Home
News

మూడో కంటికి తెలియకుండా చూసే ముచ్చటైన 5 మార్గాలు

నేటి టెక్నాలజీ యుగంలో ప్రైవసీ అనేది చాలా ముఖ్యమైనది. ఇద్దరు వ్యక్తులు, చాట్ లేదా, మెయిల్ లేదా, కాల్ చేసుకునేటప్పుడు ఆ కనెక్షన్ ఎన్‌క్రిప్టెడ్ అవునా కాదా అనేది చాలా కీలకమైనది.

By M Krishna Adithya

నేటి టెక్నాలజీ యుగంలో ప్రైవసీ అనేది చాలా ముఖ్యమైనది. ఇద్దరు వ్యక్తులు, చాట్ లేదా, మెయిల్ లేదా, కాల్ చేసుకునేటప్పుడు ఆ కనెక్షన్ ఎన్‌క్రిప్టెడ్ అవునా కాదా అనేది చాలా కీలకమైనది. లేకపోతే మీ ప్రైవసీ భంగం కలిగే ప్రమాదం ఉంది. కొద్ది సంవత్సరాల క్రితమే ఎడ్వర్డ్ స్నోడెన్ ప్రభుత్వాలు డేటాను ఎలా దుర్వినియోగం చేస్తాయనేది నిరూపించాడు. ఈ నేపథ్యంలో ఎన్ క్రిప్టెడ్ కాల్స్, చాట్స్ గురించి ప్రజలు తెలుసుకోవడం చాలా ఆవశ్యకం. నిజానికి ఎన్‌క్రిప్టెడ్ మెసేజెస్ అనేవి ఎప్పటి నుంచో ఉన్నదే. కానీ వాటి ఆవశ్యకత మాత్రం ఈ మధ్య కాలంలోనే గుర్తించారు. డిజిటల్ ఎన్‌క్రిప్షన్ అనేది ఇప్పుడు జీవితంలో విడదీయరానిదిగా మారింది. ఇక్కడ కింద పేర్కొన్న 5 యాప్స్ కూడా మీ ప్రైవసీని కాపాడేందుకు చర్యలు తీసుకోవడంలో ముందంజ వేస్తున్నాయి.

వాట్సప్ :

వాట్సప్ :

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరొందిన వాట్సప్ మెసేజింగ్ యాప్, ప్రస్తుతం ఎండ్ అండ్ ఎండ్ ఎన్‌క్రిప్షన్ సర్వీసును అందిస్తోంది. సుమారు 150 కోట్ల మంది వాట్సప్ యూజర్స్ ఎన్ క్రిప్షన్ సర్వీసును డీఫాల్ట్ గా పొందుతున్నారు. కంపెనీలో పనిచేసే సిబ్బంది సహా మూడో కన్ను ఎవరికీ ఈ మెసేజెస్ సర్వీసులో చదివే వీలు లేదు. వాట్పప్ లో మెసేజెస్ సేఫ్ అనే నిపుణులు పేర్కొంటున్నారు.

ప్రొటాన్ మెయిల్ :

ప్రొటాన్ మెయిల్ :

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా జీమెయిల్ ను ఈ మెయిల్ ప్రొవైడర్‌గా వాడుతున్నారు. అయితే ప్రస్తుతం జీమెయిల్ అంతగా సేఫ్ కాదని ఇటీవల పలు సందర్భాల్లో తేలింది. ముఖ్యంగా జీమెయిల్ సర్వీసులో మెయిల్స్ ఇతరులు చదివే అవకాశం ఉంది. అంతే కాదు కుప్పలు తెప్పలుగా వచ్చే అడ్వర్టయిజ్ మెంట్స్ వెనుక డేటాచౌర్యం దాగి ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రొటాన్ మెయిల్ పేరిట సరికొత్త మెయిల్ సర్వీస్ ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ సర్వీసు అందించేందుకు ముందుకు వచ్చింది. ప్రస్తుతానికి ఈ సర్వీసును ఫ్రీగా అందిస్తున్నారు. అయితే లాంగ్ టర్మ్ లో ఉపయోగిస్తే మాత్రం ఈ సర్వీసు ప్రీమియం మెంబర్ షిప్ తీసుకోవాల్సి ఉంటుంది.

పీజీపీ/జీపీజీ :

పీజీపీ/జీపీజీ :

ప్రెట్టీ గూడ్ ప్రైవసీగా పిలువబడే ఈ ఎన్‌క్రిప్షన్ ప్రోగ్రామ్ ద్వారా డ్రైవ్స్, ఈ మెయిల్స్ మరియు ఫైల్స్ క్రిప్టోగ్రఫీ ద్వారా సురక్షితంగా రక్షించబడతాయి.

 వెరా క్రిప్ట్ :

వెరా క్రిప్ట్ :

బ్రౌజింగ్ హిస్టరీ, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, అలాగే రహస్య డాక్యుమెంట్స్ వంటివి కంప్యూటర్స్ లో దాచుకోవడం సహజమే. అయితే మ్యాక్, విండోస్, లైనెక్స్ మూడు ఓఎస్ లలో నూ పనిచేసే ఈ వెరాక్రిప్ట్ స్టోరేజ్ డ్రైవ్స్ లో ఎన్ క్రిప్టెడ్ పార్టిషన్స్ గా సమాచారాన్ని భద్రపరుస్తుంది.

 పెన్ ఇంటర్నేషనల్ :

పెన్ ఇంటర్నేషనల్ :

లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ ఎన్‌జీవో గత కొద్ది సంవత్సరాలుగా భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవలే రష్యా ప్రభుత్వం టెలిగ్రాం యాప్ ను బ్యాన్ చేస్తే ఈ సంస్థ న్యాయపోరాటం చేసింది.

Best Mobiles in India

English summary
Here's how you keep your life discreet and encrypted.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X