటు రూ.54 టాక్ టైమ్ లభిస్తుంది. అలాగే హోమ్ నెట్వర్క్ లోని అవుట్ గోయింగ్ కాల్స్ కి సెకండ్ కి 1 పైసా ఛార్జ్ పడుతుంది.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే.

రూ.94 ప్లాన్ ...
రూ.94 ప్లాన్ ద్వారా యూజర్లకు 500MB డేటా తో పాటు రూ.94 టాక్ టైమ్ లభిస్తుంది. అలాగే హోమ్ నెట్వర్క్ లోని అవుట్ గోయింగ్ కాల్స్ కి నిమిషానికి 30 పైసలు ఛార్జ్ పడుతుంది.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే.

రూ.144 ప్లాన్...
రూ.144 ప్లాన్ ద్వారా యూజర్లకు 1GB డేటా తో పాటు రూ.144 టాక్ టైమ్ లభిస్తుంది. అలాగే హోమ్ నెట్వర్క్ లోని అవుట్ గోయింగ్ కాల్స్ కి నిమిషానికి 30 పైసలు ఛార్జ్ పడుతుంది.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 42 రోజులు మాత్రమే

రూ.244 ప్లాన్...
రూ.244 ప్లాన్ ద్వారా యూజర్లకు 2GB డేటా తో పాటు రూ.244 టాక్ టైమ్ లభిస్తుంది. అలాగే హోమ్ నెట్వర్క్ లోని అవుట్ గోయింగ్ కాల్స్ కి నిమిషానికి 30 పైసలు ఛార్జ్ పడుతుంది.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు మాత్రమే.


Click it and Unblock the Notifications