డిజిటల్ ఇండియాకే దడ : దేశంలో మొబైల్ లేని గ్రామాలు ఎన్నంటే..?

Written By:

దేశం డిజిటల్ ఇండియా అంటూ టెక్నాలజీ రంగంలో అమితవేగంతో దూసుకుపోతుంటే ఇంకా పల్లెల్లో మొబైల్ సౌకర్యాలు లేవంటే ఎవరైనా నమ్మగలరా..ఇది నిజం దాదాపు దేశంలోని 60 వేలకు అటు ఇటుగా గ్రామాల్లో ఫోన్ అంటేనే తెలియదని కేంద్రప్రభుత్వం తెలియజేసింది. లోక్ సభలో ప్రశ్నోతర్తాల సమయంలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖా మంత్రి రవిశంకర ప్రసాద్ ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.

Read more: అత్యంత తక్కువకే 4జీ సేవలు: టెలినార్

డిజిటల్ ఇండియాకే దడ : దేశంలో మొబైల్ లేని గ్రామాలు ఎన్నంటే..?

దేశవ్యాప్తంగా సుమారు 5,97,608 గ్రామాలు ఉంటే వాటిలో 5,41,939 గ్రామాలకు మొబైల్ సర్వీసులు అందుబాటులో లేవని ఆయన అన్నారు. అంటే సుమారు సుమారు 9.31 శాతం గ్రామాలు ఇప్పటి వరకు టెలిఫోన్ సేవలకు నోచుకోలేదు. ప్రతి గ్రామానికి టెలిఫోన్ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 2017 వరకు గ్రామీణ ప్రాంతాలకు టెలిఫోన్ సేవలను 70 శాతం వరకు పెంచేందుకు జాతీయ టెలికాం పాలసీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ఆయన చెప్పారు.

Read more : కామెంట్లతో కొంపలు ముంచుకోకండి

డిజిటల్ ఇండియాకే దడ : దేశంలో మొబైల్ లేని గ్రామాలు ఎన్నంటే..?

టెలికమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు సుమారు 2,199 మొబైల్ టవర్లను ఏర్పాటు చేశామన్నారు. ఆ టవర్ల ఏర్పాటు కోసం సుమారు నాలుగు వేల కోట్లు ఖర్చు అయ్యిందన్నారు. 2015 నాటికిదేశంలో సుమారు 1134 మొబైల్ టవర్లు ప్రసారం ప్రారంభించాయని ఆయన తెలిపారు.

డిజిటల్ ఇండియాకే దడ : దేశంలో మొబైల్ లేని గ్రామాలు ఎన్నంటే..?

డిజిటల్ ఇండియా అంటూ దూసుకుపోతున్న ఇండియాలో ముందు టెలిఫోన్ వ్యవస్థను పటిష్టపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా డిజిటల్ ఇండియా గురించి ఓ 10 విషయాలను తెలుసుకుందాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

2015 జూలై ఫస్ట్ వీక్ న డిజిటల్ ఇండియా

2015 జూలై ఫస్ట్ వీక్ న డిజిటల్ ఇండియా వీక్ గా డిక్లర్ చేశారు. దాదాపు ఇందిరాగాంధీ స్టేడియంలో లాంచ్ చేసిన ఈ కార్యక్రమంలో 8000 నుంచి 10 వేల మంది వరకు హజరయ్యారు.

డిజిటల్ ఇండియాలో ఈ ఎడ్యుకేషన్,

డిజిటల్ ఇండియాలో ఈ ఎడ్యుకేషన్, ఈ సిగ్న్, డిజిటల్ లాకర్, ఈ హెల్త్, నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్ వంటి అంశాలకు ప్రాధాన్యం ఉంది.

2019 నాటికి 2.5 లక్షల గ్రామాలకు బ్రాడ్ బాండ్

ఈ పోగ్రామ్ యెక్క ముఖ్య ఉద్దేశం ప్రతీ గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించడం. 2019 నాటికి 2.5 లక్షల గ్రామాలకు బ్రాడ్ బాండ్ అందించే దిశగా కసరత్తు చేస్తోంది.

మీ డాక్యుమెంట్లు అన్నింటికీ ఆధార్ కార్డ్ ను

మీ డాక్యుమెంట్లు అన్నింటికీ ఆధార్ కార్డ్ ను జత చేయడం జరిగింది. మీకు సంబంధించిన ఏ ఫ్రూప్ అయినా ఆధార్ కార్డ్ అనుసంధానంతో నడుస్తోంది.

పెట్టుబడి అంచనా దాదాపు లక్ష కోట్ల రూపాయలు

ఈ ప్రోగ్రామ్ పెట్టుబడి అంచనా దాదాపు లక్ష కోట్ల రూపాయలు. వచ్చే మూడు నాలుగు సంవత్సరాలకు దీన్ని ఖర్చు చేసేవిధంగా ప్లాన్ చేస్తున్నారు.

కార్యకలాపాలు సెప్టెంబర్ 2014లో మొదలై 2018 వరకు

ఈ ప్రోగ్రాం కార్యకలాపాలు సెప్టెంబర్ 2014లో మొదలై 2018 వరకు నిరాటకంగా సాగేలా ప్రణాళికలు రూపొందించారు.

దాదాపు 15 నుంచి 20 మంది మంత్రులు

డిజిటల్ ఇండియా కార్యక్రమంలో దాదాపు 15 నుంచి 20 మంది మంత్రులు పనిచేస్తున్నారు. అన్ని రంగాల మంత్రులు ఇందులో ఉన్నారు.

2019 నాటికి ప్రతి భారతీయుడు ఓ స్మార్ట్ ఫోన్

2019 నాటికి ప్రతి భారతీయుడు ఓ స్మార్ట్ ఫోన్ కలిగిఉండాలనేది ఈ డిజిటల్ ఇండియా లక్ష్యం

దీనికి ఛైర్మెన్ దేశ ప్రధాని నరేంద్రమోడీ..

దీనికి ఛైర్మెన్ దేశ ప్రధాని నరేంద్రమోడీ..మోడీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ముందుకు దూసుకువెళుతోంది...మోడీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ముందుకు దూసుకువెళుతోంది.

నేషనల్ ఫైబర్ ఆప్టికల్ నెట్ వర్క్

నేషనల్ ఫైబర్ ఆప్టికల్ నెట్ వర్క్ 7 లక్షల కిలోమీటర్ల మేర ఆప్టికల్ పేబర్ వేసేలా ప్రభుత్వం అనుమతులు తీసుకుంది. 250 పంచాయితీలకు కనెక్ట్ అయ్యేలా తన మ్యాప్ ను సిద్ధం చేస్తోంది. వచ్చే మూడేళ్లలో ఇది పూర్తయ్యే అవకాశం ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 55,669 Villages Still Without Mobile Phone Services: Government
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot