జియో నుంచి ఈ ఏడాది రానున్న మెరుపులు ఇవే !

Written By:

టెలికం రంగాన్ని కుదిపేసిన రిలయన్స్ జియో ఈ ఏడాదిలో మరిన్ని సంచలనాలు నమోదు చేయబోతోంది. డీటీహెచ్, హోమ్ బ్రాండు లాంటి సర్వీసులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే జియోకు సంబంధించిన వర్గాలు చెప్పిన మేరకు 2017 లో ఐదు సంచలన సర్వీసులు రాబోతున్నాయని తెలిసింది. వాటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

4జీ ఫీచర్ ఫోన్ రూ. 1500కే ?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో డీటీహెచ్ సర్వీసు

350 ప్లస్ ఛానల్స్, వాటిలో 50కి పైగా హెచ్‌డీ ఛానల్స్ తో జియో డైరెక్ట్ టూ హోమ్(డీటీహెచ్) టీవీ సర్వీసుల్లోకి అరంగేట్రం చేసేందుకు సిద్ధమవుతోంది. వచ్చే నెలలోనే వీటిని ప్రారంభించబోతున్నట్టు కంపెనీ ప్రతినిధులు కూడా చెప్పారు. .

జియో టీవీ యాప్ తో పాటు జియో సిమ్

ఈ సర్వీసులను వాడుకునేందుకు జియో టీవీ యాప్ తో పాటు యూజర్ల ఫోన్లలో జియో సిమ్ ను కలిగి ఉండాలి. అచ్చం ఎయిర్ టెల్ ఇంటర్నెట్ టీవీ సెట్ ఆఫ్ బాక్స్ లాగానే ఈసర్వీసులు కూడా ఉండనున్నాయి

రిలయన్స్ జియో బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు

1జీబీపీఎస్ స్పీడుతో జియో తన 'ఫైబర్ టూ ది హోమ్' బ్రాడు బ్యాండు సర్వీసులను ఈ ఏడాదిలోనే లాంచ్ చేసేందుకు ప్లాన్ వేస్తోందని తెలుస్తోంది. ఈ పైలట్ ప్రొగ్రామ్ ఇప్పటికే ప్రారంభించామని రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యూ1 ఫలితాల సందర్భంగా కంపెనీ ప్రకటించింది. వీటిని మరిన్ని నగరాలకు విస్తరించనున్నామని వెల్లడించింది.

జియో హోమ్ బ్రాడు బ్యాండు లాంచ్ తేదీలను, ధరలను

అయితే రిలయన్స్ జియో హోమ్ బ్రాడు బ్యాండు లాంచ్ తేదీలను, ధరలను కంపెనీ ప్రకటించలేదు. ఫైబర్ టు ద హోమ్ (FTTH) టెక్నాలజీ పై రూపొందించబడిన జియో బ్రాడ్‌బ్యాండ్ మినిమమ్ 100Mbps స్పీడ్‌ను ఆఫర్ చేయగలదట.

జియో మనీ

ఈ సర్వీసులు కంపెనీ కొత్తగా ఆఫర్ చేసేవి కానప్పటికీ, జియో మనీని మరింత ప్రమోట్ చేసేందుకు ఈ ఏడాది పెద్ద ప్లాన్ నే కంపెనీ రచిస్తోంది. ఎంపికచేసిన రిటైల్ అవుట్ లెట్లలో ప్రస్తుతం రిలయన్స్ పేమెంట్ సర్వీసులను యూజర్లు వాడుకోవచ్చు. అన్ని కొనుగోళ్లకు జియో మనీ ఉపయోగపడేలా దీన్ని తీర్చిదిద్దుతున్నారని తెలుస్తోంది.

4జీ వాయిస్ ఓవర్ ఫీచర్ ఫోన్

గతేడాది నుంచే ఈ 4జీ వాయిస్ ఓవర్ ఫీచర్ ఫోన్ ఇలా ఉంటుంది, అలా ఉంటుందని పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ మొబైల్ ను ఈ ఏడాదే తీసుకొచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుందట. 

మైజియో, జియోటీవీ, జియో సినిమా, జియోమ్యూజిక్ యాప్స్

ఆన్ లైన్ లో లీకైన వివరాల ప్రకారం ఫీచర్ ఫోన్ మైజియో, జియోటీవీ, జియో సినిమా, జియోమ్యూజిక్ యాప్స్ హార్డ్ వేర్ బటన్స్ ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ ధర కూడా చౌకగా 999 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు ఉండొచ్చని టాక్.

హోమ్ ఆటోమేషన్ అండ్ ఇతర స్మార్ట్ ఉత్పత్తులు

జియో బ్రాడ్ బ్యాండుకు అనుసంధానంగా ఉండే మరిన్ని హోమ్ ఆటోమేషన్ ఉత్పత్తులను కూడా అందించనున్నట్టు తెలుస్తోంది. జియో ఫైబర్ టెక్నాలజీ పై స్పందించగలిగే ఈ ఆటోమేషన్ ప్రొడక్ట్స్ ద్వారా స్మార్ట్ హోమ్ అనుభూతులను ఆస్వాదించే వీలుంటుందని కంపెనీ చెబుతోంది. 

కొత్త యాప్ జియో మీడియాషేర్

కొత్త యాప్ జియో మీడియాషేర్ ను కూడా రూపొందిస్తున్నట్టు కంపెనీ చెప్పింది. పీసీ, ల్యాప్ టాప్ నుంచి తేలికగా స్ట్రీమ్ కంటెంట్ ను మీ మొబైల్ డివైజ్ పైకి పొందవచ్చని సమాచారం. జియో ఇప్పటికే క్రోమోకాస్ట్ ను అభివృద్ధి చేసింది. ఇది పెద్దస్క్రీన్లపై చూసిన అనుభూతిని డివైజ్ లపై పొందవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 Things to Expect From Reliance Jio in 2017 read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot