ఫోన్‌లను ఛార్జ్ చేసే స్మార్ట్ టేబుల్

Written By:

కాఫీ మీద మక్కువతో ఇద్దరు యూనివర్శిటీ విద్యార్థులు రూపొందించిన స్మార్ట్ టేబుల్ డెన్‌మార్క్‌లో సంచలనం రేపుతోంది. ఈ టేబుల్ పై ఉత్పన్నమయ్యే వేడితో ఫోన్‌లను ఛార్జ్ చేసేయవచ్చు. ఈ వినూత్నఆవిష్కరణకు ఊపరి పోసిన ఇద్దరి విద్యార్థుల్లో ఒకరు భారత సంతతికి చెందిన వారు కావటం విశేషం.

 ఫోన్‌లను ఛార్జ్ చేసే స్మార్ట్ టేబుల్

IKEA అనే ప్రముఖ ఫర్నిచర్ సంస్థ భాగస్వామ్యంతో అభివృద్థి చేసిన ఈ స్మార్ట్ టేబుల్ ప్రస్తుతం డెవలపింగ్ స్థాయిలో ఉంది. కమర్షియల్ మార్కెట్లోకి కొంత సమయం పడుతుంది. ఈ ప్రత్యేకమైన కిచెన్ టేబుల్ హాట్ ఫుడ్‌ల నుంచి జనరేట్ అయ్యే వేడిని గ్రహించుకుని ఆ శక్తిని పవర్‌గా మార్చి ఫోన్‌లను ఛార్జ్ చేస్తుంది. ఈ ఆకర్షణీయమైన గాడ్జెట్‌కు సంబంధించిన 5 ఆసక్తికర విషయాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు..

Read More : 5 మోటరోలా ఫోన్‌ల పై Amazon Indiaలో భారీ తగ్గింపు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫోన్‌లను ఛార్జ్ చేసే స్మార్ట్ టేబుల్

ప్రత్యేకమైన జీనియస్ డిజైన్‌తో అభివృద్ధి చేయబడిన ఈ స్మార్ట్ టేబుల్ వేడిని, విద్యుత్‌గా మలిచి ఫోన్‌లను ఛార్జ్ చేస్తుంది. ఈ టేబుల్ పై ఒక్క కాఫీ మగ్ మాత్రమే కాదు వేడిగా ఉండే ఎటువంటి ఆహారాన్ని ఉంచినా సరే కరెంటు జనరేట్ అవుతుంది.

ఫోన్‌లను ఛార్జ్ చేసే స్మార్ట్ టేబుల్

టేబుల్ పై ప్లస్ మార్క్‌తో ఏర్పాటు చేసిన స్పాట్ పై మీ ఫోన్‌ను ఉంచటం ద్వారా డివైస్ ఛార్జ్ అవటం ప్రారంభిస్తుంది.

ఫోన్‌లను ఛార్జ్ చేసే స్మార్ట్ టేబుల్

Heat Harvest పేరుతో చేపట్టబడిన ఈ ప్రాజెక్టు స్పేస్ 10 ల్యాబ్ నుంచి బయటుకొచ్చింది. ఆధునిక జీవనశైలికి అనుగుణంగా ఈ ప్రొడక్ట్‌ను డిజైన్ చేసారు.

ఫోన్‌లను ఛార్జ్ చేసే స్మార్ట్ టేబుల్

హీటి హార్వెస్ట్ స్మార్ట్ టేబుల్ పై ఇతర గృహోపకరణాలను ఉంచి వాటి నుంచి వచ్చే వేడితో ఉచిత విద్యుత్‌ను పొందవచ్చు.

ఫోన్‌లను ఛార్జ్ చేసే స్మార్ట్ టేబుల్

ఈ వినూత్న టేబుల్ కమర్షియల్‌గా అందుబాటులోకి వచ్చినట్లయితే వైర్‌లెస్ ఛార్జింగ్ కొత్త టర్న్ తీసుకున్నట్లే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 Things to know about Smart Table that Charges Phone. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot