2013‌లో మరణించిన టెక్నాలజీ దార్శనికులు!

Posted By:

టెక్నాలజీ ప్రపంచంలో తమకంటూ ప్రత్యేకమైన నైపుణ్యులాను అలవరుచుకున్న పలువురు ప్రతిభావంతులు తమ క్రియేటివ్ మేథోసంపత్తితో అనేకమైన ఆవిష్కరణలకు ఆజ్యం పోయటం జరిగింది. వారి కృషి ఫలితంగానే సుసాధ్యమైన సాంకేతికను నేడు మనం ఎంచక్కా వినియోగించుకుంటున్నాం. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా టెక్నాలజీ విభాగంలో ప్రత్యేకమైన వ్యక్తులుగా గుర్తింపుపొంది 2013లో తుదిశ్వాస విడచిన పలువురు టెక్నాలజీ దార్శనికుల వివరాలను మీతో షర్ చేసుకుంటున్నాం...

అమర్ బోస్ (1929 - 2013):

బోస్ కార్పొరేషన్ వ్యవస్థాపకులైన అమర్ బోస్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో బ్యాచలర్స్, మాస్టర్ డిగ్రీతో పాటు డాక్టరేట్‌ను పొందారు. 1964లో ఈయన నెలకొల్పిన అమర్ బోస్ కంపెనీ ఆడియో టెక్నాలజీ, స్పీకర్లు ఇంకా హెడ్ ఫోన్‌ల తయారీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకుంది. 1929లో జన్మించిన బోస్ జూలై 12, 2013న వేల్యాండ్‌లోని తన సొంత నివాసంలో తుదిశ్వాస విడిచారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

2013‌లో మరణించిన టెక్నాలజీ దార్శనికులు!

Aaron Swartz (1986 - 2013)

ఇంటర్నెట్ కార్యకర్తగానే కాకుండా కళానైపుణ్యత కలిగిన ప్రోగ్రామర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆరోన్ స్వర్త్జ్ తీవ్రమైన ఒత్తిడి కారణంగా తన 26వ ఏటనే మృత్యువడికి చేరుకున్నారు.

ఆర్ఎస్ఎస్ అభివృద్ధికి ఆరోన్ కృషి చేసారు.

 

2013‌లో మరణించిన టెక్నాలజీ దార్శనికులు!

Yvonne Brill (1924 - 2013), వైవోన్నే బ్రిల్ (1924 - 2013)

కెనడీయన్ శాస్త్రవేత్త అయిన వైవోన్నే బ్రిల్ 2011లో అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా చేతుల మీదగా నేషనల్ మెడల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ బహుమతిని అందుకున్నారు. నాసా చేపట్టిన అనేక ప్రాజెక్టులకు బ్రిల్ పని చేసారు. రొమ్ము క్యాన్సర్ భారిన పడిన బ్రిల్ మార్చి 27, 2013న తుది శ్వాసను విడిచారు.

 

2013‌లో మరణించిన టెక్నాలజీ దార్శనికులు!

జాక్ హార్కర్ (1926 - 2013), Jack Harker (1926 - 2013)

జాక్ హార్కర్ (ఫోటోలో మధ్యనున్న వ్యక్తి) రిమూవబుల్ డిస్క్ స్టోరేజ్ పితామహునిగా చరిత్రకెక్కారు. జాక్ ఐబీఎమ్ కంపెనీలో 35 సంవత్సరాల పాటు విధులు నిర్వహించారు. ఐబీఎమ్ 1311 డిస్క్ స్టోరేజ్ డ్రైవ్ ప్రాజెక్టులో జాక్ హార్కర్ కీలక పాత్ర పోషించారు. ఆనారోగ్యం కారణంగా జాక్ ఏప్రిల్ 27, 2013న కాలిఫోర్నియాలోని తన సొంతం నివాసంలో పరమపదించారు.

 

2013‌లో మరణించిన టెక్నాలజీ దార్శనికులు!

రే హార్రీహౌసన్ (1920 - 2013), Ray Harryhausen (1920 - 2013)

నేటి చలన చిత్రాల్లో మన చూస్తున్న స్పెషల్ ఎఫెక్ట్స్‌కు పునాది వేసిన వ్యక్తే రే హార్రీహౌసన్. స్టాప్‌ మోషన్ యానిమేషన్ విభాగంలో రారాజుగా నిలిచన హార్రీహౌసన్ డైనామోషన్ పేరుతో కాల్పనిక మట్టి జీవులను ప్రత్యక్ష చర్యలో చూపించ గలిగే టెక్నిక్‌ను సృష్టించారు. హాలివుడ్ చలనచిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలందించిన రే హార్రీహౌసన్ మే 7, 2013న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

 

2013‌లో మరణించిన టెక్నాలజీ దార్శనికులు!

Amar Bose (1929 - 2013), అమర్ బోస్ (1929 - 2013):

బోస్ కార్పొరేషన్ వ్యవస్థాపకులైన అమర్ బోస్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో బ్యాచలర్స్, మాస్టర్ డిగ్రీతో పాటు డాక్టరేట్‌ను పొందారు. 1964లో ఈయన నెలకొల్పిన అమర్ బోస్ కంపెనీ ఆడియో టెక్నాలజీ, స్పీకర్లు ఇంకా హెడ్ ఫోన్‌ల తయారీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకుంది. 1929లో జన్మించిన బోస్ జూలై 12, 2013న వేల్యాండ్‌లోని తన సొంత నివాసంలో తుదిశ్వాస విడిచారు.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot