మీ ఇల్లు అందంగా కనిపించాలా, ఈ స్మార్ట్ సొల్యూషన్స్ మీ కోసమే..

ఇంటర్నెట్ పరిధి అమితవేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఈకో సిస్థం అనేది నేడు ప్రముఖ పాత్రను పోషిస్తోంది. అయితే ఇప్పటిదికా ఈ ఈకో సిస్టం ఇండియాలో ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. అయినప్పటికీ కంపెనీల

|

ఇంటర్నెట్ పరిధి అమితవేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఈకో సిస్థం అనేది నేడు ప్రముఖ పాత్రను పోషిస్తోంది. అయితే ఇప్పటిదికా ఈ ఈకో సిస్టం ఇండియాలో ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. అయినప్పటికీ కంపెనీలు మాత్రం ఈకో సిస్టంకు సంబంధించిన అనేక రకాలైన గాడ్జెట్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. ఇప్పటికే గూగుల్, అమెజాన్ లాంటి కంపెనీలు ఈకో సిస్టం గాడ్జెట్లను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఈకో డివైస్ లను వాయిస్ తో కంట్రోల్ చేసేవిధంగా కొన్ని రకాల ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువచ్చాయి.

మీ ఇల్లు అందంగా కనిపించాలా, ఈ స్మార్ట్ సొల్యూషన్స్ మీ కోసమే..

కేవలం వాయిస్ కమాండ్ ఆధారంగానే ఈ రకమైన గాడ్జెట్లను మీరు కంట్రోల్ చేయవచ్చు. మీ బెడ్ రూంని అత్యంత ఆకర్షణీయంగా చేసే వాటిల్లో ఈ గాడ్జెట్లు ప్రముఖ పాత్ర వహిస్తాయి కూడా .మరి అలాంటి గాడ్జెట్లు మార్కెట్లో ఏమైనా ఉన్నాయా.. ఉంటే అవి ఎలా ఉంటాయి. వాటి పనితీరు ఎలా ఉంటుంది. ధర ఎంత ఉంటుంది అనే దానిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం. పదండి.

Syska TL-1007-I Smart Table Lamp

Syska TL-1007-I Smart Table Lamp

ఈ 7 watts(W)టేబుల్ ల్యాంప్ అమెజాన్ ఈకో , అలాగే గూగుల్ హోమ్ ఆధారంగా పనిచేస్తుంది. కేవలం వాయిస్ కంట్రోల్ ఆధారంగానే వీటిని మీరు నియంత్రించుకోవచ్చు. మీరు బ్రైట్ నెస్ లెవల్స్ పెంచుకోవాలన్నా, నైట్ మోడ్ కి మార్చుకోవాలన్నా , అలాగే చదువుకునేందుకు అనుగుణంగా లైటింగ్ మార్చుకోవాలన్నా కేవలం వాయిస్ ఆధారంగానే చేయవచ్చు. ఈ లైటు యావరేజ్ గా 30 వేల గంటల పాటు పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. దీని ధర రూ. 3,699గా ఉంది.

Philips Hue

Philips Hue

Philips' Hue series లైట్లు మీ హోమ్ కి బెస్ట్ సొల్యూషన్ ఇచ్చేందుకు ఎల్లప్పుడూ రెడీగా ఉంటాయని చెప్పవచ్చు. 10W smart bulb కంపెనీ నుంచి వచ్చిన ఎంట్రీ లెవల్ బల్బ్ గా చెప్పవచ్చు. వన్ ఇయర వారంటీతో వస్తోంది. ఇది కూడా అమెజాన్ ఈకో , అలాగే గూగుల్ హోమ్ ఆధారంగా పనిచేస్తుంది. కేవలం వాయిస్ కంట్రోల్ ఆధారంగానే వీటిని మీరు నియంత్రించుకోవచ్చు.దీంతో పాటు ఆపిల్ హోమ్ కిట్ సపోర్ట్ కూడా చేస్తుంది. సిరి వాయిస్ కమాండ్ ద్వారా దీన్ని సమర్థవంతంగా నియత్రించుకోవచ్చు.దీని ధర రూ. 1,929గా ఉంది.

Wipro Next Smart LED Batten

Wipro Next Smart LED Batten

మీరు చిన్న బల్బ్ ని వాడుతున్నట్లయితే దానికి పక్కనపడేయండి. ఎందుకంటే విప్రో కంపెనీ LED Battenతో చక్కటి పరిష్కార మార్గాన్ని సూచిస్తోంది.వీటిని మీరు Wipro Next Smart app ద్వారా మీ ఫోన్ నుండే నియంత్రణ చేయవచ్చు. అలాగే అమెజాన్ ఈకో , గూగుల్ హోమ్ ఆధారంగా పనిచేస్తుంది. కేవలం వాయిస్ కంట్రోల్ ఆధారంగానే వీటిని మీరు నియంత్రించుకోవచ్చు.దీని ధర రూ. 1,499గా ఉంది.

Yeelight LED Bulbs

Yeelight LED Bulbs

ప్రముఖ చైనా ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీ షియోమి ఈ మధ్యనే ఇండియా మార్కెట్లోకి ప్రవేశించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ కంపెనీ అనేక కొత్త రకాలైన ఉత్పత్తులను ఇండియా మార్కెట్లోకి తీససుకువస్తోంది. ఈ ఉత్పత్తులో భాగంగా Yeelight Smart LED Bulbని ఇండియా మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీనిని Mi Home app ద్వారా కంట్రోల్ చేయవచ్చు. రెండు రకాల వేరియంట్లలో వచ్చింది. మీరు దీని ద్వారా బ్రైట్ నెస్ ని కంట్రోల్ చేయవచ్చు. అమెజాన్ ఈకో , గూగుల్ హోమ్ ఆధారంగా పనిచేస్తుంది. కేవలం వాయిస్ కంట్రోల్ ఆధారంగానే వీటిని మీరు నియంత్రించుకోవచ్చు.దీని ధర రూ. 1,499గా ఉంది.

 Homemate Wi-Fi Multicolour Smart LED Strip

Homemate Wi-Fi Multicolour Smart LED Strip

మీ మూడ్స్ కి అనుగుణంగా మీరు ఈ స్మార్ట్ ఉత్పత్తులను సెట్ చేసుకోవచ్చు. కంపెనీ మీ మూడ్ ని బట్టి ఏది వాడాలో అనే దాని మీద తన ఉత్పత్తులను పరిచయం చేసింది.ఈ గాడ్జెట్లు అలెక్సా, గూగుల్ హోమ్ సపోర్ట్ తో వచ్చాయి.అలాగే కంపెనీ సొంత యాప్ ద్వారా కూడా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. IFTTT appని ఉపయోగించి మీకు నచ్చిన విధంగా ఈ లైట్లను సెట్ చేసుకోవచ్చు. దీని ధర రూ. 2,790గా ఉంది. అమెజాన్ లో అందుబాటులో ఉంది.

Best Mobiles in India

English summary
5 smart lighting solutions to brighten up your home

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X