అడుగడుగునా బ్యాక్టీరియా.. తస్మాత్ జాగ్రత్త!

Posted By:

రోజుకు ఎన్నిసార్లు మీ మొబైల్ ఫోన్‌ను టచ్ చేస్తున్నారు..? ఫోన్‌ను తాకిన ప్రతిసారీ మీ చేతుల్లోకి ఎంత బ్యాక్టీరియా మిమ్మల్ని చుట్టుముడుతుంది..? అసలు మీ చేతుల్లోని స్మార్ట్‌ఫోన్‌లు ఎంత డర్టీగా ఉంటున్నాయో, మీకు తెలుసా..?, మురికి వస్తువులను పుట్టుకున్న ప్రతిసారీ చేతులను శుభ్రంగా కుడుక్కుంటాం. అలాంటిది, వివిధ రకాల బ్యాక్టీరియాలతో నిండే ఉండే మొబైల్ ఫోన్‌లను తాకిన ప్రతిసారీ చేతులను శుభ్రం చేసుకుంటున్నామా..?

(చదవండి: క్రేజీ వర్క్ స్టేషన్స్.. మీ కోసమే!)

నిత్యావసర సాధానల్లో ఒకటైన మొబైల్ ఫోన్ గురించి ఆసక్తికర వివరాలు బహిర్గతమయ్యాయి. పలు పరిశోధనల ద్వారా వెల్లడైన వివరాల మేరకు మొబైల్ ఫోన్‌లు 85శాతం కామన్ బ్యాక్టీరియాతో నిండి ఉంటున్నాయట. మనకు తెలియకుండా మనల్ని చుట్టుముడుతోన్న బ్యాక్టిరీయా గురించి పలు ఆసక్తికర విషయాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

అడుగడుగునా బ్యాక్టీరియా.. తస్మాత్ జాగ్రత్త!

పబ్లిక్ టాయిలెట్స్ కంటే ఎక్కువ బ్యాక్టీరియా

మీకు తెలుసా మీ సెల్‌ఫోన్, పబ్లిక్ టాయిలెట్‌లలో ఉండే క్రిముల కంటే ఎక్కువ క్రిములను కలిగి ఉంటుందట. సగటు టచ్‌స్ర్కీన్ స్మార్ట్‌ఫోన్‌లో, ఒక్కో చదరపు అంగుళం 25,000 క్రిములను కలిగి ఉంటుందట. అదే సమయంలో పబ్లిక్ టాయిలెట్‌లు చదరపు అంగుళానికి 1,201 బ్యాక్టీరియాలను కలిగి ఉంటుందట.

 

అడుగడుగునా బ్యాక్టీరియా.. తస్మాత్ జాగ్రత్త!

తలుపు గుబ్బలు

డోర్ క్నాబ్స్ (తలుపు గుబ్బలు), ఇవి కూడా బ్యాక్టీరియా కేంద్రాలేనట. వీటి ద్వారా కూడా మీ చేతుల్లోకి బ్యాక్టీరియా సంక్రమించే అవకాశముందట. డోర్ క్నాబ్స్ ఒక్కో చదరపు అంగుళానికి గాను 8,643 బ్యాక్టీరియాలను కలిగి ఉంటుదట.

 

అడుగడుగునా బ్యాక్టీరియా.. తస్మాత్ జాగ్రత్త!

కిచెన్ కౌంటర్స్

సాధారణంగా వంట గది క్రిములతో నిండి ఉంటుంది. కిచెన్ కౌంటర్స్‌లో చదరపు అంగుళానికి గాను 1736 బ్యాక్టిరియా తిష్టవేస్తుందట.

 

అడుగడుగునా బ్యాక్టీరియా.. తస్మాత్ జాగ్రత్త!

పెట్స్ ఈటింగ్ బౌల్

పెట్స్ ఈటింగ్ బౌల్, ఇది కూడా క్రిములతో నిండి ఉండే ప్రదేశమే. సగటు పెట్ ఈటింగ్ బౌల్ చదరపు అంగుళానికి 2,110 బ్యాక్టిరియాలను కలిగి ఉంటుందట.

 

అడుగడుగునా బ్యాక్టీరియా.. తస్మాత్ జాగ్రత్త!

సెల్ఫ్- సెర్వ్ చెక్‌అవుట్ స్ర్కీన్

మనం రోజు ఉపయోగించే ఏటీఎమ్ స్ర్కీన్ చదరపు అంగుళానికి గాను 4,500 బ్యాక్టిరియాలను కలిగి ఉంటుందట.

 

అడుగడుగునా బ్యాక్టీరియా.. తస్మాత్ జాగ్రత్త!

ఫోన్‌ను క్లీన్‌గా ఉంచేందుకు టూల్స్

మీ స్మార్ట్‌ఫోన్‌ను బ్యాక్టీరియా ఫ్రీగా ఉంచేందుకు అనేక ఉత్పత్తులు మార్కెట్లో సిద్ధంగా ఉన్నాయి. అయితే, వీటిలో కొత్త ఉత్పత్తులు స్ర్కీన్ కోటింగ్‌లను దెబ్బతీసేలా ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్ బ్యాక్టీరియాను తొలగించేందుకు యూవీ లైట్ క్లీనర్‌లు అందుబాటులోకి ఉన్నప్పటికి అవి చాలా ఖరీదులో లభ్యమవుతున్నాయి. అయితే, తక్కువ ధరలో మీ స్మార్ట్‌ఫోన్‌ను నీటితో శుభ్రం చేసుకునేందుకు dirtyphones.org చక్కటి ఉపాయంతో ముందుకొచ్చింది. అదేంటో తెలుసుకునేందుకు dirtyphones.orgలోకి లాగిన్ అవ్వాల్సిందే. 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
5 Things That Are Cleaner Than Your Smartphone. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot