'ఫేస్‌బుక్' ఇష్టం లేదు అనడానికి ఐదు కారణాలు..!

Posted By: Prashanth

'ఫేస్‌బుక్' ఇష్టం లేదు అనడానికి ఐదు కారణాలు..!

 

800 మిలియన్ యూజర్స్‌ని కలిగి ప్రపంచంలో అతి పెద్ద సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఫేస్‌బుక్ అనతి కాలంలోనే యూజర్స్ నుండి చీత్కారాలు పొందుతుంది. ఫేస్‌బుక్ ఓ సోషల్ డాష్ బోర్డ్‌గా యూజర్స్ యొక్క అభిప్రాయాలను, సంగతులను తమకు నచ్చిన వారితో పంచుకోవడమే కాకుండా.. మానవుని జీవితంలో జరిగే కొన్ని సంఘటలను, ఫోటోలను అందరితో షేర్ చేసుకునే మహా సాధనంగా పని చేసింది. కానీ రాను రాను కొంత మంది యూజర్స్ ఫేస్‌బుక్ మహామ్మారికి బానిసలుగా తయారవుతున్నారని ఇటీవల ఓ ప్రముఖ ఆన్‌లైన్ సంస్ద తన రీసెర్చ్‌లో తెలిపింది.

దీనిని ఆసరా చేసుకోని మా పాఠకులు కొంత మందిని 'ఫేస్‌బుక్‌కి యూజర్స్ వ్యసనపరులవుతున్నారా.. అందుకు కారణాలు'ను క్లుప్తంగా తమ అభిప్రాయాల రూపంలో తెలియజేయండి అని అడడగా.. కొంత మంది వన్ ఇండియా పాఠకులు తెలిపిన కారణాలు మిగిలిన పాఠకుల కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం..

* తొలగించిన చిత్రాలు ఇప్పటికీ ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నాయి:

సోషల్ నెట్ వర్కింగ్ ఫేస్‌బుక్‌లో తొలగించిన చిత్రాలు నెలలు, సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఆన్ లైన్‌లో కనిపిస్తున్నాయి.

ప్రశాంత్, అనకాపల్లి

* మార్చ్‌ నుండి మొబైల్ ప్రకటనలు:

ఫేస్‌బుక్ ప్రస్తుతం ఓ సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్‌గా ఉన్నప్పటికీ.. రాబోయే కాలంలో లిస్టెడ్ కంపెనీగా అవతరించనున్న సందర్బంలో భవిష్యత్తు వాటాదారులకు నిధులను సమకూర్చే భాగంగా మార్చి నుండి వెబ్‌సైట్‌లో మొబైల్ ప్రకటనలకు అనుమతించనున్నట్లు తెలిసింది. ఐతే ఈ ప్రకటనలు మొబైల్ అప్లికేషన్స్ ద్వారా ప్రదర్శించబడుతాయా లేదా వెబ్‌సైట్‌లోనా అనేది ఇప్పటికీ స్పష్టంగా తెలుపలేదు.

నాగేష్, గుంటూరు

* కొత్తగా ప్రవేశపెట్టిన 'టైమ్‌లైన్' గోప్యతా సమస్యలు:

ఫేస్‌బుక్ ఇటీవలే యూజర్స్ కోసం కొత్తగా టైమ్‌లైన్ ఫీచర్‌ని ప్రవేశపెట్టింది. ఐతే ఈ ఫీచర్‌ని యూజర్స్ యొక్క పది మంది సన్నిహితులు లైక్ చేస్తే అర్దం కాకుండా గందరగోళానికి గురి చేస్తుంది. ఇంకో తీవ్రమైన విషయం ఏమింటంటే ఈ ఫీచర్ ద్వారా గోప్యతా ఆందోళన ఎక్కువైంది.

సరస్వతి, విజయవాడ

* ప్రజలు విచారం చెందడం:

ఇటీవల ఓ రీసెర్చ్‌లో వెల్లడైన నిజం ఏమిటంటే ఫేస్‌బుక్‌ వెబ్‌సైట్‌లో వారి మిత్రులు పోస్ట్ చేసిన పోస్టులు మరియు ఫోటోలతో పాటు సొంత జీవితాల గురించి సమాచారం వేరే వారు చూస్తున్నారని వినియోగదారులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

రామాచారి, హైదరాబాద్

* ఫేస్‌బుక్‌కి వ్యసనపరులవుతున్నారు:

సోషల్ మీడియా యువతను వ్యసనంలా పట్టుకుంటుందని గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. ఐతే దీనిని బలపరుస్తూ ఇటీవల ఓ ఆన్‌లైన్ మీడియా కొన్ని నిజాలను తెలియచేసింది. ఈ ఆన్‌లైన్ సర్వేలో వెల్లడైన నిజాల ప్రకారం యువత సిగరెట్లు, ఆల్కహాల్ కంటే కూడా సోషల్ మీడియాకు పెద్ద వ్యసన పరులుగా తయారయ్యారని తెలిపింది. ఈ విషయం అందరిని షాకింగ్‌కి గురి చేసింది.

18 నుండి 25 సంవత్సరాల మద్య గల కొంత మంది యువకులతో ఈ రీసెర్చ్ సంస్ద సర్వేని నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గోన్న యువత అంతా రోజుకీ 18 గంటల పాటు సోషల్ మీడియాని ఉపయోగించడమే కాకుండా.. సోషల్ మీడియా లేకుండా తాము ఉండలేక పోతున్నామని తెలిపారు. దీంతో యువతలో మానసిక రుగ్మతలు పెంచి, ఏకాగ్రత స్థాయి తగ్గిస్తుందని డాక్టర్లు వెల్లడిస్తున్నారు.

శర్మ, వరంగల్

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot