ఈ 5 అంశాలు మీ ఫోన్ లో గుర్తిస్తే.. మీ smartphone హ్యాక్ అయినట్లే!

|

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వినియోగించడం సర్వ సాధారణ అయింది. కాలింగ్, మెయిల్, మీడియా మరియు ప్రతి దాని కోసం smartphone లు ఉపయోగించబడుతున్నాయి. వ్యక్తిగత, లేదా ప్రొఫెషనల్ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన డేటాలను కూడా స్టోర్ చేసుకోవడానికి చాలా మంది ఫోన్‌ని ఉపయోగిస్తున్నారు. మరి ఇంత ముఖ్యమైన డేటాను స్టోర్ చేసుకునే మన మొబైల్స్ ను.. వైరస్‌లు మరియు హ్యాకర్‌ల నుండి రక్షించుకోవడం చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని అందరూ గుర్తించాలి.

 
ఈ 5 అంశాలు మీ ఫోన్ లో గుర్తిస్తే.. మీ smartphone హ్యాక్ అయినట్లే!

మొబైల్ ఒకసారి హ్యాక్ అయితే అందులో ఉన్న అతి ముఖ్యమైన సమాచారం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మన మొబైల్ హ్యాక్ కాకుండా అతి జాగ్రత్తగా కాపాడుకోవాలి. కానీ, చాలా మందికి కొన్ని సార్లు తమ మొబైల్ హ్యాక్ అయిందనే విషయాన్ని గుర్తించడం తెలియదు. ఫోన్ హ్యాక్ అయిందా లేదా అనేది కొన్ని చిన్నపాటి సంకేతాల ఆధారంగా గుర్తించవచ్చు. ఆ సంకేతాలను మేం మీ కోసం అందిస్తున్నాం. మీరు కూడా మీ మొబైల్ లో ఎప్పుడైనా ఈ తరహా సంకేతాల్ని గమనించినట్లయితే మీ మొబైల్ హ్యాక్ అయిందని నిర్దారించుకుని.. జాగ్రత్త పడండి.

పాప్-అప్ ప్రకటనలు;

పాప్-అప్ ప్రకటనలు;

మీరు థర్డ్ పార్టీ కంపెనీల నుండి సంబంధం లేని పాప్-అప్ ప్రకటనలు పొందుతున్నట్లయితే మీ మొబైల్ కొంత ప్రమాదంలో ఉన్నట్లే. మీరు మీకు తెలియకుండానే ఏదో ఒక సమయంలో పొరపాటున ఈ రకమైన పాప్‌అప్‌లను స్క్రీన్ చేయగల మాల్వేర్/స్పైవేర్ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసి ఉండవచ్చు. అటువంటి సందర్భాలలో, ఆ పాప్ అప్ కంటెంట్ అత్యంత ప్రమాదకరం కనుక దానిపై క్లిక్ చేయకండి.

అత్యంత నెమ్మదిగా పనితీరు;

అత్యంత నెమ్మదిగా పనితీరు;

మీ ఫోన్ హ్యాక్ చేయబడితే, సిస్టమ్ పనితీరు ప్రభావితం కావచ్చు మరియు దీని కారణంగా, ఫోన్ నిదానంగా పని చేయవచ్చు. మరియు మొబైల్ పనితీరు భారీ తేడాతో మందగిస్తుంది. మీ మొబైల్ పని చేయడంలో చాలా స్లో అవుతుంది. ఈ పరిణామం మీ కూడా మీ మొబైల్ లో పలు మాల్వేర్లు ఉన్నాయని చెప్పడానికి ఓ చిన్న ఉదాహరణ. అంతేకాకుండా, కొన్ని యాప్‌లు మీ అనుమతి లేకుండా నే ఆటోమెటిక్ గా ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో మీరు వెంటనే ఫోన్లో ప్రమాదానికి కారణమైన యాప్ ను గుర్తించి తీసివేయాలి. లేదా సాఫ్ట్వేర్ అప్డేట్ వంటి జాగ్రత్తల్ని పాటించాలి.

అధిక డేటా వినియోగం;
 

అధిక డేటా వినియోగం;

మీ ఫోన్ హ్యాక్ చేయబడితే, కొన్ని స్పైవేర్ లు అధిక మొత్తంలో మొబైల్ డేటా లేదా Wi-Fiని ఉపయోగించడం జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, మీరు ఫోన్ సెట్టింగ్‌లకు సులభంగా నావిగేట్ చేయవచ్చు. తద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌లో ఏ యాప్ ఎక్కువ డేటాను వినియోగిస్తుందో మీరు తనిఖీ చేయాలి. ఏ యాప్ మీ ఫోన్లో అధికంగా డేటాను తింటుందో దాన్ని వెంటనే తీసివేయాలి. లేదంటే మీ ఫోన్ మొత్తానికే ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది.

వేగంగా బ్యాటరీ డ్రెయిన్;

వేగంగా బ్యాటరీ డ్రెయిన్;

ఆధునిక స్మార్ట్‌ఫోన్‌లు చాలా సమయం బ్యాటరీ లైఫ్ కలిగి ఉంటాయి. ఇది వినియోగాన్ని బట్టి మారవచ్చు. కానీ, మీ మొబైల్ యొక్క బ్యాటరీ వేగంగా డ్రెయిన్‌ బారిన పడినట్లయితే.. ఏ యాప్ బ్యాటరీని ఎక్కువగా వినియోగిస్తుందో ఖచ్చితంగా తనిఖీ చేయండి. ఆ తర్వాత అవసరానికి అనుగుణంగా చర్యల్ని తీసుకొండి.

ఆటోమెటిక్ గా ఎవరికైనా కాల్‌లు లేదా సందేశాలు వెళ్లడం;

ఆటోమెటిక్ గా ఎవరికైనా కాల్‌లు లేదా సందేశాలు వెళ్లడం;

మీ ఫోన్ నుంచి మీ అనుమతి లేకుండానే కొన్ని సార్లు కాల్స్ లేదా SMS లు వెళ్తుంటాయి. అంతేకాకుండా, మీకు సంబంధం లేని కాల్స్, మెసేజ్ లు రావడం కూడా కొంత ప్రమాదకర పరిణామమనే చెప్పొచ్చు. ఇలాంటి సమయాల్లో మీరు మీ ఫోన్ హ్యాక్ అయిందనే నిర్దారణకు రావాలి. ఆ తర్వాత హ్యాక్ నిజంగానే అయిందని భావిస్తే.. వెంటనే తగు జాగ్రత్తలు పాటించాలి. ఇలాంటి సమయంలో మీరు వెంటనే ఫోన్లో ప్రమాదానికి కారణమైన యాప్ ను గుర్తించి తీసివేయాలి. లేదా సాఫ్ట్వేర్ అప్డేట్ వంటి జాగ్రత్తల్ని పాటించాలి.

 

Best Mobiles in India

English summary
5 signs to recongise if your smartphone hacked or not. Check the details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X