కూపన్స్ ద్వారా సాధ్యమైనంత ఎక్కువ డిస్కౌంట్లను పొందటం ఎలా..?

Posted By: BOMMU SIVANJANEYULU

తెలివిగా ఆదా చేసుకోగలుగుతారు. ప్రస్తుత మార్కెట్‌ను పరిశీలించినట్లయితే కూపన్స్ ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది. ఆయా బ్రాండ్స్ లేదా స్టోర్స్ అందించే కూపన్లను వినియోగించుకోవటం ద్వారా ప్రతి కొనుగోలు పైనా డిస్కౌంట్‌ను పొందే వీలుంటుంది. ఈ కూపన్స్ సహాయంతో సరుకులు కొనాలనుకున్నా లేదా ఫ్యామిలీతో ఏదైనా రెస్టారెంట్‌కి వెళ్లాలన్నా, సినిమా చూడాలన్నా డిస్కౌంట్ ధరల పై వాటిని పొందవచ్చు. కూపన్లను వినియోగించుకుంటూ సాధ్యమైనంత ఎక్కువు డిస్కౌంట్లను పొందే మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం.

వాట్సప్, పేటీఎమ్‌లకు గూగుల్ తేజ్ ఝలక్, కొత్తగా చాటింగ్ ఫీచర్..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఒర్పు ఎంతో అవసరం..

కూపన్ల పై ఒకేసారి 80 నుంచి 90 శాతం డిస్కౌంట్లను తీసుకోవాలన్నది అత్యాశే అవుతుంది. ఎక్స్‌ట్రీమ్ కూపనింగ్ అనేది సంచిత ప్రక్రియ. కూపన్లను పిక్ చేసుకుని వాటిని నిల్వ చేసుకునేందుకు చాలా సమయం పడుతుంది. కాబట్టి, కూపన్ల వినియోగం విషయంలో చాలా ఓర్పుతో వ్యవహరించాల్సి ఉంటుంది. వారం వారం వచ్చే కూపన్ డీల్స్ ను సేకరించి వాటిని అవసరమైన షాపింగ్ పైనే వినియోగించుకుంటే మరింత లాభసాటిగా ఉంటుంది.

 

 

పూర్తిస్థాయిలో ఎఫర్ట్స్ పెట్టాలి...

ఎక్స్‌ట్రీమ్ కూపనింగ్ అనేది ఏమాత్రం కష్టతరమైన చర్య కాదు. అయితే, వీటిని వినియోగించుకునే విషయంలో పూర్తిస్థాయి ఎఫర్ట్స్‌ను పెట్టవల్సి ఉంటుంది. కూపన్స్ ద్వారా 50 శాతం కంటే ఎక్కువ మొత్తంలో డిస్కౌంట్లను మీరు పొందాలనుకుంటున్నట్లయితే కూపన్స్‌ను ఓ పద్థతిలో ఆర్గనైజ్ చేసుకుని తెలివిగా వినయోగించుకోవల్సి ఉంటుంది.

బ్రాండ్ లాయల్‌గా ఉండకండి

కూపన్స్ ద్వారా కొనుగోలు చేసే ప్రతి వస్తువు బ్రాండెడ్ వస్తువే అయి ఉంటుంది. అయితే వీటిలో మనుకు నచ్చిన బ్రాండ్స్ ఉండకపోవచ్చు. కాబట్టి కూపన్స్ ద్వారా షాపింగ్ చేస్తున్న సమయంలో పర్టికులర్ బ్రాండ్‌కే స్టిక్ అయి ఉండకుండా ఇతర బ్రాండ్‌లకు కూడా ప్రిఫరెన్స్ ఇవ్వటం మంచిది.

ఒకే చోట వద్దు

కూపన్స్ ద్వారా చేసే షాపింగ్‌ను కేవలం ఒక స్టోర్‌కే పరిమితం చేయకుండా మల్టిపుల్ స్టోర్‌లకు కేటాయించండి. వీకెండ్ డీల్స్ అనేవి తప్పనిసరిగా ఉంటాయి కాబట్టి రెండు మూడు స్టోర్‌లకు వెళ్లటం ద్వారా కోరుకున్న డిస్కౌంట్స్ మీకు లభించే వీలుంటుంది.

కూపన్లను నిల్వ చేసుకోండి

కూప్లను ఎక్కువ సంఖ్యలో నిల్వచేసుకుని వాటాని క్రమ పద్ధతిలో ఆర్గనైజ్ చేసుకోవటం ద్వారా ప్రతి కొనుగోలు పైనా డిస్కౌంట్లు పొందే వీలుంటుంది. మల్టిపుల్ పేపర్లను కొనుగోలు చేయటం ద్వారా మరిన్ని కూపన్లను మీ లిస్ట్‌లో యాడ్ చేసుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Saving money with coupons takes time. There are some very tangible ways to maximize your coupon savings More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot