‘సేఫర్ ఇంటర్నెట్ డే’ కోసం 5 సూపర్ టిప్స్

Posted By:

ఫిబ్రవరి 10, ఇంటర్నెట్ చరిత్రలో ఈ రోజుకో ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా నేటి యువత ఈ రోజును గుర్తు పెట్టుకోవల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. అదే ‘సేఫర్ ఇంటర్నెట్ డే'. అందరం కలిసి ఒక మంచి ఇంటర్నెట్‌ను సృష్టిద్దాం అనే నినాదంతో ప్రారంభమైన సేఫర్ ఇంటర్నెట్ డే 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

‘సేఫర్ ఇంటర్నెట్ డే’ కోసం 5 సూపర్ టిప్స్

ఇంటర్నెట్ మనుషులు జీవితాలనే మార్చేసింది. సరిగ్గా 45 సంవత్సరాల క్రితం అక్టోబర్ 29, 1969న 22.30 నిమిషాలకు రెండు కంప్యూటర్ల మధ్య మొట్టమొదటి సారిగా ఎలక్ట్రానిక్ సందేశాన్ని ప్రసారం చేయటం జరిగింది. వివరాల్లోకి వెళితే... లాస్ ఏంజెల్స్‌లోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం (యూసీఎల్ఏ)లో విద్యార్థి ప్రోగ్రామర్‌గా ఉన్న చార్లీ క్లైన్ ARPANET ( ఆడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ నెట్‌వర్క్) ద్వారా ప్రొఫెసర్ లియోనార్డ్ క్లెయి న్రాక్ పర్యవేక్షణలో కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని ఎస్‌డిఎస్ సిగ్మా 7 హోస్ట్ కంప్యూటర్ నుంచి స్టాన్‌ఫర్డ్ రీసెర్చ్ ఇన్స్‌టిట్యూట్‌లో ఉన్న మరో ప్రోగ్రామర్‌కు చెందిన ఎస్ఆర్ఐ ఎస్‌డిఎస్ 940 హోస్ట్ కంప్యూటర్‌కు మొట్టమొదటి సారిగా ఎలక్ట్రానిక్ సందేశాన్ని ప్రసారం చేసారు.

‘సేఫర్ ఇంటర్నెట్ డే'ను పురస్కరించుకుని 5 సూపర్ టిప్స్...

Use two-factor authentication (రెండు కారకాల ప్రమాణీకరణ ఉపయోగించండి)

‘సేఫర్ ఇంటర్నెట్ డే’ కోసం 5 సూపర్ టిప్స్

సెక్యూరిటీ విషయంలో జీమెయిల్ యూజర్లను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. భద్రత కోసం జీమెయిల్ యూజర్లు టూ స్టెప్ వెరిఫికేషన్ చేసుకోవటం మంచిదని వెల్లడించింది. టూ స్టెప్ వెరిఫికేషన్ వెరిఫికేషన్‌లో భాగంగా మొదటి స్టెప్ పాస్‌వర్డ్ రూపంలో, రెండవ స్టెప్ పాస్‌ కోడ్ రూపంలో వినియోగించవల్సి ఉంటుంది. టూ స్టెప్ వెరిఫికేషన్ విధానంలో భాగంగా మీరు మీ మొబైల్ నెంబరును గూగుల్ అనుసంధానించవల్సి ఉంటుంది. గూగుల్ అకౌంట్‌ను ఓపెన్ చేసే ప్రయత్నంలో యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేసిన

ప్రతిసారి మీ మొబైల్ ఫోన్‌కు 6 అంకెల వెరిఫికేషన్ కోడ్ నెంబరుతో మెసేజ్ వస్తుంది. అప్పుడు ఆ కోడ్ నెంబరు ఇతరులకు తెలియదు కాబట్టి మీ జీమెయిల్ అకౌంట్ ఇతరులు ఎవరూ హ్యాకింగ్ చేయలేదు. దీనివల్ల మీ మెయిల్‌లో సురక్షితంగా లావాదేవీలు జరుపుకోవచ్చు.

‘సేఫర్ ఇంటర్నెట్ డే’ కోసం 5 సూపర్ టిప్స్

మీరు ఉపయోగించే బ్రౌజర్లు, ఆపరేటింగ్ సిస్టంలు ఇంకా మొబైల్ డివైస్‌లకు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవసరం. కాబట్టి వాటిని ఎప్పటికప్పడు అప్‌డేట్ చేసుకోండి.

‘సేఫర్ ఇంటర్నెట్ డే’ కోసం 5 సూపర్ టిప్స్

సైబర్ దాడుల నేపధ్యంలో మీ అన్ని రకాల అకౌంట్‌లకు సంబంధించి విభిన్నమైన పాస్‌వర్డ్‌లను సెట్ చేసుకోండి.

గూగుల్ తమ డ్రైవ్ యూజర్ల కోసం ప్రత్యేకమైన సెక్యూరిటీ చెకప్ ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేస్తోంది. ఫిబ్రవరి 17 వరకు ఈ ప్రోగ్రామ్ కొనసాగుతుంది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా మీ గూగుల్ అకౌంట్‌లకు సంబంధించి పలు పరీక్షలను నిర్వహించం జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.

‘సేఫర్ ఇంటర్నెట్ డే’ కోసం 5 సూపర్ టిప్స్

HTTPSనే ఉపయోగించండి.English summary
5 super easy tips for better online security on Safer Internet Day. Read more in Telugu Gigbot....
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting