ఇండియాలో పబ్‌జి దుమ్మురేపడానికి అయిదు కారణాలు

By Gizbot Bureau
|

ప్రపంచవ్యాప్తంగా పిల్లలను, యువతనే కాదు, పెద్ద వారిని సైతం ఆకర్షిస్తూ బానిసలుగా మార్చుకుంటున్న మొబైల్ గేమ్ పబ్‌జి గేమ్. ఇది ఒక వర్చువల్ గేమ్. దీనిలో మునిగిపోయారంటే లోకమే తెలియకుండా గంటల తరబడి ఆడుతూనే ఉంటారు. ఇక ఈ గేమ్ ఫినిష్ చేయకపోతే ఏదో కోల్పోయామన్న భావన ప్లేయర్లలో కనబడుతుంది.

ఇండియాలో పబ్‌జి దుమ్మురేపడానికి అయిదు కారణాలు

ఒకానొక దశలో ఈ గేమ్ ఇండియాలో బ్యాన్ అయ్యే దశకు కూడా వచ్చింది .అయినప్పటికీ దీని మీద గేమింగ్ ప్రియుల మోజు తగ్గలేదు. మరి ఇంతలా ఇండియాలో ఈ గేమ్ ఊపడానికి కారణాలు ఏంటీ.. ఇది ఎందుకు అంతలా సక్సెస్ అయ్యింది? బ్యాటిల్ రాయల్ గేమ్స్ విభాగంలో ఫ్రీ ఫైర్, ఫోర్ట్‌నైట్ వంటి పలు గేమ్స్ ఉన్నా కూడా పబ్‌జిదే ఆధిపత్యం. ఎందుకు? పబ్‌జి గేమ్ అంటే గేమర్స్ ఎందుకు పడిచస్తున్నారా? అసలు పబ్‌జీకి ఎందుకంత క్రేజ్? ఇలాంటి విషయాలపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

చీప్ 4జీ నెట్ వర్క్ , మొబైల్ ఫోన్స్

చీప్ 4జీ నెట్ వర్క్ , మొబైల్ ఫోన్స్

ఇప్పుడు 4జీ డేటా అనేది అత్యంత ఛీప్ అయిపోయింది. దానికి తోడు అత్యంత తక్కువ ధరకే చైనా మొబైల్స్ ను అందిస్తున్నారు. ముఖ్యంగా జియో రాకతో డేటా అనేది లో కాస్ట్ అవడంతో యూజర్లు ఈ గేమ్ మీద తెగ ఆసక్తిని ప్రదర్శించారు. అలాగే చైనా ఫోన్లలో అత్యంత తక్కువ ధరలో అదిరిపోయే గేమింగ్ ఫీచర్లను అందించడం వల్ల కూడా ఇండియాలో ఇది సునామి లాగా దూసుకుపోయింది.

ఉచితం

ఉచితం

భారతీయులు గేమ్స్, యాప్స్ వంటి వాటిపై ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడరు. అందుకే దేశంలో ప్రీమియం, పెయిడ్ యాప్స్‌కు ఆదరణ తక్కువగా ఉంటుంది. పబ్‌జి గేమ్ డెవలపర్లు తెలివైన నిర్ణయం తీసుకున్నారు. యాప్‌ను ఉచితంగా అందిస్తున్నారు.

 బ్యాటిల్ రాయల్ సెక్షన్

బ్యాటిల్ రాయల్ సెక్షన్

కొత్త కాన్సెప్ట్‌. పబ్‌జి గేమ్ రాకముందు మనలో చాలా మందికి బ్యాటిల్ రాయల్ సెక్షన్ గురించి పెద్దగా తెలియదు. ఇది పబ్‌జికి కలిసొచ్చింది. డెవలపర్లు కూడా పోటీని తప్పించుకోవడానికి పబ్‌జి గేమ్‌ను ముందుగానే తీసుకుచ్చారు.

కంప్యూటర్ గేమ్ అనుభూతినే

కంప్యూటర్ గేమ్ అనుభూతినే

స్మార్ట్‌ఫోన్స్‌లో కూడా అందుబాటులోకి రావడం అనే అంశం పబ్‌జి గేమ్ విజయానికి మరొక కారణం. కంప్యూటర్ గేమ్ అనుభూతినే స్మార్ట్‌ఫోన్‌లో కూడా పొందొచ్చు. పబ్‌జి గేమ్ పీసీల్లో, మొబైల్స్‌లో దాదాపు ఒకేలా ఉంటుంది. అందువల్ల పీసిలను వదిలేసి ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చుని యూజర్లు ఆడుకునే వెసులుబాటు ఉండటం వల్ల ఇది పాపులర్ అయింది. మొబిలిటీ అనేది పబ్‌జి గేమ్ సక్సెస్‌కు దోహదపడిన మరో కీలక అంశం ఏంటంటే.. గేమ్ స్మార్ట్‌ఫోన్స్‌లోకి వచ్చిన తర్వాత ఎక్కడి నుంచైనా ఆడటం సులభతరమైంది. పబ్‌జి మొబైల్ యూజర్లు పీసీ యూజర్లతో కూడా ఆడొచ్చు.

ఒకేసారి 99 మంది ప్లేయర్లతో

ఒకేసారి 99 మంది ప్లేయర్లతో

పబ్‌జి గేమ్‌ను కేవలం ఒక్కరు మాత్రమే కాకుండా ఒకేసారి 99 మంది ప్లేయర్లతో కలిసి ఆడుకోవచ్చు. అలాగే ఒక టీమ్‌లో నలుగురు ఉంటారు. అంటే స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి కూడా గేమ్ ఆడొచ్చు. అలాగే టీమ్ మెంబర్లతో మాట్లాడుకోవచ్చు. వాయిస్, చాట్ ఫీచర్లు ఉన్నాయి. అలాగే గేమింగ్ ప్రియులు ఇతర గేమ్స్ వైపు మళ్లకుండా కొన్ని రకాల ఫీచర్లను ఇందులో పొందుపరిచారు.

పిల్లలు, యువతలో హింసాత్మక ప్రవృత్తి

పిల్లలు, యువతలో హింసాత్మక ప్రవృత్తి

అయితే ఈ గేమ్ ముఖ్యంగా విపరీత ప్రభావం చూపుతోంది. పిల్లలు, యువతలో హింసాత్మక ప్రవృత్తి పెంచుతూ వారి మానసిక ధోరణిలో తీవ్రమైన మార్పులు తీసుకు వస్తుంది. దాని వల్ల వారి ప్రవర్తనలో వికృత మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భారతదేశంలో పబ్‌జి గేమ్ ఆడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ గేమ్ ఆడుతూండడం వల్ల పిల్లలు చదువుపై ధ్యాస ఉంచకపోవడం, యువత బాధ్యతగా ప్రవర్తించకపోవడం లాంటి ఘటనలు తరచూ నేడు వెలుగులోకి వస్తున్నాయి. వీటిని నియంత్రించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.

Best Mobiles in India

English summary
5 Reasons why PUBG Mobile is successful in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X